చంద్రబాబుకు అదిరిపోయే ఎలివేషన్

రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ అయిన దువ్వూరి సుబ్బారావు తాజాగా ఒక వైసీపీ ప్రో యూట్యూబ్ ఛానెల్లో చంద్రబాబు నాయుడు గురించి ప్రశ్నించినపుడు చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన ప్రత్యేకత ఏంటో అర్థం అవుతోంది. యాంకర్ చంద్రబాబునాయుడితో మీ అనుభవం గురించి చెప్పమంటే..

“చంద్రబాబు నాయుడి గారి దగ్గర నేను ఐదేళ్లు ఫైనాన్స్ సెక్రటరీగా పని చేశాను. చంద్రబాబుగారు నేను చూసిన రాజకీయ నాయకులతో పోలిస్తే ఆయన చాలా భిన్నం. ఆయన కులంతో పాటు ఇంకే విషయం చూడరు. పని చేస్తారా లేదా అని మాత్రమే చూస్తారు. పని చేసేవాళ్లను దగ్గరికి తీసుకుంటారు. పని చేయని వాళ్లను దూరం పెడతారు. చాలా మోడర్న్‌గా ఆలోచించే పొలిటీషీయన్ ఆయన అని చెప్పాలి. చాలా అడ్వాన్స్‌డ్‌గా ఆలోచించేవారు. ఉదయం 9 గంటలకు ఎలాంటి ఎనర్జీతో కనిపించేవారో.. రాత్రి 9 గంటలకు కూడా అదే ఎనర్జీతో ఉండేవారు. మామూలుగా మనం ఆ సమయానికి డల్ అయిపోతాం. కానీ ఆయన మాత్రం ఆ టైంలోనూ అదే ఎనర్జీతో కనిపించేవారు” అంటూ చంద్రబాబుకు మంచి ఎలివేషన్ ఇచ్చారు చంద్రబాబు.

దువ్వూరి సుబ్బారావు లాంటి గొప్ప, తటస్థ వ్యక్తి చంద్రబాబుకు ఇచ్చిన ఎలివేషన్‌ను గుర్తు చేస్తూనే.. వైఎస్ జగన్‌లోని నెగెటివ్ యాంగిల్‌ను ఎలివేట్ చేసే వీడియోలు పెడుతూ దటీజ్ చంద్రబాబు అంటూ ఆయన మద్దతుదారులు ఎలివేషన్ ఇస్తున్నారు ఆయనకి.