వైసీపీ మంత్రులు, నాయకులు.. తరచుగా తనపై చేస్తున్న వ్యక్తిగత విమర్శలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. తాజాగా విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ నాయకులు.. తనపై చేస్తున్న విమర్శలు సిల్లీగా ఉన్నాయని అన్నారు. తను మూడు పెళ్లిళ్లు చేసుకు న్నానని.. పదే పదే వ్యాఖ్యానిస్తున్నారని.. ఇది సరికాదని.. హుందాగా కూడా ఉండదని అన్నారు. అంత సరదాగా ఉంటే.. వైసీపీ నాయకులు కూడా.. మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని అన్నారు. ఇప్పుడున్న వాళ్లకు విడాకులు ఇచ్చి.. చేసుకోండి!
అని సటైర్లు వేశారు.
మూడు పెళ్లిళ్లు చేసుకున్నావు.. మూడు రాజధానులు ఉంటే తప్పేంటి? అని వైసీపీ నాయకులు అంటున్నారు. ఇది సరైన లాజిక్ కాదు
అని పవన్ వ్యాఖ్యానించారు. నేను మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని.. మీకెందుకు అంత బాధ. మీరు కూడా చేసుకోండి
అని అన్నారు. ఇదిలావుంటే.. విశాఖను వదిలి వెళ్లాలని.. పోలీసులు పవన్‌కు సూచించినట్టు తెలిసింది. ఆయన విశాఖలోనే ఉంటే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉంటుందని వారు సూచించినట్టు జనసేన వర్గాలు తెలిపాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పవన్.. ఆదివారం విశాఖలో నిర్వహించాల్సిన జనవాణి కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.
చంద్రబాబు ఫైర్..
మరోవైపు.. జనసేన కార్యకర్తల అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే పవన్ పర్యటనను అడ్డుకుందని.. కావాలనే పోలీసులను పంపించి తనఖీలు చేయించిందని అన్నారు. ఎదుటి పార్టీ వాళ్లు ఏం చేయాలో.. కూడా.. అధికార పార్టీనే డిసైడ్ చేస్తుందా? అని ప్రశ్నించారు. జనాలకు ప్రయోజనకరంగా ఉన్న జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే అధికార పార్టీ నాయకులు ఇలా చేస్తున్నారని.. చంద్రబాబు మండిపడ్డారు. ఈ పరిణామాలను గమనిస్తే.. నియంత పాలనకు పరాకాష్టగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.