తెలంగాణ సీనియర్ నాయకుడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. డేటే లేటు.. ఇది కన్ఫర్మ్ కాగానే ఆయనను పార్టీలో చేర్చేసుకుంటాం
అని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలోనే బీజేపీలోకి చేరనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేరికతో నల్గొండ జిల్లాలో బీజేపీ బలోపేతం అవుతుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. టీఆర్ ఎస్‌పై అవినీతిపై పోరాటం బీజేపీతోనే సాధ్యమవుతుందని నమ్మి కలిసివచ్చేందుకు కోమటిరెడ్డి సిద్ధమయ్యారని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో టీఆర్ ఎస్ కోవర్టు రాజకీయాలను ముందు నుంచీ వ్యతిరేకించిన వ్యక్తి రాజగోపాల్‌రెడ్డి అని తెలిపారు.
తొందరలోనే రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతారని సమచారం వచ్చింది. త్వరలోనే డేట్‌ను ప్రకటిస్తాం. ఆయన రాకతో బీజేపీ ఇంకా బలపడుతోంది. ప్రజల్లో ఇంకా నమ్మకం ఏర్పడుతోంది.
అని బండి వ్యాఖ్యానించారు. మరోవైపు రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం వల్లే ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు.
మలివిడత పాదయాత్ర సన్నాహక సమావేశం పాదయాత్ర ప్రముఖ్ గంగిడి మనోహర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఆగస్టు 2నుంచి ప్రారంభంకానున్న పాదయాత్ర ఏర్పాట్లపై కమిటీ బాధ్యులతో బండి సంజయ్ చర్చించారు. రాష్ట్రంలో బీజేపీకి అనుకూలమైన మార్పు వచ్చిందన్న సంజయ్.. ప్రజా సంగ్రామ యాత్రను కాంగ్రెస్, టీఆర్ ఎస్ తక్కువ అంచనా వేశాయని తెలిపారు. యాదాద్రి నుంచి భద్రకాళి అమ్మవారి ఆలయం వరకు మూడో విడత పాదయాత్ర సాగుతుందని తెలిపారు.