ఒకవైపు.. తెలంగాణలో రాజకీయ వేడి కాకమీదుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గానికి వచ్చిన ఉప ఎన్నికలో విజయం దక్కించుకోవాలని.. అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ కూడా.. పంతంతో ఉన్నాయి. అయితే.. బరిలో మాత్రంహోరా హోరీ పోరు సాగుతోంది. టీఆర్ ఎస్‌కు అనుకూల మీడియా ఉంది. దీంతో ప్రచారం జోరుగా సాగుతుండడంతో కవరేజీ బాగుంది. అయితే.. ఎటొచ్చీ.. కాంగ్రెస్‌కు మీడియా ఏమేరకు సహకరిస్తుందనే వాదన ఉంది. ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ నేతలు.. మీడియా మొఘల్ రామోజీరావుతో భేటీ అయ్యారు.
నేరుగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్లిన.. పీసీసీ చీఫ్ రేవంత్, మరోనేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీతో కలిసి..వెళ్లి.. రామోజీని కలుసుకున్నారు. అయితే.. ఈ సందర్భంగా..వారు.. ఏం చర్చించారనేది.. ఆసక్తిగా మారింది. ఎక్కువ మంది మునుగోడు ఉప ఎన్నికలో తమకు అనుకూలంగా ప్రచారం చేయమని.. కోరే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ, ఎన్నికల విషయంపై కాంగ్రెస్ నేతలు.. రామోజీతో భేటీ కాలేదు. కేవలం.. భారత్ జోడో యాత్ర గురించి మాత్రమే చర్చించారని తెలిసింది. ప్రస్తుతం భారత్ జోడో యాత్ర.. మంగళవారం ఏపీలో ప్రారంభమై.. నాలుగు రోజులు సాగనుంది.
అనంతరం.. కర్ణాటకలో సాగి..తర్వాత.. తెలంగాణలోకి ప్రవేశించనుంది. మొత్తం 14 రోజుల పాటు తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు. ఈ నేపథ్యంలో దీనికి ఒకింత బాగా కవరేజీ ఇవ్వాలని.. పాదయాత్రను సానుకూలంగా ప్రచురించాలని.. కోరేందుకు. రేవంత్‌రెడ్డి.. రామోజీతో భేటీ అయినట్టు తెలిసింది. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని.. మీపని మీరు చేయండి.. మా పనిమేం చేస్తాం!! అని వ్యాఖ్యానించినట్టు తెలిసింది.