టీవీ ఛానెల్‌లలో చర్చలు, సామాజిక మాధ్యమాల్లో ‘కంగారూ కోర్టు’ల నిర్వహణ దేశ ప్రజాస్వామ్యానికి హానికరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.
మీడియా చర్చలు న్యాయవ్యవస్థ పనితీరు, స్వతంత్రతను ప్రభావితం చేస్తాయన్నారు. మీడియా వ్యక్తం చేస్తున్న పక్షపాత అభిప్రాయాలు, ప్రత్యేక ఎజెండాతో నడిచే చర్చలు భారత ప్రజాస్వామ్యాన్ని రెండడుగులు వెనక్కి వేసేలా చేస్తున్నాయని జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తంచేశారు.
మీడియా ప్రచారం చేస్తున్న ఏకపక్ష అభిప్రాయాలు ప్రజలను ప్రభావితం చేస్తున్నాయని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఈ ప్రచారం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుందని వ్యవస్థకు హాని కలిగిస్తుందని వ్యాఖ్యానించారు.
అనుభవజ్ఞులైన న్యాయమూర్తులు కూడా నిర్ణయం తీసుకోవడానికి కష్టంగా ఉన్న సమస్యలపై మీడియా ‘కంగారూ కోర్టు’లను నడుపుతోందని వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పులపై అవగాహన లేకుండా సమస్యలపై ఒక అజెండాతో నడిచే చర్చలు ప్రజాస్వామ్యానికి హానికరమని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
మీడియా 'కంగారూ కోర్టు'లను నడుపుతున్న విషయాన్ని మనం చూస్తున్నాం. దీనివల్ల కొన్ని సమయాల్లో అనుభవాజ్ఞులైన న్యాయమూర్తులు కూడా నిర్ణయం తీసుకునేందుకు ఇబ్బంది పడాల్సివస్తోంది. కోర్టు తీర్పుల అంశంపై అవగాహన లేకుండా ఒక అజెండాతో నడిచే చర్చలు ప్రజాస్వామ్యానికి హానికరం. మీడియా తన బాధ్యతలను అతిక్రమించి, నిబంధనలు ఉల్లంఘించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని రెండడుగులు వెనక్కి తీసుకెళ్తోంది. ప్రింట్ మీడియాకు ఇప్పటికీ కొంతవరకు జవాబుదారీతనం ఉంది. అని వ్యాఖ్యానించారు.
కానీ ఎలక్ట్రానిక్ మీడియాకు జవాబుదారీతనమే లేదన్నారు. మీడియా స్వీయ నియంత్రణ, పదాల వాడకంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీడియా ప్రధానంగా ఎలక్ట్రానిక్, సామాజిక మాధ్యమాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నాను. మీడియా తన వాణిని ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రగతిశీల, సుసంపన్న, శాంతియుత భారత నిర్మాణం కోసం వినియోగించాలని సీజేఐ సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates