ట్రాక్టర్ పై మెడలో ఉల్లి దండతో వైఎస్ షర్మిల

ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం వినూత్న నిరసనకు దిగారు. అన్నదాతలకు అండగా, దిగజారుతున్న కనీస మద్ధతు దరలపై దండెత్తేందుకు బయలుదేరిన షర్మిల అందరినీ ఆకట్టుకున్నారు. విజయవాడలొని పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్ర రత్న భవన్ నుంచి బయలుదేరిన ఆమె ఏకంగా ట్రాక్టర్ పై ఎక్కారు. ఆపై తన మెడలో రైతును కన్నీరు పెట్టిస్తున్న ఉల్లిని ఆమె తన మెడలో వేసుకుని సీఎం నారా చంద్రబాబునాయుడు ఇంటికి బయలుదేరారు.

అయితే అప్పటికే మేలుకున్న పోలీసులు ఆంధ్ర రత్న భవన్ బయటే షర్మిలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఫలితంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే తనను చంద్రబాబును కలిపించేదాకా వెనుదిరిగేది లేదని తేల్చి చెప్పిన షర్మిల అక్కడే రోడ్డుపై బైఠాయించారు. అయినా పోలీసులు ఆమెకు విడుదల కల్పించలేదు. అప్పటికి ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

అయినా పోలీసులు షర్మిలను ముందుకు కదలనీయకపోవడంతో ఆమె కోపోద్రిక్తులయ్యారు. పోలీసులను హెచ్చరికలు జారీ చేస్తూ కనిపించారు. అయినప్పటికీ పోలీసులు వెనక్కు తగ్గకపోవడంతో షర్మిలే వెనకడుగు వేయక తప్పలేదు. అసలే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఈ నిరసనలు ఎందుకు అంటూ పోలీసులు షర్మిలను నిలదీశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు రాజకీయ పార్టీలు ఉన్నాయన్న షర్మిల…నేతల హక్కులను కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆమె ఆంధ్ర రత్న భవన్ లోే ప్రెస్ మీట్ పెట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.