2020 ఆగస్టు 5.. భారత దేశ చరిత్రలో అత్యంత కీలకమైన ఒక రోజు. హిందువులు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న పరిణామం చోటు చేసుకుందీ రోజు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఈ రోజే శంకు స్థాపన జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమంలో ఎంతో వైభవంగా, ఉద్వేగ భరిత వాతావరణంలో జరిగింది. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ సహా ముఖ్య …
Read More »ఐపీఎల్ నుంచి వివో ఔట్.. కానీ ట్విస్ట్ ఏంటంటే?
మొత్తానికి బీసీసీఐ దిగి రాక తప్పలేదు. చైనా వ్యతిరేక ఉద్యమం జోరుగా సాగుతున్న వేళ ఆ దేశానికి చెందిన వివో మొబైల్ కంపెనీని ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్గా కొనసాగించాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించడంపై తీవ్ర స్థాయిలో దుమారం రేగడంతో వెనక్కి తగ్గక తప్పలేదు. ఈ ఏడాదికి ఐపీఎల్ స్పాన్సర్షిప్ నుంచి వివో తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ.. బోర్డు వర్గాలు మాత్రం వివో …
Read More »కొత్త జిల్లాల ఏర్పాటుపై ఉత్తరాంధ్ర వైసీపీ నేతల్లో అసంతృప్తి
వైసీపీ సర్కార్ కు ఓ విషయంలో విపక్షం కన్నా స్వపక్షం నుంచి విమర్శలు ఎక్కువయ్యాయట. కొత్త జిల్లాల ఏర్పాటుతో మరిన్ని పదవులు, నామినేటెడ్ పోస్టులు క్రియేట్ చేయొచ్చన్న సీఎం జగన్ ఆలోచన ఇపుడు ఆయనకే బూమరాంగ్ అవుతోందట. కొత్త జిల్లాల ఏర్పాటుతో తమ ఉనికిని కోల్పోతామంటూ రాష్ట్రంలోని పలువురు వైసీపీ సీనియర్, జూనియర్ నాయకులు సీఎంకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మొర పెట్టుకుంటున్నారట. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు…ఈ …
Read More »విజయసాయిరెడ్డికి ఇది ఎన్నో పదవో తెలుసా?
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గురించి పరిచయం అక్కర లేదు. వైసీపీలో కీలక నేతగా కొనసాగుతోన్న విజయసాయిరెడ్డి….జాతీయ స్థాయిలో వైసీపీ గళం వినిపిస్తుంటారు. ఎన్నో ఏళ్లుగా జగన్ కు వెన్నుదన్నుగా ఉన్న విజయసాయి….వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో అత్యంత కీలక నేతగా మారారు. వైసీపీలో జగన్ తరువాత అత్యంత కీలక నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న విజయసాయిరెడ్డికి ఎన్నో కీలక పదవులు దక్కాయి. వైసీపీ తరఫున 2016లో రాజ్యసభలో ఎంపీగా …
Read More »ఆళ్ల రామకృష్ణారెడ్డిపై చీటింగ్ కేసు
ఏపీలో రాజధాని వికేంద్రీకరణ అంశం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం జరుగుతున్న ప్రయత్నాలపై ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా.. అమరావతి ప్రాంతంలో మాత్రం వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ బిల్లు ఆమోదం పొందడంపై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల …
Read More »వాటర్ బాటిల్ కన్నా తక్కువ ధరలో కరోనా వ్యాక్సిన్
కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అగ్ర రాజ్యం అమెరికా, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం దేశమై భారత్ సహా ఎన్నో దేశాలు కరోనా ధాటికి అల్లాడిపోతున్నాయి. ఈ మహమ్మారి ధాటికి దేశాల ఆర్థిక పునాదులే కదులుతున్నాయి. జనాల కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఈ కష్టాలన్నీ పోవాలంటే వ్యాక్సిన్ రావాలి. వైరస్ను పారదోలాలి. దాని కోసమే అందరూ ఎదురు …
Read More »కరోనా పేరు చెప్పి దోచేస్తున్న ఆసుపత్రులూ.. ఖబర్దార్
తెలంగాణలో కార్పొరేట్ ఆసుపత్రుల అరాచకాలపై ఎన్నో వార్తలు విన్నాం. కన్నాం. జనాలు కరోనా బారిన పడి అన్ని రకాలుగా కుదేలువుతంటే.. ఇదే అదనుగా అయిన కాడికి ఫీజులు బాదేసి దోచుకుంటున్న వైనాలపై ఎన్నో ఉదాహరణలు చూశాం. అయినా ప్రభుత్వం దీనిపై దృష్టిసారించకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. ఐతే తాజాగా హైదరాబాద్ నడిబొడ్డున ఉండే డెక్కన్ ఆసుపత్రి పేషెంట్ల పట్ల మరీ కఠినంగా వ్యవహరించి.. దారుణంగా వ్యవహరిస్తున్న వైనాన్ని ఓ బాధితుడు …
Read More »మూడు రాజధానులపై ఆ సర్వేను గుర్తు చేస్తున్నారు
ఏపీలో మూడు రాజధానుల్ని నిర్మించేందుకు వీలుగా ఏపీ అసెంబ్లీలో బిల్లును ఆమోదించటం.. తాజాగా ఆ బిల్లును గవర్నర్ ఓకే చెప్పటం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు రాజధానులకు అనుకూలంగా ఉన్న వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటే.. అమరావతినే కొత్త రాజధాని అన్నోళ్లు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో కొత్త రాజధాని అమరావతి అని ఫిక్స్ అయిన లక్షలాది మంది పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. వారంతా ఇప్పుడు …
Read More »జగన్కు 48 గంటల గడువిచ్చిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి తరలిస్తూ.. మూడు రాజధానుల తీర్మానానికి గవర్నర్ చేత జగన్ సర్కారు ఆమోద ముద్ర వేయించుకోవడం పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఐతే అమరావతి విషయంలో బాబుకు చిత్త శుధ్ధి ఉన్నా.. లేదంటే మూడు రాజధానుల ప్రతిపాదనపై జనాభిప్రాయం ఏంటో తెలుసుకోవాలన్నా.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాలు విసురుతున్నారు వైకాపా నాయకులు. జనసేనాని …
Read More »జగన్ కు రఘురామకృష్ణంరాజు బస్తీ మే సవాల్
నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం కొంతకాలంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఓ వైపు వైసీపీపై, సీఎం జగన్ పై విమర్శలు గుప్పిస్తోన్న ఆర్ ఆర్ ఆర్…తాను వైసీపీని వీడనంటూ మొండిపట్టు పట్టారు. సొంత పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని లోక్సభ స్పీకర్ కు వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేసినా…ఆ దిశగా …
Read More »14 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవా?
అనంతపురం జిల్లా…ఏపీలోని 13 జిల్లాల్లో ఒకటి…. బ్రిటిష్ హయాంలోనే అత్యధిక పనులు చెల్లించిన ప్రాంతంగా పేరు గాంచిన జిల్లా ఇది. కానీ, ఎన్నో దశాబ్దాలుగా అనంతపురం జిల్లాను కరువు రక్కసి కబలిస్తోంది. వర్షాలు లేక, ఉపాధి దొరక్క…గ్రామాలకు గ్రామాలే వలస వెళ్లిపోతున్నాయి. కొన్ని పల్లెల్లో వృద్ధులు మాత్రమే కనిపిస్తున్నారు. పశువులకు గడ్డి కూడా దొరకని పరిస్థితి ఉందంటే అనంతపురం వెనుకబాటు ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. కరువు, ఏటా తగ్గిపోతున్న వర్షపాతం, …
Read More »అమరావతి పై పవన్ సవాల్.. టీడీపీ, వైసీపీ రెడీనా?
ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కారు పట్టుబట్టి అమరావతి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానిని తరలిస్తూ.. మూడు రాజధానుల ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసుకోవడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. మెతకగా వ్యవహరిస్తున్నారని.. దీన్ని గట్టిగా వ్యతిరేకించట్లేదని కొన్ని వర్గాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ముందు ఆచితూచి మాట్లాడిన పవన్.. తాజాగా కొంచెం ఘాటుగానే మాట్లాడాడు. మూడు రాజధానులపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చర్చ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. అమరావతి …
Read More »