డ్రాగన్ సైన్యాలకు మన సైన్యాలు పెద్ద షాకే ఇచ్చాయి. శీతాకాలం మొదలైంది కదా భారత్ సైన్యాలు వెనక్కు వెళ్ళిపోతాయని చైనా ఆశించింది. కానీ మైనస్ డిగ్రీల చలిని సైతం తట్టుకునే ఏర్పాట్లు చేసుకున్న మన సైన్యాలు ఉన్నచోట నుండి ఎక్కడికి కదలకుండా ఉన్నచోటే కూర్చున్నాయి. అంతేకాకుండా యుద్ధ అవసరాలను కూడా మరింతగా పెంచుకోవటం చూసిన డ్రాగన్ కు షాక్ కొట్టినట్లయ్యింది. దాంతో ఏమి చేయాలో తెలీక బిత్తరపోయిన చైనా సైన్యం …
Read More »అమరావతి పై కీలక వ్యాఖ్యలు చేసిన చిన్నమ్మ
ఏపీ రాజధానిగా అమరావతిపై బీజేపీ స్టాండ్ ఏమిటి? అన్నది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఓవైపు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించే సోము వీర్రాజు ఏమో.. ఏపీ రాజధాని అమరావతినే అని చెబుతారు. మరోవైపు రాజధాని అంశంపై కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసే వేళలో ఏపీ రాష్ట్రానికే ఆ నిర్ణయాధికారం అని చెప్పటం.. ఈ డబుల్ స్టాండ్ ఏమిటన్న దానిపై భారీగా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. జాతీయ …
Read More »పదవులు సరే.. పటిష్ట వ్యూహం ఏదీ? టీడీపీపై చర్చ
ఏపీ టీడీపీని సంస్కరించాలి. పార్టీని పటిష్టం చేయాలి. క్షేత్రస్థాయిలో కోల్పోయిన, కోల్పోతున్న విశ్వాసాన్ని మరింత ప్రోది చేయాలి!- ఇదీ.. గడిచిన ఏడాది జరిగిన ఎన్నికల తర్వాత.. అన్ని జిల్లాల నుంచి పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందిన నివేదికల సారాంశం. అంటే.. దీనిని బట్టి.. పార్టీ ఎలాంటి ప్రణాళిక వేసుకోవాలో.. ఎలా వ్యూహాత్మక అడుగులు వేయాలో కొంత మేరకు అర్ధం అవుతూనే ఉంది. మాటలు కాదు.. చేతులు కావాలి! …
Read More »చంద్రబాబుకు డేంజర్ బెల్స్..పెరిగిపోతున్న ప్రత్యేక గ్రూపు
అసెంబ్లీలో చంద్రబాబునాయుడుకు డేంజన్ బెల్స్ మోగేట్లే ఉన్నాయి. టీడీపీకి రాజీనామా చేసిన ఎంఎల్ఏలందరు అసెంబ్లీలో ప్రత్యేక గ్రూపుగా తయారవుతున్నారు. ఇప్పటికి ప్రత్యేక గ్రూపుగా తయారైన ఎంఎల్ఏల సంఖ్య నాలుగుకు చేరుకుంది. మొదటగా పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం ఎంఎల్ఏ తనను అసెంబ్లీలో ప్రత్యేక సభ్యునిగా పరిగణించాలని రిక్వెస్ట్ చేశారు. తనకు టీడీపీకి సంబంధం లేదని కాబట్టి అసెంబ్లీ తాను టీడీపీ సభ్యులతో కలిసి కూర్చునే అవకాశం లేదన్నారు. కాబట్టి తనను …
Read More »అందుకే కదా చైనాను రోగ్ నేషన్ అనేది
ఇందుకే ప్రపంచదేశాల్లో చైనాకు రోగ్ నేషన్ అని పేరుపడిపోయింది. ఎక్కడవకాశాలుంటే అక్కడల్లా భూభాగాలను కబ్జా చేయటమే టార్గెట్ గా పెట్టుకున్నది డ్రాగన్ దేశం. దశాబ్దాల క్రితం భారత్ భూభాగాన్ని ఆక్రమించుకున్నది. ఆ తర్వాత పాకిస్ధాన్ భూముల్లో జెండాలు పాతింది. వ్యాపారం పేరుతో శ్రీలంకలో కూడా భూములను తీసుకుంది. తనకు ఇంతకాలం మద్దతుగా నిలబడ్డ నేపాల్ ను కూడా వదల్లేదు. నేపాల్ లోని భూభాగంలోకి చొచ్చుకుపోవటంతో అక్కడి జనాలు గగ్గోలు పెడుతున్నారు. …
Read More »పురంధరేశ్వరి, డీకే అరుణలకు కీలక పదవులు
2019 ఎన్నికలలో దేశవ్యాప్తంగా బీజేపీ హవా వీచిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ…2024 ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు పోతోంది. ఈ క్రమంలోనే పార్టీకి కొత్తరూపు కల్పించేందుకు నూతన కార్యవర్గాన్ని ఏర్పరిచింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నూతన కార్యవర్గం జాబితాను రూపొందించారు. ఈ జాబితాలో నలుగురు …
Read More »ఒక్క నెలలో ముగ్గురు మంత్రులు బుక్ అయ్యారు
సీఎం జగన్ ఏపీలో పగ్గాలు చేపట్టి 15 నెలలు గడిచాయి. అయితే, ఈ 15 నెలల పాలనలో మొదటి 14నెలలు ఒక ఎత్తు….15వ నెల ఒక ఎత్తు అని చెప్పవచ్చు. పాలన చేపట్టి ఏడాది గడిచేలోపే ఇసుక కొరత, కరోనాతో పాటు జగన్ కు కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. వాటిని ఎలాగోలా మేనేజ్ చేస్తున్న జగన్ కు గత నెల రోజుల కాలంలో ఎదురైన సవాళ్లు బాగానే ఇబ్బంది పెట్టాయి. …
Read More »ఈ ప్రయోగం సక్సెస్ అయితే.. బాబుకు తిరుగులేదుగా!
రాజకీయాల్లో పార్టీల అధిష్టానాలు ప్రయోగాలు చేయడం అనే ప్రక్రియ సర్వసాధారణం. ఎప్పటికప్పుడు మారుతున్న పరిణామాలకు అనుగుణంగా మార్పులను సంతరించుకుంటూ.. ముందుకు సాగకపోతే.. పార్టీల ఉనికికే ప్రమాదం పొటమరిల్లే పరిస్థితి రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలోనూ ఉంది. అందుకే ఎప్పటికప్పడు నవీకరణకు పార్టీలు ప్రధాన ప్రాధాన్యం ఇస్తున్నాయి. రాష్ట్రంలో మరింత భిన్నమైన రాజకీయ వాతావరణం ఉంది. యువ నాయకుడు, వైసీపీ అధినేత జగన్ సీఎంగా ఉన్నారు. ఆయన మంత్రివర్గం సహా పార్టీలోనూ దాదాపు …
Read More »టీడీపీకి ఊహించని షాక్.. గద్దె రాజీనామా
తెలుగుదేశంపార్టీకి ఊహిచని షాక్ తగిలింది. ఎన్టీయార్ పార్టీని పెట్టినప్పటి నుండి పనిచేస్తున్న సీనియర్ నేత గద్దె బాబూరావు ఈరోజు పార్టీకి రాజీనామా చేశారు. బాబూరావు విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎంఎల్ఏగా పనిచేశారు. ఒకసారి ఎంఎల్సీగా పనిచేశారు. బీసీ సామాజికవర్గానికి చెందిన గద్దె విజయనగరం జిల్లాలోని సీనియర్ నేతల్లో ఒకరు. అలాగే ఉత్తరాంధ్రలోని పార్టీ బీసీ నేతల్లో కీలకంగా ఉంటున్నారు. అలాంటిది హఠాత్తుగా గద్దె పార్టీకి రాజీనామా …
Read More »ఎన్డీఏకు హ్యాండిచ్చిన అకాలీదళ్ … వైసిపి జాయినవుతుందా?
కేంద్ర ప్రభుత్వంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఇంతకాలం నమ్మకమైన భాగస్వామిగా ఉన్న అకాలీదళ్ బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నుండి బయటకు వచ్చేసింది. వారం రోజుల క్రితం అకాలీదళ్ ఎంపి హరిసిమ్రత్ కౌర్ తన మంత్రిపదవికి రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల బిల్లుకు నిరసనగానే ఆమె కేంద్రమంత్రిగా రాజీనామా చేశారు. అప్పటి నుండి ఎన్డీఏలో అకాలీదళ్ ఎంతకాలం కంటిన్యు అవుతుందనే విషయంపై …
Read More »జనసేన కాస్ట్లీ సైనికులు
జనసేన అధిపతి పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సభ్యత్వం తీసుకోవాలంటే రూ. 500 చెల్లించాలని డిసైడ్ చేశారు. నిజానికి పార్టీ సభ్యత్వం తీసుకోవాలంటే ఇంత పెద్ద ఎత్తున డబ్బు చెల్లించాలంటే కష్టమేనేమో. ఎందుకంటే పార్టీ సభ్యత్వానికి రూ. 500 చెల్లించటం బహుశా ఏ పార్టీలోను లేదేమో. మరి ఏ పార్టీలోను లేని విధంగా జనసేనలోనే ఎందుకు పెట్టినట్లు ? ఎందుకంటే సభ్యత్వం తీసుకున్న వాళ్ళంతా కచ్చితంగా భవిష్యత్తుల్లో …
Read More »తనను కేసీఆర్ ట్రాప్ చేశారంటున్న డీఎస్
తెలంగాణ సీనియర్ రాజకీయ నేతగా సుపరిచితుడు..ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా వ్యవహరించిన ఆయన ఆచితూచి అన్నట్లుగా మాట్లాడతారు. మిగిలిన వారి మాదిరి తొందరపడటం ఆయనకు అలవాటు ఉంటుంది. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ.. ఎప్పుడేం మాట్లాడాలన్న విషయం మీద పక్కా క్లారిటీతో వ్యవహరించటం కనిపిస్తుంది. తాను అన్న మాటల్ని.. అనలేదని.. మీడియాలో తప్పుగా రాసిందన్న ఆరోపణలు డీఎస్ దగ్గర కనిపించవు. తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ స్థానం నుంచి అనూహ్యంగా …
Read More »