ఏపీలో ‘ఏకైక’ పోరాటం.. చేతులు క‌లుపుతున్న పార్టీలు!!

‘నువ్వు ఉత్త‌రం అయితే.. నేను ద‌క్షిణం’ అన్న‌ట్టుగా ఉన్న పార్టీల ప‌రిస్థితి ఇక‌.. ప‌క్కకు పోనుందా.. సిద్ధాంతాలు.. రాద్ధాంతాలు.. ఇక‌పై ఉండ‌బోవా?! అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టి వ‌ర‌కు.. ఎదుటి పార్టీకి ముల్లుగుచ్చుకుంటే.. మాకెందుకులే అనుకున్న‌వారంతా.. ఇప్పుడు.. త‌మ దాకా వ‌చ్చేసరికి.. విష‌యం తెలుసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఇక‌, అంద‌రిదీ ఒకే బాట‌.. అన్న‌ట్టుగా ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు .. జ‌న‌సేనను చూసి.. కొన్ని పార్టీలు ధైర్యంగా ఉన్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆపార్టీని ప‌ట్టుకుని.. ముందుకు సాగాల‌ని.. ఆ పార్టీతో క‌లిసి చెలిమి చేయాల‌ని.. అనుకున్నాయి.

అవి క‌మ్యూనిస్టులు కావొచ్చు.. ఇత‌ర పార్టీలు కావొచ్చు. అయితే.. ఇప్పుడు ఆ జ‌న‌సేన‌ను క‌ట్టడి చేసేందుకు వైసీపీ నాయ‌కులు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేశారు. ఈ ప‌రిణామాల‌తో ప్ర‌జ‌ల్లో వేరే సంకేతాలు పంపాల‌నేది.. పాల‌క ప‌క్షం నాయ‌కుల ఆలోచ‌న‌గా ఉంద‌ని.. ప్ర‌త్య‌ర్థి పార్టీలు అంచ‌నా వేస్తున్నాయి. దీనికి ఆదిలోనే చెక్ పెట్టాల‌ని.. నిర్ణ‌యించుకున్నాయి. దీంతో ఎన్నిక‌లు వ‌చ్చే వ‌ర‌కు ఎదురు చూడ‌డం కాదు.. ఇప్ప‌టి నుంచి చేతులు క‌ల‌పాల‌ని.. కీల‌క నేత‌ల మ‌ధ్య ఆలోచ‌న స్ఫురించిన‌ట్టు తెలుస్తోంద‌ని అంటున్నారు. ఒక‌వైపు రాజ‌ధాని రైతులు చేస్తున్న పాద‌యాత్ర‌కు ప్ర‌భుత్వం అడ్డంకులు సృష్టించడం.. మ‌రోవైపు.. ఉత్త‌రాంధ్ర‌లో ఇత‌ర నేత‌ల ప‌ర్య‌ట‌ల‌ను అడ్డుకోవ‌డాన్ని నాయ‌కులు తీవ్రంగానే భావిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే సిద్ధాంతాలు.. రాద్ధాంతాల‌ను ప‌క్క‌న పెట్టాల‌ని.. అన్ని పార్టీలు.. ఒకే మాట‌.. ఒకే బాట‌గా ముందుకు సాగాల‌ని ఒక నిర్ణ‌యానికి వ‌చ్చే లా.. అడుగులు ప‌డుతున్నాయ‌ని అంటున్నారు. దీనికి సంబంధించి వైసీపీయేత‌ర పార్టీల‌న్నీ.. త్వ‌ర‌లోనే తిరుప‌తి వేదిక‌గా.. స‌మావేశం ఏర్పాటు చేసుకుని.. కామ‌న్ అజెండాను రూపొందించుకుని.. ముందుకు సాగాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం విశాఖ‌లో నెల‌కొన్న వివాదం.. మ‌రోవైపు రాజ‌ధాని రైతులు చేస్తున్న పాద‌యాత్రకు అడ్డంకులు.. కీల‌క నేత‌ల‌ను అడ్డుకోవ‌డం.. వంటివి.. పార్టీలు సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోన‌నే అన్ని పార్టీలు చేతులు క‌ల‌ప‌డం ద్వారా.. మ‌ళ్లీ 2009లో ఉమ్మ‌డి ఏపీలో ఏర్ప‌డిన రాజ‌కీయ పరిస్థితిని తీసుకురావాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.