Political News

పోలవరం అవినీతి.. ఇది కదా ట్విస్ట్ అంటే

ఆంధ్రప్రదేశ్ గత తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టుల్లో పోలవరం ఒకటి. ఈ ప్రాజెక్టులో అవినీతి జరుగుతోందంటూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ అప్పట్లో తీవ్ర ఆరోపణలే చేసింది. కానీ అవేమీ పట్టించుకోకుండా బాబు సర్కారు వీలైనంత వేగంగానే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లింది. ఆ ప్రభుత్వమే కొనసాగి ఉంటే ఈపాటికి పోలవం పూర్తి కావచ్చేదేమో. జగన్ సర్కారు వచ్చాక ఈ ప్రాజెక్టు పనులకు బ్రేక్ వేసి.. పనుల్లో అవినీతి మీద …

Read More »

జగన్ అండ్ కోకు షాకిచ్చిన పార్క్ హయత్ ఫుటేజ్?

మూడు.. నాలుగు రోజుల క్రితం రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి.. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా మళ్లీ బాధ్యతలు చేపట్టేందుకు లీగల్ ఫైట్ చేస్తున్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ లు హైదరాబాద్ లోని పార్క్ హయత్ స్టార్ హోటల్ లో కలిసినట్లుగా చెబుతూ.. సీసీ ఫుటేజ్ బయటకు రావటం తెలిసిందే. వ్యూహాత్మకంగా టీవీ చానళ్లకు అందిన ఈ పుటేజ్ లోని అంశాలు రెండు తెలుగు …

Read More »

గుండెలు పిండేలా తెలుగు రాష్ట్రాల్లో ఆ 5 మరణాలు

ఒక రోజులో రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకునే మరణాలు చాలానే ఉంటాయి. కానీ.. శుక్రవారం చోటు చేసుకున్న నాలుగు మరణాలు.. తదనంతర పరిణామాల గురించి తెలిస్తే గుండెలు పిండేసినట్లు కావటమే కాదు.. భయంతో నోట మాట రాదన్నట్లుగా పరిస్థితి ఉంది. మాయదారి రోగం ఏమో కానీ.. మనుషుల్ని కబళించేస్తున్న వైనం ఒక ఎత్తు అయితే.. మరణం తర్వాత చోటు చేసుకునే పరిణామాల గురించి తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. కరోనా …

Read More »

కేసీఆర్ ‘పీవీ’ స్తోత్రం విని తీరాల్సిందే

కొందరి రాజకీయం చూస్తే ముచ్చటేస్తుంది. అతడు సినిమాలో హీరో మహేశ్ బాబు పొలం దగ్గర చేసిన ఫైట్ ను విలన్ తనికెళ్లభరణి వర్ణించినట్లుగా.. ఒక క్రమపద్దతిలో చేసే తీరుకు ఫిదా కావాల్సిందే. అవసరానికి మించిన దూకుడు ప్రదర్శించకుండా.. వైనంగా కొట్టుకుంటూ పోయే తీరుకు రాబోయే రోజుల్లో రాజకీయ పాఠ్యాంశంగా మారుతుందని చెప్పక తప్పదు. మహానుభావుడు పీవీ నరసింహరావును తెలుగు వారంతా గౌరవించాల్సిందే. దేశానికి చాలామంది ప్రధానమంత్రులు అయ్యారు కానీ.. నయా …

Read More »

మానవత్వానికి మచ్చ, జేసీబీలో మృతదేహం తరలింపు

కరోనా మహమ్మారితో మృతి చెందిన వారి మృతదేహాలను ఎవరూ తాకవద్దు. మృతదేహాల నుండి కరోనా మరింతగా వ్యాప్తిస్తుందని తేలింది. కనీసం అయినవారు కూడా ముట్టుకోలేని దారుణ పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ కారణంగా మృతి చెందిన వారిని తీసుకెళ్లి ఖననం చేస్తోన్న విధానం అందరినీ కదిలిస్తోంది. ఎలాగూ చనిపోయాడు. పైగా ముట్టుకోవద్దు. కానీ ఖననం కోసం జాగ్రత్తలు తీసుకొని వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ కనికరం చూపని ఘటనలు బయటపడుతున్నాయి. తాజాగా …

Read More »

రాత్రి పబ్‌జీ గేమ్ ఆడి పొద్దున్నే సైకోలా: జగన్‌పై లోకేష్ తీవ్ర విమర్శలు

దేశంలో డాక్టర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం వైయస్ రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుక్రవారం మండిపడ్డారు. ఎక్కడ చూసినా విధ్వంసం బాగా ఉందని, అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు. జగన్ రాత్రి పబ్‌జీ గేమ్ ఆడుతారని, పొద్దున్నే సైకోలా ప్రజలపై పడతారని తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఈఎస్ఐ స్కాంలో అభియోగాలు ఎదుర్కొంటున్న అచ్చెన్నాయుడు కుటుంబాన్ని కలిసి పరామర్శించిన అనంతరం లోకేష్ మాట్లాడారు. …

Read More »

త‌మిళ‌నాడును కుదిపేస్తున్న లాక‌ప్ డెత్స్

justiceforjeyarajandfenix.. నిన్న సాయంత్రం నుంచి ఇండియా లెవెల్లో టాప్‌లో ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్ ఇది. ఇద్ద‌రు అమాయ‌కుల‌ను పోలీసులు తీవ్రంగా హింసించి వారి మ‌ర‌ణాల‌కు కార‌ణ‌మైన ఉదంతం త‌మిళ‌నాడును కుదిపేస్తోందిప్పుడు. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతాన్ని గుర్తు చేస్తూ అదే స్థాయిలో త‌మిళ‌నాట ఉద్య‌మానికి దారి తీసేలా ఉందీ ఉదంతం. ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తూ.. రాజ‌కీయంగా కూడా దుమారానికి కార‌ణ‌మ‌య్యేలా క‌నిపిస్తున్న ఈ ఉదంతం పూర్తి …

Read More »

కాపీ టు ఎలక్షన్ కమిషన్ – రాజు భలే ఇరుకున పెట్టేశాడే..

రఘురామకృష్ణం రాజు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్. ఎదురే లేనట్లు సాగిపోతున్న అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారాయన. కొన్ని రోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొందరిని తూర్పారబట్టేస్తూ.. నాయకత్వాన్ని కూడా పూచికపుల్లలా తీసిపడేసేలా మాట్లాడేస్తున్నారాయన. ఓవైపు సొంతంగా విడుదల చేసిన వీడియోలు.. మరోవైపు టీవీ చర్చల్లో ఆయన ధాటికి వైకాపా నాయకులు తట్టుకోలేకపోతున్నారు. ఈ విషయంలో కొన్నాళ్లు వేచి …

Read More »

రాష్ట్రంలో మంత్రులు దిష్టిబొమ్మల్లా తయారయ్యారు

తెలంగాణ రాష్ట్రంలో నేత‌ల ప‌రంగా, ఎమ్మెల్యేల సంఖ్య ప‌రంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదాలో ఉన్న‌ప్ప‌టికీ గ‌త కొద్దికాలంగా ముఖ్య‌మైన అంశాల విష‌యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌కు ధీటుగా బీజేపీ స్పందిస్తోంద‌నేది విశ్లేష‌కుల కామెంట్‌. క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతున్న స‌మ‌యంలో అయితే, ఈ రెండు పార్టీల మ‌ద్య మాట‌ల యుద్ధం మ‌రింత పెరిగింది. తాజాగా, తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ మ‌రో సంచ‌ల‌న కామెంట్ …

Read More »

హోటల్ ఎపిసోడ్ తో జగన్ పరివారం తప్పు చేసిందా?

విభజన రేఖలు స్పష్టంగా ఉంటాయి. అదే రంగమైనా కానీ. దూకుడు రాజకీయాలు మొదలైన తర్వాత.. ప్రత్యర్థులపై పైచేయి సాధించటం కోసం ఇష్టారాజ్యంగా వ్యవహరించే తీరు ఈ మధ్యన ఎక్కువైందన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. ప్రతి నాణెనికి బొమ్మ.. బొరుసు ఎలానో.. ప్రతి రంగంలోనూ బయటకు తెలిసే నిజాలతో పాటు.. బయటకు రాని చాలానే విషయాలు ఉంటాయి. ఒకవేళ.. తెలిసినా.. వాటిని బాహాటంగా చర్చించే ప్రయత్నం చేయరు. అలాంటి లక్షణ …

Read More »

ఉలిక్కిపాటు – హైదరాబాదు ఖాళీ !!

నివురు గప్పిన నిప్పులా ఉన్న భాగ్యనగరం ఒక్కసారిగా టెస్టులు పెంచడంతో తన అసలు రూపాన్ని చూపించింది. పదులతో మొదలైన కేసులు వందలకు వేలకు చేరుతున్నాయి. గత వంద రోజుల్లో ఈరోజు తెలంగాణ అత్యధిక స్కోరును నమోదు చేసింది. గత 24 గంటల్లో చేసిన టెస్టుల్లో ఏకంగా 920 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11364 కి చేరింది. 737 కేసులు హైదరాబాదులోనే రావడం సంచలనం అవుతోంది. …

Read More »

బిన్ లాడెన్ ని అమరవీరుడని కీర్తించిన ఇమ్రాన్ ఖాన్

పాకిస్తాన్ తన అసలు రూపం బయటపెట్టుకుంది. టెర్రరిస్టు దేశం అనే ఆరోపణలను నిజం చేసుకుంది. ఒసామా బిన్ లాడెన్ ను అమరవీరుడిగా కీర్తించింది. స్వయంగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్లమెంటు సాక్షిగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యల పట్ల ప్రపంచ దేశాలు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. అంటే వాళ్లంతట వారే ప్రపంచ ఉగ్రవాదిని అమరవీరుడు అనడం అంటే ఉగ్రవాదలకు అండగా నిలుస్తున్నట్లు ప్రకటించడమే అని అర్థం. ఈ …

Read More »