జ‌గ‌న్ విశ్వ‌స‌నీయ‌త త‌గ్గుతోందా…!

వైసీపీ అధినేత, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై పార్టీలో విశ్వ‌స‌నీయ‌త‌, న‌మ్మ‌కం ఉన్న విష‌యం తెలిసిందే. ఆయన పేరుతో ఆయ‌న ఫొటోతోనే నాయ‌కులు గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఈ న‌మ్మ‌కం ఇప్పుడు స‌డులుతోంద‌నే భావన రాజ‌కీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఎందుకంటే.. కుటుంబం విషయంలో జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు.. రాష్ట్రంలో చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. చెల్లిని, త‌ల్లిని.. పక్క‌న పెట్టార‌నే వాద‌న ప్ర‌తిప‌క్షం నుంచి వినిపిస్తోంది.

ష‌ర్మిల‌, విజ‌య‌మ్మ‌ల‌ను జ‌గ‌న్ వాడుకుని వ‌దిలేశార‌ని ప్ర‌తిప‌క్ష నేత‌లు చేస్తున్న విమ‌ర్శ‌లు.. ప్ర‌జ‌ల్లోకి బాగా వెళ్తున్నాయి. అదేస‌మ‌యంలో నాయ‌కుల మ‌ధ్య కూడా చర్చ‌కు వ‌స్తున్నాయి. ఇవి నైతికంగా .. జ‌గన్ విశ్వ‌స‌నీయ‌త‌పై తీవ్ర ప్ర‌భావం చూపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. ఇదే ప‌రిస్థితి ఉంటే.. జ‌గ‌న్‌ను న‌మ్మ‌డం క‌ష్ట‌మ‌నే అభిప్రాయం పెరుగుతోంద‌ని అంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ వెంట తిరిగిన వారు కూడా.. ఇప్పుడు ఇదే ఆలోచ‌న‌లో ఉన్నారు.

ముఖ్యంగా గ‌తంలో జ‌గ‌న్ వెంట తిరిగిన వారు.. ఇప్పుడు దూరంగా ఉన్నారు. ఇక‌, ఇప్పుడు ఉన్న వారు కూడా ఆలోచ‌న‌లో ప‌డ్డారు. జ‌గ‌న్‌ను న‌మ్ముకున్నాం.. అయితే.. త‌మ‌ను ఏం చేస్తారో.. ఏమో.. అనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇది వ‌చ్చే ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే.. ఇబ్బంది ఖాయ‌మ‌ని అంటున్నారు. న‌మ్మ‌కం అనే పునాదుల‌పైనే జ‌గ‌న్ చుట్టూ నాయ‌కులు చేరారు. ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చి.. మ‌రీ చేర‌డం వెనుక ఉన్న ప్ర‌ధాన కార‌ణం కూడా ఇదే.

అయితే.. జ‌గ‌న్ ఇప్పుడు ఇదే విశ్వ‌స‌నీయ‌త‌ను కోల్పోతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. త‌న‌ను న‌మ్ముకున్న వారిని ఆయ‌న ప‌క్క‌న పెట్టేస్తున్నార‌ని.. నాయ‌కులు వాపోతున్నారు. ఇలా అయితే.. క‌ష్ట‌మ‌నే భావ‌న కూడా వ్యక్త‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి జ‌గ‌న్‌ను బ‌ల‌ప‌రిచేందుకు నాయ‌కులు ఎవ‌రూ ముందుకు రాక‌పోతే.. ఎలా? కేవ‌లం కొత్త‌వారినే గెలిపించుకోగ‌ల‌ను అనే భావ‌న కూడా స‌రైందేనా? అనే చ‌ర్చ రాజ‌కీయంగా ఊపందుకోవ‌డం గ‌మ‌నార్హం. ఏదేమైనా.. జ‌గ‌న్ అడుగులు వైసీపీలో అభ‌ద్ర‌త‌ను పెంచుతున్నాయ‌న‌డంలో సందేహం లేదు.