కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై యుద్ధాన్ని ప్రకటించిన కేసీఆర్.. అందుకు మిగతా ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టే దిశగా వేగంగా సాగుతున్నారు. ప్రధాని మోడీని దేశం నుంచి తరిమికొట్టాలని సంచలన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నానని అంటున్నారు. జనాల మద్దతు ఉంటే కొత్త జాతీయ పార్టీ పెట్టేందుకూ వెనకాడనని స్పష్టం చేశారు. మరోవైపు బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలతో కలిసి కూటమి …
Read More »పోలీస్ స్టేషన్లో ఎంపీ సురేష్ హల్ చల్
విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో వైసీపీ ఎంపీ నందిగం సురేష్ హల్ చల్ చేశారు. తన అనుచరులను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలంటూ ఎస్ ఐ, సిబ్బందితో నందిగం సురేష్, ఆయన అనుచరులు వాగ్వాదానికి దిగారు. అంతేకాదు, ఈ వ్యవహారాన్ని ఫోన్ లో రికార్డు చేస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ పై కూడా సురేష్ అనుచరులు దురుసుగా ప్రవర్తించారు. తన ఫోన్ ఇవ్వాలని కోరిన శ్రీనివాస్ పై సురేష్ అనుచరులు …
Read More »ఎవరూ శాశ్వతం కాదు.. ఇదే జగన్ మాయ
అధికార ప్రభుత్వానికి ఉద్యోగుల విధేయులుగా పని చేయాల్సిందే. లేదంటే అధికారంలో ఉన్న నాయకుల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుగుణంగా నడుచుకున్నా.. కొంతమంది ఉద్యోగులపై సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు సంచలనంగా మారాయి. అధినేతకు కోపం వస్తే ఎంతటి వారికైనా వేటు పోటు తప్పదనేలా పరిస్థితులు మారాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరూ ఏ పదవిలోనూ శాశ్వతం కాదు.. అందరూ జగన్ ఆడించే నాటకంలో పాత్రలు …
Read More »రెండు కత్తులు ఒకే ఒరలో
రాజకీయాలు మహా విచిత్రంగా ఉంటాయి. ప్రత్యర్థి పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం సహజమే. పరిస్థితులను బట్టి మళ్లీ తిరిగి ఒక్కటవడం ఎప్పుడూ కనిపించేది. మరోవైపు ఒకే పార్టీలోని నేతల మధ్య కూడా విభేదాలు వస్తాయి. బద్ధ శత్రువులుగా మారిపోతారు. కానీ మళ్లీ అంతలోనే మిత్రులవుతారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లోనూ అలాంటి అరుదైన దృశ్యమే కనిపించింది. ఒకప్పుడు మాటలతో ఒకరిపై మరొకరు రెచ్చిపోయిన నేతలు ఇప్పుడు ఒక్కచోట …
Read More »సీఎం సొంత జిల్లాకు చెందిన అధికారే ఏపీ కొత్త డీజీపీ
రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డిని అదనపు బాధ్యతలతో నూతన డీజీపీగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. రాజేంద్రనాథ్‌రెడ్డి డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. అంతేకాదు.. సీఎం జగన్ సొంత జిల్లా కడపకు చెందిన వారు. విశాఖపట్నం, విజయవాడ పోలీస్ …
Read More »రాజ్యసభ సీటు.. అలీ కామెంట్ ఇదే!
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాకముందు నుంచే వారి కుటుంబంతో పరిచయం ఉందని సినీ నటుడు అలీ చెప్పారు. ఇవాళ సీఎంతో భేటీ తరువాత మీడియాతో మాట్లాడారు. సోమవారం సీఎంవో నుంచి పిలుపు వచ్చిందని.. అతి త్వరలోనే పార్టీ కార్యాలయం నుంచే ప్రకటన ఉంటుందంటూ వ్యాఖ్యానించారు. సినీనటుడు, వైసీపీ నేత అలీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంతో భేటీ అయ్యారు. అతి త్వరలో పార్టీ …
Read More »కేసీఆర్ తొలి విజయం.. దేవెగౌడ మద్దతు
కేంద్రంలోని బీజేపీ, మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు మద్దతు లభిస్తోంది. తాజాగా మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) జాతీయ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడ… సీఎం కేసీఆర్ కు తన సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. దేశంలో మత తత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు ముఖ్యమంత్రిని అభినందించా రు. ఈ మేరకు కేసీఆర్కు దేవెగౌడ ఫోన్ చేశారు. `’రావు సాబ్… మీరు అద్భుతంగా పోరాడుతున్నారు. మతతత్వ శక్తుల …
Read More »డీజీపీ సవాంగ్ బదిలీ అందుకేనా?: పవన్ ఫైర్
డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. డీజీపీ ఆకస్మిక బదిలీకి కారణాలు ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 3న పీఆర్సీ కోసం చేపట్టిన ఉద్యోగుల ర్యాలీ విజయవంతం వల్లే చేశారా.. లేక ఉద్యోగులను భయపెట్టేందుకు బదిలీ చేశారా అని నిలదీశారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆకస్మిక బదిలీతో మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఘటన గుర్తొస్తోందన్నారు. గౌతమ్ సవాంగ్‌ను ఆకస్మికంగా ఎందుకు మార్చారో …
Read More »అఖిలేష్ ఊ అంటే.. మాయావతి ఊహూ అన్నారా?
దేశంలో ప్రస్తుతం ఎన్నికల వేడి కొనసాగుతోంది. అయిదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు హీటెక్కాయి. ముఖ్యంగా దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలు రణం హోరాహోరీగా సాగుతోంది. ఇప్పటికే అక్కడ రెండు దశల ఎన్నికలు ముగిశాయి. అధికార బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మధ్య అక్కడ ప్రధానంగా పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పాటు బహుజన్ …
Read More »జగన్ జగన్ ఏరివేత మొదలు…
ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనే టెన్షన్ ఇప్పుడు అధికార వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి కారణంగా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా సీఎం జగన్ ఆలోచనల ప్రకారం వెలువడుతున్న అధికారిక ఆదేశాలు. ఏపీ ముఖ్యమంత్రి పాలనను ప్రక్షాళన చేయాలని డిసైడయ్యారని, ఇందులో మొదటి ఫోకస్ తన టీంపైనే పెట్టారని అంటున్నారు. అందులో భాగంగానే …
Read More »సవాంగ్ హయాంలో నాలుగో సింహం.. నగుబాటు!
ఏపీ పోలీసు బాస్.. కేబినెట్ హోదా కూడా ఉన్న అత్యున్నత సాయుధ బలగాల అధికారి.. డీజీపీ గౌతం సవాంగ్ అత్యంత దారుణమైన రీతిలో తన పదవి నుంచి బదిలీ అయ్యారు. అయితే.. గౌతం సవాంగ్ బదిలీ వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ.. ఆయన డీజీపీగా వ్యవహరించిన కాలంలో కంటికి కనిపించని నాలుగో సింహంగా ఉన్న పోలీసులు.. తీవ్రస్థాయిలో నగుబాటుకు గురయ్యారనేది వాస్తవం. ఎందుకంటే…. దీనికి రెండు రకాలకారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి …
Read More »బీజేపీ నేతలు ఇక జుట్టు, గడ్డాలు పెంచుకోవాల్సిందేనా?
కేంద్రంలోని బీజేపీ సర్కారు వర్సెస్ కేసీఆర్ అన్నట్లు ప్రస్తుత రాజకీయ పరిణామాలు మారిపోయాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తుందంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోడీని దేశం నుంచి తరమికొట్టాలంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీను వెళ్లగొట్టేందుకు జనాల మద్దతు ఉంటే కొత్త జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తానని కూడా ప్రకటించారు. మరోవైపు బీజేపీపై పోరుకు పశ్చిమ బెంగాల్ సీఎం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates