ఏపీ సీఎం జగన్.. సుమారు 36 మందిని ఏరికోరి సలహాదారులుగా నియమించుకున్న విషయం తెలిసిం దే. వీరిలో తనసొంత మీడియాలో పనిచేసే ఉన్నతస్థాయి ఉద్యోగులు కూడా ఉన్నారు. అయితే.. వీరికి అప్పగించిన పనివిషయంలో వారు సక్సెస్ కాలేక పోతున్నారని, రాష్ట్ర ప్రభుత్వంపై వస్తున్న కథనాలను.. లేదా.. వ్యతిరేకతను అరికట్టేందుకు.. లేదా తగ్గించేందుకు వీరు ప్రయత్నాలు చేయలేక పోతున్నారనేది సీఎం జగన్ ఆవేదనగా ఉందని.. వైసీపీ వర్గాలు ముఖ్యంగా తాడేపల్లిలోని కీలక నాయకులు చెబుతున్నారు.
అయితే.. జగన్ ఇవన్నీ ముందుగానే ఊహించారని.. ఈ నేపథ్యంలో కేంద్రాన్ని మేనేజ్ చేసేందుకు.. ముఖ్యంగా తమ ప్రభుత్వంపై నేషనల్ మీడియాలో వ్యతిరేక వార్తలు రాకుండా.. చూసేందుకు.. నేషనల్ మీడియాను కూడా మేనేజ్ చేసేందుకు.. సాక్షిలో కీలక పొజిషన్‌లో ఉన్న దేవులపల్లి అమర్‌కు.. మీడియా సలహాదారు పోస్టును ఇచ్చారు. ఆయనకు ఏకంగా.. 3 లక్షలకు పైగానే వేతనం.. ఇతరత్రా అలవెన్సులు ఇస్తున్నారు. అంతేకాదు..ఈయనను ఢిల్లీలోనే ఉండాలని ఆదేశించారు. దీంతో ఆయన అక్కడే ఉన్నారు.
కానీ, ఇటీవల నాలుగు రోజులుగా కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు.. నేషనల్ మీడియాలోనూ కథనాలు వ్యతిరేకంగా వస్తుండడంతో అసలు అమర్ ఏం చేస్తున్నాడనే విషయం.. వైసీపీ అధినేత జగన్ దృష్టి పెట్టినట్టు సమాచారం. ఈ విషయం తెలిసిన వెంటనే తాడేపల్లికి వచ్చి.. సీఎం జగన్‌తోనే చర్చలు జరపాలని అమర్ సిద్ధమైనట్టు.. వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.యఇతే.. జగన్ మాత్రం ఆయనకు అప్పాయింట్‌మెంట్ ఇవ్వలేదని.. దీంతో ఆయన ఢిల్లీ నుంచి రాలేదన చెబుతున్నారు.
ఈ క్రమంలో అమర్‌ను పక్కకు తప్పించేసే అవకాశం ఉందని.. ఆయన వల్ల తమకు ఎలాంటి ప్రయోజ నం లేదని.. కూడా వైసీపీ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఏ పనికోసం.. ఆయనకు అవకాశం ఇచ్చారో.. ఆ పనిచేయడం లేదు. మరి ఆయనను కొనసాగిస్తారో.. లేదో చూడాలి
అని గుంటూరుకు చెందిన కీలక నాయకుడు, ఎమ్మెల్సీ, నిత్యం తాడేపల్లిలోనే ఉండే ఒక నాయకుడు వ్యాఖ్యానించడం .. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి ఏం చేస్తారో చూడాలి.