Political News

10 మంది మంత్రులకు శ్రీముఖమా?

సీఎం చంద్రబాబు మంత్రి విస్తరణపై తరచుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మంత్రులకు ప్రోగ్రెస్ కార్డులు ఇస్తున్న ప్రతిసారీ ఈ అంశంపై చర్చ నడుస్తోంది. మంత్రి వర్గ ప్రక్షాళనలో వీరిని ఇంటికి పంపిస్తారు, వారిని పంపిస్తారు అంటూ ప్రధాన మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి. అయితే తాజాగా మరో ఆసక్తికర ప్రచారం కూడా వినిపిస్తోంది. ఏకంగా 10 మంది మంత్రులకు చంద్రబాబు శ్రీముఖం ఇవ్వనున్నారు, వారిని తప్పిస్తారని అంటున్నారు. అయితే ఇందులో …

Read More »

విజ‌య‌న్‌.. మూడోసారి విజ‌యం.. ప‌క్కానా?

కేర‌ళం(ఇటీవ‌లే పేరు మార్చారు).. ప్ర‌కృతి శోయ‌గాల‌కు ఆల‌వాల‌మైన దేవుని భూమిగా పేరొందిన ఇక్క‌డ వ‌చ్చే ఏప్రిల్‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ప్ర‌చార ప‌ర్వానికి కేవలం 15 రోజులు మాత్ర‌మే గ‌డువు ఉంది. ఏప్రిల్ 9వ తేదీ ఇక్క‌డ పోలింగ్ జ‌ర‌గ‌నుంది. సో.. ఇక్క‌డ రాజ‌కీయాలు ఎలా ఉన్నాయి.? ఎలాంటి వ్యూహ ప్ర‌తివ్యూహాలు క‌నిపిస్తున్నాయి. ఏ పార్టీ ఎలా ముందుకు సాగుతోంది? అనే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి. వాస్త‌వానికి.. కేర‌ళంలో ప్ర‌తి ఐదేళ్ల‌కు …

Read More »

అసలు ఆస్తులే పంచలేదంటున్న విజయమ్మ… 

దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఆస్తుల వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఇటీవల వై.ఎస్. షర్మిల చేసిన ఘాటు వ్యాఖ్యల అనంతరం ఈ వ్యవహారం మరింత రాజకీయ, కుటుంబ చర్చలకు దారితీసింది. ఈ నేపథ్యంలో తాజాగా వైఎస్ విజయమ్మ స్పందిస్తూ కీలక ప్రకటన విడుదల చేశారు. వైఎస్ విజయమ్మ స్పష్టంచేసిన ప్రకారం., 2009లో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి మరణించే వరకు కుటుంబ ఆస్తుల పంపకం …

Read More »

జ‌గ‌న్ జ‌గ్ర‌త్త‌… అప‌రిచిత ఐఏఎస్‌ లేఖ‌?

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు కొన్ని జాగ్ర‌త్త‌లు సూచిస్తూ.. ఓ అప‌రిచిత ఐఏఎస్ లేఖ రాసిన‌ట్టు వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు. అయితే.. స‌ద‌రు ఐఏఎస్ అధికారి ఎవ‌రు? అనే విష‌యాన్ని మాత్రం గోప్యం ఉంచారు. వాస్త‌వానికి ఆ ఐఏఎస్ అదికారి కూడా త‌న పేరును వెల్ల‌డించ‌కుండానే.. ఈ లేఖ రాసిన‌ట్టు చెబుతున్నారు. గ‌త వైసీపీ హ‌యాంలో కీల‌క పోస్టులో ఉన్న రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన ఐఏఎస్ అధికారే ఈ లేఖ …

Read More »

మంత్రులు కావాల‌నుకున్నోళ్లు…

తెలంగాణ‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మంత్రులు కావాల‌ని..సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో ప‌నిచేయాలని చాలా మంది త‌ల‌పోశారు. గ‌త ఏడాది జ‌రిగిన మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌లో చాలా మంది త‌మ‌కు సీటు ద‌క్కుతుంద‌ని ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ, వారికి ఆశ‌లు ఫ‌లించ‌లేదు. కేవ‌లం ముగ్గురిని మాత్ర‌మే మంత్రి వ‌ర్గంలోకి తీసుకున్నారు. వీరిలో ప్ర‌ముఖ క్రికెట‌ర్ అజారుద్దీన్ కూడా ఉన్నారు. అయితే..అప్ప‌ట్లో మంత్రులు కావాల‌ని అనుకున్న‌వారికి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి.. `విప్‌` …

Read More »

“జగన్ నీకు ఏం అన్యాయం చేశాడు షర్మిలమ్మా?”

వైయస్ షర్మిల ఇటీవల చేసిన తీవ్ర వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పందిస్తూ, “జగన్ నీకు ఏం అన్యాయం చేశాడో చెప్పమ్మా?” అంటూ ప్రశ్నించారు. ఇటీవల షర్మిల మాట్లాడుతూ, “అన్న అనే పదానికే కళంకం తీసుకొచ్చింది వైయస్ జగన్ మోహన్ రెడ్డి” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ఇలాంటి అన్న ఉంటే శత్రువులు అవసరం లేదు” అని …

Read More »

ఇందుమూల‌ముగా.. బీజేపీ సుజ‌నా రూటే సెప‌రేట‌ట‌.. !

బిజెపి తరఫున తొలిసారి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసి విజయం దక్కించుకున్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రముఖ వ్యాపారవేత్త సుజనా చౌదరి తన రూటు సపరేటు అన్నట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇటీవ‌ల ఆయ‌న‌ చేస్తున్న వ్యాఖ్యలు కూటమిలో తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీని ఇరకాటంలో పెడుతున్నాయి. సహజంగా ఇటీవల కాలంలో జరుగుతున్న కొన్ని కొన్ని పరిణామాలపై మూడు పార్టీలు ఉమ్మడిగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాయి. సమస్య ఎవరిదైనా అందరూ …

Read More »

పూజ గదిలో బొమ్మపై క్లారిటీ ఇచ్చిన లోకేష్

ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ తన పూజ గదిలో ఉన్న బొమ్మలపై సోషల్ మీడియాలో వస్తున్న సందేహాలకు స్పష్టత ఇచ్చారు. తన కుమారుడు దేవాంశ్ నారా చిన్ననాటి భక్తిని గుర్తుచేసుకుంటూ ఆయన భావోద్వేగ ట్వీట్ చేశారు. పూజ గదిలో కనిపిస్తున్నవి శివుడు బొమ్మతో పాటు ఒక చిన్న శివలింగమని తెలిపారు. అవి తన కుమారుడు దేవాంశ్ నారా కేవలం నాలుగేళ్ల వయసులో స్వయంగా తయారు చేసినవని …

Read More »

హెచ్చరికలు వృథా.. చర్యలు ఎప్పుడూ?

ఏపీలో టీడీపీ నాయ‌కులు దారి త‌ప్పుతున్నార‌న్న విష‌యంపై స‌మీక్ష‌లు చేయ‌డం.. వారిపై సీరియ‌స్ అయిన‌ట్టుగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం.. ఆన‌క‌… పార్టీ నాయ‌కుల‌కు దారి త‌ప్పుతున్న వారిని స‌రిదిద్దే బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం వ‌ర‌కు టీడీపీ అధినేత‌,. సీఎం చంద్ర‌బాబు ప‌రిమితం అవుతున్నారు. తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు వ‌చ్చిన వారిపై కూడా.. ఇప్ప‌టి వ‌ర‌కు క‌ఠినంగా ఒక్క చ‌ర్చ కూడా తీసుకోలేదు. పైగా.. వారిని హెచ్చ‌రిస్తున్నాం.. అని చెబుతూ.. స‌రిపెట్టుకుంటున్నారు. ఇది …

Read More »

పెద్దిరెడ్డీ అనుచ‌రుల అరెస్టు.. ఏం జ‌రిగింది?

వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్‌గా భావిస్తున్న ఇద్దరు కీలక అనుచరులను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డికి పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేసిన ముని తుకారాం, మరో కీలక అనుచరుడు మాధవరెడ్డిని తిరుపతి జిల్లా మదనపల్లెలో అరెస్టు చేశారు. అనంతరం వారిని విజయవాడకు తరలించారు. ఏంటి కేసు? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 జూలై …

Read More »

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం కాదు. ఉగాది సందర్భంగా పంచాగ కర్త చెప్పిన మాటలివి. ఉగాది వేడుకలలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు పండితులు, సిద్దాంతులతో పంచాంగ శ్రవణం చదివించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్సతీసమేతంగా ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. భాస్కరభట్ల …

Read More »

బ్యాలెట్ పేపరుపై ఒకే పేరు.. ఒకే అభ్యర్థి.. 99.93 శాతం ఓటింగ్!

ఇదేదో చిత్రంగా ఉంది కదా! అనుకుంటున్నారా? కానీ నిజమే. ఎక్కడైనా ఎన్నికలు జరిగితే కనీసం ఒక స్థానానికి ఇద్దరైనా పోటీ చేస్తారు. కానీ అక్కడ మాత్రం ఒకే అభ్యర్థి, ఒకే పేరు. ఓటు వేసేది మాత్రం ప్రజలు. చేసేది ఏముంది.. అదే పేరుకే, అదే నాయకుడికే ఓటేయాలి. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదే ఉత్తర కొరియా పరిస్థితి. ఉత్తర కొరియా అంటేనే నియంత పాలన గుర్తుకు వస్తుంది. …

Read More »