తార‌క్‌ను మ‌భ్య‌పెట్టిన బీజేపీ..?

బీజేపీ అగ్ర‌నేత‌, కేంద్ర మంత్రి అమిత్ షా.. జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో భేటీ అయింది.. కేవ‌లం 45 నిముషాలే అయిన‌ప్ప‌టికీ.. ఈ ఎఫెక్ట్ మాత్రం 48 గంట‌లు గ‌డిచినా కూడా పొలిటీషియ‌న్ల‌ను విడిచి పెట్ట‌డం లేదు. ఏం జ‌రిగింది? ఏ చ‌ర్చించి ఉంటారు?  జూనియ‌ర్ రాజ‌కీయంగా ముందుకు వ‌స్తున్నారా?  వ‌స్తే.. ఎవ‌రి కండువా క‌ప్పుకొంటారు?  ఎవ‌రికి ప్ర‌చారం చేస్తారు? వంటిఅనేక అంశాల‌పై.. గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు ఆరాలు తీస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇటు టాలీవుడ్‌లోనూ త‌మ‌కు ప‌రిచ‌యం ఉన్న వారిని ప్ర‌శ్నిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం టాలీవుడ్‌లోనూ జూనియ‌ర్‌-షా భేటీపై ఆస‌క్తిక‌ర‌చ‌ర్చ సాగుతోంది. వైసీపీ, టీఆర్ ఎస్‌కు చెందినకీల‌క నేత‌లు.. మంత్రుల‌కు సంబంధించిన బంధువులు.. సీనీ రంగంలో ఉన్నారు. దీంతో వీరిని.. వారు ప్ర‌శ్న‌ల‌తో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నార‌ట‌. జూనియ‌ర్ వ్యూహం ఏంటో చెప్పాల‌ని కోరుతున్నార ట‌. దీంతో కొంద‌రు సినీ రంగ పెద్ద‌లు.. దీనిపై స్పందిస్తూ.. జూనియ‌ర్‌కు ఇప్పుడు కెరీరే ఇంపార్టెంట్ అని కుండ‌బ‌ద్ద‌లు కొడుతున్న‌ట్టు స‌మాచారం.

ఆయ‌న ఇప్ప‌ట్లో.. పొలిటిక‌ల్‌సైడ్ వెళ్లే ఆలోచ‌న కూడా చేయ‌డం లేద‌ని.. ఆర్ ఆర్ ఆర్ త‌ర్వాత‌.. అంత‌కన్నా మెగా హిట్ ఇచ్చే ఆలోచ‌న‌లో తార‌క్ ఉన్నాడ‌ని.. సో..ఆయ‌న‌కు రాజ‌కీయాలపై ఇంట్ర‌స్ట్ లేద‌ని చెబుతున్నారు. అంతేకాదు.. ప‌నిలో ప‌నిగా.. అస‌లు.. బీజేపీ వ్యూహాత్మకంగా వ్య‌వ‌హ‌రించింద‌ని.. కామెంట్లు చేస్తున్నారు. “తార‌క్‌కు అస‌లు విష‌యం తెలియ‌దు. వారు చెప్ప‌లేదు. కేవ‌లం సినిమా గురించి అభినందించేందుకే త‌న‌ను పిలుస్తున్నార‌ని.. ఆయ‌న కూడా అనుకున్నారు. తీరా వెళ్లాక‌.. ఇబ్బంది ప‌డిన‌ట్టు ఉన్నారు“ అని అగ్ర నిర్మాత ఒక‌రు.. వైసీపీ నేత‌తో వ్యాఖ్యానించిన‌ట్టు స‌మాచారం.

ఇదిలావుంటే.. తార‌క్ త‌న ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేసుకున్నార‌ని టాలీవుడ్ లో ప్రచారం జ‌రుగుతోంది. ఆయ‌న ఇప్పుడు ఎవరికీ అందుబాటులో లేర‌ని.. ఇంటి నుంచి స‌మాచారం వ‌స్తున్న‌ట్టు చెబుతున్నారు. బీజేపీలోకి త‌న‌ను వ్యూహాత్మ‌కంగా లాగుతున్నార‌నే భావ‌న కావొచ్చు.. లేనిపోని.. రాజ‌కీయ ఇమేజ్ ప‌డితే.. త‌న కెరీర్ దెబ్బ‌తింటుంద‌నే భావ‌న కావొచ్చు.. మొత్తానికి తార‌క్‌.. ఇప్పుడు ఎవ‌రీకి అందుబాటులో లేర‌నేది టాలీవుడ్ మాట‌. ఇదీ.. జ‌రిగింది.