పోల‌వ‌రం కోసం కేంద్రంతో యుద్ధాలు చేస్తున్నాం: జ‌గ‌న్

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. పోల‌వ‌రం ప్రాజెక్టుపై సంచ‌ల‌న‌, ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. పోల‌వ‌రం నిర్మాణం పూర్తి చేసేందుకు తాముకేంద్రంతో యుద్ధాలు.. ఫైటింగులు చేస్తున్నామ‌ని చెప్పారు. కొన్ని కొన్ని సార్లు బ్ర‌తిమాలుతున్న‌ట్టు చెప్పారు. అయితే.. కేంద్రం నుంచి నిధులు రావ‌డం లేదన్నారు. ఇక‌, పోల‌వ‌రం క‌ట్టినా.. నీళ్లు పూర్తిగా నింపేది ఉండ‌ద‌ని.. దీనికి కేంద్ర ప్ర‌బుత్వం ఒప్పుకోద‌ని చెప్పారు.

నిధుల విడుదల కోసం తరచూ కేంద్రానికి వినతిపత్రాలు పంపిస్తున్నామని.. సెప్టెంబర్‌ లోగా పోలవరం నిర్వాసితులకు పరిహారం అందిస్తామని సీఎం జగన్.. గోదావరి వరద ముంపు బాధితులతో అన్నారు. అల్లూరి జిల్లా చింతూరు మండలంలో పర్యటించిన సీఎం జగన్‌… కుయుగూరులో వరద బాధితులను పరామర్శించారు. నిర్వాసితులకు పరిహారం ఇచ్చాకే పోలవరంలో నీళ్లు నింపుతామన్న సీఎం జగన్.. ఏ ఒక్కరికీ అన్యాయం జరగనీయబోమన్నారు.

పోలవరం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కోసం కేంద్రంతో కుస్తీపడుతున్నామని సీఎం జగన్ తెలిపారు. పోలవరంలో పూర్తిస్థాయి నీటిమట్టం వరకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కావాలంటే.. మరో రూ.20 వేలు కోట్లు కావాలని వెల్లడించారు. ఇప్పటికే కేంద్రానికి రూ.2,900 కోట్లు ఎదురిచ్చామని.. ఇచ్చింది రాబట్టేందుకే ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. డబ్బు రాబట్టేందుకు కేంద్రంతో యుద్ధాలు, పోరాటాలు చేస్తూనే ఉన్నామని అన్నారు.

పోలవరం నిధుల కోసం తరచూ కేంద్రానికి లేఖలు రాస్తునే ఉన్నామని తెలిపారు. కేంద్రాన్ని అడుగు తూనే ఉన్నాం… బతిమిలాడుతూనే ఉన్నామని పేర్కొన్నారు. అల్లూరి జిల్లా చింతూరు మండలంలో పర్యటించిన సీఎం జగన్‌… కుయుగూరులో వరద బాధితులను పరామర్శించారు. పోలవరం మనం కట్టినా కూడా పూర్తిగా నీరు నింపం అని.. మొదట 41.15 మీటర్ల మేరే నింపుతామని తెలిపారు. పూర్తిగా నీరు నింపే సమయం నాటికి ఏ ఒక్కరికీ నష్టం జరగనివ్వమని స్పష్టం చేశారు.

ఒకేసారి నీరు నింపితే డ్యామ్‌ భద్రతకు ప్రమాదం ఉంటుందని.. డ్యామ్‌లో పూర్తిగా నింపడానికి కేంద్ర జలసంఘం ఒప్పుకోదని వెల్లడించారు. మొదట డ్యామ్‌లో సగం వరకు నీరు నింపుతామని.. ఆ తర్వాత మూడేళ్లలో పూర్తిగా నింపుతామని పేర్కొన్నారు. నిర్వాసితులకు పరిహారం ఇచ్చాకే పోలవరంలో నీళ్లు నింపుతామని సీఎం స్పష్టం చేశారు. అవసరమైతే సొంతంగా ఇచ్చైనా తోడుగా ఉంటానని నిర్వాసితులకు సీఎం హామీ ఇచ్చారు.