ఓవైపు తెలంగాణలో కరోనా తీవ్రత అంతకంతకూ పెరిగిపోతోంది. పేషెంట్ల సంఖ్య పెరుగుతున్న ఆ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాట్లు లేవన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. ఇన్ని కోట్ల జనాభా ఉన్న రాష్ట్రం మొత్తానికి గాంధీ ఆసుపత్రి ఒక్కదాంట్లో మాత్రమే కోవిడ్ చికిత్స అందుతోంది. గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రి ఏర్పాటు గురించి ప్రకటించారు కానీ.. అది అందుబాటులోకి రాలేదు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తే లక్షలకు లక్షలు బిల్లులు వాయించేస్తున్నారు. దీంతో మధ్యతరగతి, పేద …
Read More »అధ్యక్ష ఎన్నికల్లో ఓడుతున్నానంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ఊహించని రీతిలో విషయాల మీద మాట్లాడటం అందరికి చేతనయ్యే వ్యవహారం కాదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇందుకు మినహాయింపు. పూటకో సంచలనం.. రోజుకో వివాదం అన్నట్లుగా ఆయన పాలన సాగుతోంది. మరికొద్ది నెలల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. తన ప్రధాన అస్త్రమైన భావోద్వేగంతో పాటు.. అన్నింట్లోనూ అమెరికన్లకే పెద్దపీట అంటూ అగ్రరాజ్యానికి ఉండకూడని అవలక్షణాన్ని అంటకట్టిన అధినేతకు ఆయన్ను పలువురు తప్పు పడతారు. అలాంటి ట్రంప్.. త్వరలో …
Read More »ఏపీలో కొత్త ట్రెండ్.. బినామీ పేర్లతో కరోనా పరీక్షలు
ఇప్పటివరకూ బినామీలను చూశాం. బినామీల పేరుతో ఆస్తులు ఉండటాన్ని చూశాం. అందుకు భిన్నంగా కరోనా విరుచుకుపడుతున్న వేళ.. రెండు తెలుగురాష్ట్రాల్లోని రాజకీయ వర్గాల్లోనూ కొత్త గుబులు పుట్టిస్తోంది. తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో కేసుల తీవ్రతగా తక్కువగా ఉన్నట్లు చెబుతారు. తొలుత తెలంగాణలో ఎక్కువ అనిపించినా.. తర్వాతి కాలంలో పరిస్థితి కంట్రోలోకి తెచ్చినట్లుగా సీన్ కనిపించింది. దీంతో.. పలువురు సీఎం కసీఆర్ ను తెగ పొగిడేశారు. తర్వాతి కాలంలో తెలంగాణను దాటేయటమే …
Read More »తెలంగాణకు టెన్షన్ పుట్టిస్తున్న 17 సెకన్ల వీడియో
మాయదారి రోగాన్ని సీరియస్ గా తీసుకునేటోళ్లు ఉన్నారు. లైట్ తీసుకునేటోళ్లు ఉన్నారు. సమస్య తట్టనంతసేపు పట్టనట్లుగా ఉంది.. ఒక్కసారి వచ్చాక ఉక్కిరిబిక్కిరి అయ్యే వారికి కొదవ లేదు. ఎవరూ మహమ్మారి బారిన పడాలని అనుకోరు. కాకుంటే.. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో పాటు.. లెక్క చేయనితనంతో అడ్డంగా బుక్ అయ్యే వారు కొందరైతే.. ఎలాంటి పాపం ఎరుగక చిక్కుకునే వారు మరికొందరు. తాజాగా వైరల్ అవుతున్న పదిహేడు సెకన్ల వీడియో తెలంగాణను వణికిస్తోంది. …
Read More »మోడీకి పర్ ఫెక్ట్ ట్వీట్ పంచ్ అంటే ఇదేనేమో?
విమర్శల మీద విమర్శలు చేసుకుంటూ పోయే కన్నా.. చేసేదేదో దిమ్మ తిరిగిపోయేలా వేస్తే.. దాని లెక్కే వేరుగా ఉంటుంది. దేశ ప్రజల మీద గడిచిన ఇరవై రెండు రోజులుగా మొహమాటం లేని రీతిలో ఆయిల్ కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. పెట్రోల్.. డీజిల్ ధరల్ని భారీగా పెంచేస్తున్న వైనం తెలిసిందే. ఇలాంటివేళ.. విపక్షాలు మొదలు పలు సంస్థలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇక.. సామాన్యుడి వేదన అంతా ఇంతా కాదు. అంతర్జాతీయ …
Read More »పీవీ గురించి మీకు తెలియని కొన్ని సంచలన నిజాలు
పీవీ నరసింహారావు అత్యధిక భాషలు వచ్చిన ప్రధానమంత్రి. ఆయనకు 14 భాషలు వచ్చు. ఏక సంథాగ్రాహి. ఏదైనా నేర్చుకోగలగిన వరం పొందిన కారణజన్ముడు. తన రంగం ఇది అంటూ ఆయన ఆగిపోలేదు. ఆయన నిర్వర్తంచిన ప్రతి పోస్టు ప్రజలకు ఉపయోగపడేలా మలిచారు. ఆయన తీసుకున్నన్ని సంచలన నిర్ణయాలు ఎవరూ తీసుకోలేదు. వాటిలో కొన్ని – — 1948 నుంచి ఐదేళ్ల పాటు కాకతీయ వారపత్రికను నడిపారు. వంద గొప్ప తెలుగు …
Read More »రాజుగారు జగన్ ‘కోడ్’ క్రాక్ చేశారా?
మేం ఇప్పుడు చెప్పే కథనానికి చెప్పే పోలిక కేవలం అర్థం కావటానికే తప్పించి.. మంచి చెడులతో సంబంధం లేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ రోబో చూసే ఉంటారు. అందులో రోబోను క్లోన్ చేసే కాన్సెప్ట్ చూస్తే.. ఒరిజినల్ రోబో శక్తిసామర్థ్యాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉంటుంది. ఇప్పుడు అలాంటిదే ఏపీ రాజకీయాల్లో కనిపిస్తోంది. ముందే చెప్పినట్లు.. ఇక్కడ మంచి చెడుల్ని ప్రస్తావన కంటే కూడా.. ఒరిజినల్ ను క్లోన్ …
Read More »తెలుగు రాష్ట్రాలకు కర్ణాటక లాక్ డౌన్ మోడల్ అవసరం
పాజిటివ్ కేసుల అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. పాత రూల్స్ ను మార్చి సరికొత్త నిబంధనల్ని తెర మీదకు తీసుకురావాల్సిన అవసరాన్ని యడ్డి సర్కారు గుర్తించింది. ఇప్పటివరకూ కర్ణాటక రాష్ట్రంలో రాత్రి వేళలోనే కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఇందుకు భిన్నంగా వచ్చే నెల 5 (జులై) నుంచి సరికొత్త లాక్ డౌన్ ను తెర మీదకు తీసుకురావాలని డిసైడ్ చేశారు. అంతకంతకూ పెరుగుతున్నకేసుల నేపథ్యంలో.. ఆ జోరుకు కళ్లాలు వేసేలా కొత్త …
Read More »పీవీకి సత్య నాదెళ్లకు సంబంధం ఏంటి?
దేశం గర్వించదగ్గ ప్రధాన మంత్రుల్లో పీవీ నరసింహారావు ఒకరు. పైగా మన తెలుగు బిడ్డ. హైదరాబాదులో ఇంకా ఐటీ బూమ్ కూడా రాకముందే 2004లో చనిపోయారు. ఇక సత్య నాదెళ్ల ఇటీవలే వెలుగులోకి వచ్చారు. మన తెలుగువాడే అయినా ఎపుడో విదేశాలకు వెళ్లిపోయారు. అసలు వీరిద్దరు కలిసే అవకాశం ఏ కోశానా లేదే అనుకుంటున్నారా… బహుశా మనం ప్రస్తావించుకునే సంఘటన సత్యనాదెళ్లకు కూడా గుర్తుండుకపోవచ్చు. అలాంటి సంఘటన ఇది. వేణుగోపాల్ …
Read More »కరోనాతో గేమ్స్ మనకు అవసరమా జగన్?
నలుగురికి చెప్పే స్థానంలో ఉన్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. దేశాలకు.. దేశాల్ని.. ఒకే సమయంలో ప్రపంచం మొత్తం ఒకేలాంటి భయం.. ఆందోళనతో ఉక్కిరిబిక్కిరి కావటం ఇప్పటివరకూ గతంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదేమో? రెండు ప్రపంచ యుద్ధాల సమయాల్లోనూ ఇప్పటిమాదిరి యావత్ ప్రపంచం గడగడలాడిపోలేదన్నది మర్చిపోకూడదు. తనకు తిరుగే లేదని విర్రవీగే మనిషికి దిమ్మ తిరిగేలా చేసిన కంటికి కనిపించని కరోనా వైరస్ పుణ్యమా అని 4.93లక్షల మంది ఇప్పటివరకూ మరణించగా.. …
Read More »అటువైపు నుంచి నరుక్కొస్తున్న రాజు గారు
తన కామెంట్లు, చర్యలతో వైసీపీలో అగ్గి రాజేసి, అనంతరం ఆ పార్టీ పెద్దల నుంచి షోకాజ్ నోటీసులు అందుకున్న పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇంకా ఆ దూకుడును కొనసాగిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులపై ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరిన నేపథ్యంలో ఆయన తక్షణమే స్పందించడంతో పాటుగా వారం రోజులు గడువు ఇచ్చినా నోటీసు అందిన మర్నాడే సంజాయిషీ పంపించారు. పార్టీ పేరుపైనే అభ్యంతరం చెప్తూ నోటీస్కు …
Read More »తెలంగాణలో కరోనా.. తొలిసారి ఆ మార్కు
మొన్న 920.. నిన్న 985.. ఇక వెయ్యి మార్కును అందుకోవడం లాంఛమే అనుకుంటున్నారంతా. అదే జరిగిందిప్పుడు. తెలంగాణలో తొలిసారిగా కరోనా కేసులో వెయ్యి మార్కును దాటాయి. రాష్ట్రంలో రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్త మైలురాయిని అందుకున్నాయి. శనివారం రాత్రి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో 1,087 కరోనా పాజిటివ్ కేసులు నమోయ్యాయి. ఒక్క రోజులో కరోనా వల్ల ఆరుగురు మృతి …
Read More »