మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది ఏపీ సర్కారు. ఒక ఉన్నత పోలీసు అధికారిని బదిలీ చేస్తూ నిర్ణయాన్ని తీసుకోవటం.. అది కూడా రాత్రి పదకొండు గంటల వేళ కావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విశాఖను ఏపీ పరిపాలనా రాజధానిగా జగన్ సర్కారు నిర్ణయం తీసుకోవటం.. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్న వేళ.. కోర్టులో ఈ వ్యవహారంపై వాదనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఆయన్ను బదిలీ …
Read More »అరే.. నాలుగోసారీ జగన్ కల నెరవేరలేదే?
ఒక బలమైన నేత.. ప్రజాదరణ పుష్కలంగా ఉన్న అధినేత పాలనా పరంగా ఒక నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత అది అమలు కాకుండా ఉంటుందా? అన్న ప్రశ్నను సంధిస్తే.. ఎందుకు సాధ్యం కాదు.. ఇట్టే అయిపోతుందన్న మాట నోటి వెంట రావొచ్చు. కానీ.. అంత తేలికైన విషయం కాదన్న నిజం.. తాజాగా పరిణామాన్ని చూస్తే.. అర్థం కాక మానదు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలగా చెప్పే ఒక పథకం.. ఆయన …
Read More »రష్యా వ్యాక్సిన్ – మన సీసీఎంబీ ఏమంది?
ఓపక్క కరోనా దెబ్బకు యావత్ ప్రపంచం కిందా మీదా పడుతున్న వేళ.. వ్యాక్సిన్ రాకకు మరికొన్ని నెలలు పడతాయన్న అంచాలున్న వేళ.. అందరిని సర్ ప్రైజ్ చేస్తూ.. దీనికి వ్యాక్సిన్ వచ్చిందంటూ రష్యా చేసిన ప్రకటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే.. తాను నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ మొదలు.. వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన వివరాలు ప్రపంచానికి పెద్దగా షేర్ చేసుకోకపోవటమే కారణం. మరి.. ఈ వ్యాక్సిన్ ప్రభావం ఎంత? …
Read More »ప్రణబ్ దాదా అస్తమయం !
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజులుగా ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్ లో వెంటిలేటర్‌పై ఉన్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో చికిత్సకు అవయవాలు స్పందించడం మానేశాయి. దురదృష్టవశాత్తూ ఆయన ఈ లోకాన్ని వదిలివెళ్లిపోయారు. కొద్ది గంటల క్రితమే తన తండ్రి ఆరోగ్యం మరింత క్షీణించడంపై కూతురు షర్మిష్టా ముఖర్జీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అంతలోనే ఈ ఘోరం జరిగింది. …
Read More »బెంగళూరు అల్లర్లు.. ఆజ్యం పోసింది ఎవరు?
ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన గ్రీన్ సిటీ బెంగళూరు మంగళవారం రాత్రి అల్లకల్లోలంగా మారిపోయింది. రెండు వర్గాల మధ్య సోషల్ మీడియా వేదికగా జరిగిన పోస్టుల యుద్ధం.. చివరకు నగరంలోని బీజే హళ్లి ప్రాంతాన్ని రావణకాష్టంగా మార్చేసింది. ఈ ఘటనలో ఓ వర్గం వారు తమ మనోభావాలు దెబ్బ తిన్నాయని ఆరోపిస్తూ… అందుకు నిరసనగా నగరంలోని వీధుల్లోకి వచ్చి వీరంగం చేశారు. శాంతిభద్రతల కోసం అహరహం శ్రమిస్తున్న పోలీసులు, పోలీస్ …
Read More »ఏపీ బీజేపీ … కొత్త రాజకీయం !
ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ ఒక డేంజర్ గేమ్ ఆడుతోంది. అది ఆ గేమ్‌లో ప్రజలు బలవుతారో.. లేక ఆ పార్టీనే బలవుతుందో అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది. 2024లో భాజపా-జనసేన కూటమిదే ఏపీలో అధికారం అంటూ ఘనంగా ప్రకటించుకున్నారు కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు. ఐతే దీన్ని సీరియస్‌గా తీసుకున్న వాళ్లు ఆ పార్టీలో అయినా ఉన్నారా అంటే సందేహమే. ఎందుకంటే తర్వాతి ఎన్నికల్లో అధికారం చేపట్టాలంటే.. ఇప్పుడు …
Read More »108 ఆలస్యం… రెండు దారుణాలు
కరోనా సమయంలో రవాణా సౌకర్యం అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లా నూజివీడు మండలం రమణక్కపేటకు చెందిన దుర్గ అనే గర్భిణీ రవాణా సౌకర్యం లేని కారణంగా రోడ్డుమీదే ప్రసవించింది. ఆమె తిరువూరులోని తన సోదరి ఇంటికి వచ్చింది. మంగళవారం పురిటి నొప్పులు రావడంతో 108కి ఫోన్ చేశారు. ఓవైపు చాలాసేపటి వరకు రాకపోవడం, మరోవైపు ప్రయివేటు వాహనాలు లేకపోవడంతో ఆసుపత్రికి నడుస్తూ బయలుదేరింది. …
Read More »జగన్ కీలక నిర్ణయం.. మోపిదేవి సీటు పెన్మత్సకు
ఏపీలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ బరికి వైసీపీ అభ్యర్థిని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేశారు. ఈ నెల 24న జరగనున్న ఈ ఎన్నికలో వైసీపీ తరఫున ఆ పార్టీ సీనియర్ నేత, సోమవారం కన్నుమూసిన పెన్మత్స సాంబశివరాజు తనయుడు పెన్మత్స సురేశ్ బాబు బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు మంగళవారం జగన్.. పెన్మత్స అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. విజయనగరం జిల్లాకు …
Read More »హైదరాబాద్ కాకుండా అమరావతికే ఆ చాన్స్ ఉందట!
కొద్దికాలం కిందటి వరకు హాట్ హాట్‌గా జరిగిన చర్చ ప్రస్తుతం మళ్లీ తెరమీదకు వచ్చింది. దేశానికి రెండో రాజధాని చేయాలనే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోందని అందులో ముఖ్యంగా హైదరాబాద్‌ను సీరియస్‌గా గమనిస్తోందనేది ఆ ప్రచారం సారాంశం. అయితే, ఎంత వైరల్ అయిందో అంతే వేగంగా తెరమరుగు అయిపోయింది. అయితే, మళ్లీ అంశం ప్రస్తావనకు వచ్చింది. అయితే, ఓ నాయకురాలి డిమాండ్ రూపంలో మాత్రమే. నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, మూడు …
Read More »మోడీ ఇమేజ్ ను తమ ఖాతాలో వేసుకుంటున్న 11 రాష్ట్రాలు
రాజకీయాన్ని చదరంగంగా పోల్చేవారెందరో. ఇక్కడ ఎవరికి ఎవరి మీదా ప్రత్యేకమైన అభిమానాలు.. ప్రేమలు ఉండవు. అలా ఉన్నట్లు కనిపిస్తే.. అదంతా మాయనే. ఒకవిధంగా చెబితే.. అదే అసలుసిసలు రాజకీయంగా చెప్పాలి. రాజకీయాల్లో ఒకరి క్రెడిట్ ను మరొకరు తమ ఖాతాలో వేసుకోవటం మామూలే. కేంద్రం అమలు చేసే పథకాల్ని తమ ఖాతాలో వేసుకోవటం.. తరచూరాష్ట్రాలు చేసేవే. తాజాగా ఆ విషయం మీదన కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కు కోపం వచ్చింది. …
Read More »బిగ్ బ్రేకింగ్ – రాజధాని తరలింపు వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల కల మరోసారి వాయిదా పడింది. కోర్టుల్లో కేసులు కొనసాగుతున్న నేపథ్యంలో మరీ ఈ 16వ తేదీ కి విశాఖపట్నంలో రాజధాని పనులు ప్రారంభించడం గాని, తరలించడం గాని దాదాపు అసాధ్యం అని నిశ్చయించుకున్న ఏపీ సర్కారు దీనిపై ఒకడుగు వెనక్కు వేసింది. విశాఖలో పరిపాలన రాజధాని శంకుస్థాపన అధికారికంగా వాయిదా పడింది. సుప్రీం, హైకోర్టుల్లో కేసులుండటం… వాటిలోవాదోపవాదాలు, వాయిదాల నేపథ్యంలో అనుకున్నంత …
Read More »రేవంత్‌కు కాంగ్రెస్‌లో అసలైన ప్రత్యర్థి ఈయనే
జగ్గారెడ్డి… సంగారెడ్డి ఎమ్మెల్యే, తెలంగాణ కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ నేతగా ముద్రపడిన నాయకుడు. తనదైన శైలిలో దూకుడు రాజకీయానికి పెట్టింది పేరయిన జగ్గారెడ్డి దాదాపు గత ఏడాదిగా…తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎప్పుడు విరుచుకుపడతారో…ఎప్పుడు విమర్శలు పక్కన పెట్టి ప్రశంసలు కురిపిస్తారో తెలియకుండా మాట్లాడుతున్నారు. ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం చెప్పిన పంటే వేయాలనే పేర్కొంటూ ఒకవేళ అలా చేయకపోతే రైతుబంధు పథకం వర్తించబోదని కీలక ప్రకటన చేసిన అనంతరం..అప్పటివరకు కేసీఆర్‌ను …
Read More »