పార్టీ అధినేత మనసులో ఉన్న మాటే.. నాయకులూ చెబుతున్నారా..? వైసీపీలో వలంటీర్ల విషయంలో తమ వైఖరిని తేల్చేసిందా..? ఈ రోజు వైసీపీ అధినేత విలేకరుల సమావేశంలో జగన్ సుదీర్ఘంగా ప్రసంగించారు. తమ హయాంలో ఒక్క నోటిఫికేషన్ తోనే 1.34 లక్షల సచివాలయ ఉద్యోగాలు ఇచ్చామని గొప్పగా చెప్పారు. అయితే ఆయన వలంటీర్ల విషయం కనీసం ఊసు ఎత్తకపోవడం గమనార్హం. వలంటీర్ల అంశంపై ఇటీవల జగన్ కు సన్నిహితుడు వైసీపీ నేత …
Read More »ట్యాపింగ్ కేసు… హరీశ్ తర్వాత కేటీఆర్ వంతు
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావును సిట్ అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. అయితే, నైనీ కోల్ బ్లాక్ టెండర్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని, దాని గుట్టు రట్టు చేసినందుకే హరీశ్ రావుకు హుటాహుటిన సిట్ నోటీసులిచ్చి విచారణకు పిలిచారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. అంతేకాదు, రెండేళ్లుగా కార్తీక దీపం సీరియల్ మాదిరిగా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ …
Read More »వాహ్.. వీర మహిళా కానిస్టేబుల్ తో హోం మంత్రి లంచ్
నిబద్ధతతో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది ఉంటారు. విధి నిర్వహణలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా పనిచేసి ఇటు ప్రజల..అటు ప్రభుత్వ మన్ననలు పొందుతుంటారు. ఇక, మరికొందరైతే తాము విధి నిర్వహణలో లేకపోయినా పరిస్థితిని బట్టి విధులు నిర్వర్తించి ప్రత్యేకమైన ప్రశంసలతో పాటు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటారు. మహిళా కానిస్టేబుల్ జయశాంతి ఆ కోవలోకే వస్తారు. అందుకే, ఆమెను ఏపీ హోం మినిస్టర్ వంగలపూడి అనిత చీరసారెలతో ప్రత్యేకంగా సత్కరించారు. …
Read More »విజయ్ పార్టీకి అదిరిపోయే గుర్తు
తమిళనాడు రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికల వేడి ఇప్పుడే మొదలైంది. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దళపతి విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు గుర్తును కేటాయించింది. అరంగేట్రం చేస్తున్న ఈ పార్టీకి ‘విజిల్’ గుర్తును ఖరారు చేస్తూ ఈసీ గురువారం నిర్ణయం తీసుకుంది. విజయ్ బిగిల్ సినిమాను తెలుగులో విజిల్ పేరుతో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.. …
Read More »ఐ-ప్యాక్ ‘మిస్టరీ’ లోన్: రూ.13.5 కోట్ల అసలు కథేంటి?
ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ ఐ-ప్యాక్ (I-PAC) ఆర్థిక లావాదేవీలపై ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నాయి. 2021లో ఈ సంస్థ హర్యానాలోని రోహ్‌తక్ కేంద్రంగా ఉన్న ఒక కంపెనీ నుంచి రూ. 13.5 కోట్ల అన్‌సెక్యూర్డ్ లోన్ పొందినట్లు తన ఆర్థిక నివేదికల్లో పేర్కొంది. అయితే, ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆ అప్పు ఇచ్చిన కంపెనీ మూడేళ్ల ముందే మూతపడిపోవడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఐ-ప్యాక్ తన ఫైలింగ్స్‌లో లోన్ …
Read More »అమరావతిపై పార్లమెంట్‌లో జగన్ వ్యూహం ఏంటి?
మరో ఆరు రోజుల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కీలకంగా అమరావతి రాజధానికి చట్టబద్ధత అంశం ముందుకు రానుంది. అమరావతిని రాజధానిగా ప్రకటించే బిల్లును కేంద్రం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. కూటమి ప్రభుత్వానికి ఇది రాజకీయంగా కీలక మైలురాయిగా మారనుంది. ఈ నేపథ్యంలో వైసీపీ వైఖరి ఏంటన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ రోజు వైసీపీ పార్లమెంటరీ పార్టీ …
Read More »సాగరం నుంచి శిఖరం వరకు… వైసీపీని మరిపిస్తున్న సర్కారు!
పాలన అంటే..కేవలం నాలుగు సంక్షేమ కార్యక్రమాలు.. రెండు అభివృద్ధి ప్రాజెక్టులేనా? అంటే.. ప్రజల కోణంలో చూసుకుంటే.. కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అభివృద్ధి, సంక్షేమాలతోపాటు.. ఒకింత వినోదం, వేడుకలు కూడా ఉండాలని భావిస్తారు. ఈ విషయంలో గత ఐదేళ్లలో వైసీపీ మూతి ముడుచుకుని కూర్చుంది. ఎక్కడా ఒక్క ఈవెంట్ కూడా నిర్వహించలేదు. ఎవరైనా ఈవెంట్లు చేసుకునేందుకు ముందుకు వచ్చినా.. వారిని కూడా తరిమేసింది. దీంతో ప్రజలకు గత ఐదేళ్లు.. వినోదం-వేడుక అనే …
Read More »కవిత విషయంలో బీఆర్ఎస్ సైలెంట్.. రీజన్ ఇదేనా?
బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన కవిత సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో ఆమె తాను అధ్యక్షురాలిగా ఉన్న తెలంగాణ జాగృతి సంస్థనే పార్టీగా మార్చనున్నారని తెలుస్తోంది. దీనిపై పెద్ద ఎత్తున కసరత్తునుకూడా పూర్తి చేశారు. ఇదిలావుంటే.. కవిత తరచుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా తన సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్ సహా.. మాజీ మంత్రి, కేసీఆర్ మేనల్లుడు హరీష్‌రావును కూడా …
Read More »గుడివాడలో అప్పుడు క్యాసినో.. ఇప్పుడు.. ?
గుడివాడ నియోజకవర్గం.. అనగానే… ఒకప్పుడు క్యాసినో.. జూదానికి ప్రతీక. అప్పట్లో ఫైర్ బ్రాండ్ నాయకుడు కొడాలి నాని.. నియోజకవర్గాన్ని తన అడ్డాగా చేసుకుని ముందుకు సాగారు. ఆయన ఏం చేసినా.. ఎవరూ ప్రశ్నించలేని పరిస్థితి ఏర్పడింది. ఎవరైనా ప్రశ్నిస్తే.. బూతులతో విరుచుకుపడిన మంత్రిగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. అయితే.. కాలం మారింది. ప్రజలు ఆయనను ఇంటికి పరిమితం చేశారు. దీంతో గుడివాడలో ఇప్పుడు టీడీపీకి చెందిన వెనిగండ్ల రాము …
Read More »నేనున్నాననీ.. పవన్
కార్యకర్తకు కష్టం వస్తే నేనున్నానంటూ.. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి రుజువు చేశారు. జనసేన కార్యకర్తల సంక్షోభ సమయంలో పార్టీ మొత్తం ఒక కుటుంబంగా నిలబడుతుంది అనే సంకేతాన్ని ఆయన ఇచ్చారు. బుధవారం పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా, పెడన నియోజకవర్గంలోని కృత్తివెన్ను మండల పరిధిలోని పెదచందాల గ్రామానికి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు చందు వీర వెంకట వసంతరాయలు కుటుంబాన్ని పరామర్శించారు. వసంతరాయలు …
Read More »రెండేళ్లలో పెట్టుబడులు గ్రౌండ్ అవుతాయా?
వచ్చే రెండేళ్లలో ఏపీ ముఖ చిత్రం మారనుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఏపీ ఎలా ఉన్నప్పటికీ.. వచ్చే రెండేళ్లలోనే సమూలంగా ఏపీ ముఖ చిత్రం మారిపోతుందని అంచనా వేస్తున్నారు. దీనికి ప్రధానంగా మూడు రీజన్లు కనిపిస్తున్నాయని అంటున్నారు. 1) పెట్టుబడులు గ్రౌండ్ కావడం. 2) ప్రాజెక్టులు పూర్తి చేయడం. 3) పాలన పరంగా మరింత పారదర్శకతకు పెద్దపీట వేయడం. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల ఇమేజ్ మరింత పెరగడం. …
Read More »అమరావతికి చట్టబద్ధత తథ్యమేనా?
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. వచ్చే వారం ప్రారంభమయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రతిపాదనపై కేంద్ర క్యాబినెట్‌లో చర్చించి ఆమోదం పొందిన అనంతరం బిల్లును సభ ముందుకు తీసుకురావాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. 2014 రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates