వైసీపీ నేతలు తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్న పరిస్థితిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ఖండించారు. తనకు కూడా.. బూతులు మాట్టాడడం వచ్చన్నారు. అయితే.. సంస్కారం అడ్డు వస్తోందని చెప్పారు. మంగళవారం.. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళగిరిలో పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. ఈ సందర్భంగా వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
“ప్యాకేజీ స్టార్, ప్యాకేజీ స్టార్ అనే ఒక్కొక్క వైసీపీ నాకొడుకులకి చెప్తున్నా, ఇంకొక్క సారి ప్యాకేజీ స్టార్ అంటే చెప్పు తీసుకుని కొడతా వైసీపీ నాకొడకల్లారా ” అంటూ.. తన కాలికి ఉన్న చెప్పు తీసి మరీ చూపించారు.
ఈ సందర్భంగా వైసీపీలోని కాపు నేతలను ఉద్దేశించి కూడా.. పవన్ కీలకవ్యాఖ్యలు చేశారు. కాపు పేరు చెప్పి రాజకీయాలు చేయడం.. తనకు కూడా వచ్చని.. కానీ, కుల రాజకీయాలు చేయకూడదని.. ప్రజల సమస్యలనే రాజకీయంగా చూడాలని భావించానని.. అందుకే ఇప్పటి వరకు మౌనంగా ఉన్నానని.. అన్నారు. కానీ, ఇప్పుడు వైసీపీ కాపు వెధవలను కూడా హెచ్చరిస్తున్నానని.. కాపుల గురించి ముందు తెలుసుకోవాలని.. పవన్ సూచించారు.
“నన్ను గొడవల్లోకి లాగితే.. కొట్టి.. గొంతు పిసికి చంపేస్తా” అని కాపు నేతలను పవన్ హెచ్చరించారు. బాపట్లలో పెరిగానని.. గొడ్డు కారం తిన్నానని.. తనకు కూడా.. పౌరుషం ఉందని.. పవన్ వ్యాఖ్యానించారు. “నేటి నుంచి యుద్ధమే.. మీరు రెడీనా?”అంటూ.. పవన్ సవాల్ విసిరారు. చరిత్ర తెలుసుకోకుండా.. కేవలం బూతుల పంచాంగంతోనే వైసీపీ సన్నాసులు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates