ఏపీకి సీఎంగా.. జగన్ ఉండాలని.. ప్రజలు ఆయనను ఎన్నుకోవాలని..అనేక పూజలు.. వ్రతాలు యాగాలు చేసిన.. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకుడు.. రమణ దీక్షితులు.. మరోసారి తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. వాస్తవానికి.. గత ప్రభుత్వంలోనే ఆయనను పక్కన పెట్టారు. అయితే.. జగన్ రాగానే తనకు తిరిగి ప్రధాన అర్చక బాధ్యతలు అప్పగిస్తారని.. దీక్షితులు ఆశించారు.
అయితే.. అది జరగలేదు. పైగా.. జగన్ మౌఖిక ఆదేశాలు.. దీక్షితులును తీసుకోవాలని.. చెప్పినప్పటికీ.. మాజీ టీడీపీ ఈవో జవహర్‌రెడ్డి.. ఆయనను పక్కన పెట్టారు. ఈ విషయం కొన్నాళ్లుగా నలుగుతూనే ఉంది. అయితే.. దీక్షితులు ఈ విషయంపై కొన్నాళ్లు అంతర్గత ఒత్తిళ్లు తెచ్చారు. అయితే.. దీనివల్ల లాభం లేదని అనుకున్న.. ఆయన.. తరచుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ముఖ్యమంత్రి తిరుమల పర్యటన సందర్భంగా.. మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో అర్చకుల శాశ్వత నియామకంపై ఏక సభ్య కమిటీ నివేదిక ఏమైందని రమణ దీక్షితులు ప్రశ్నించారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన సీఎం జగన్ నుంచి సానుకూల ప్రకటన వస్తుందని ఆయన ఆశించినట్లు కన్పిస్తోంది. జగన్ అలాంటి ప్రకటన చేయకపోవడం తో ఈ మేరకు ఆయన ఘాటు ట్వీట్ చేస్తూ… ఏకసభ్య కమిటీ నివేదిక అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటన కోసం ఎదురు చూసి అర్చకులందరూ విసిగిపోయారని అన్నారు.
అంతేకాదు.. అర్చకులుగా తాము తీవ్రంగా నిరాశ చెందామని పేర్కొన్నారు. టీటీడీలోని బ్రహ్మాణ వ్యతిరేక శక్తులు అర్చక వ్యవస్థను, దేవాలయాలను ధ్వంసం చేయడానికి ముందే కమిటీ నివేదికను అమలు చేయాలని ఆయన కోరారు. ప్రస్తుతం ఈట్వీట్ సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. మరి దీనిపై సర్కారు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates