“మేం బస్సు చార్జీలు పెంచుతున్నాం.. మీరు కూడా చార్జీలు పెంచండి!”అంటూ కొన్నాళ్ల కిందట.. తెలంగాణ ప్రభుత్వం ఏపీకి లేఖ రాసింది. అయితే.. అప్పట్లో దీనిని పక్కన పెట్టిన ఏపీ ప్రభుత్వం.. తాజాగా ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచేందుకు రెడీ అయింది. జూలై 1 నుంచి బస్సు ఛార్జీలు పెంచాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. డీజిల్ సెస్ పెంపు వల్ల ఛార్జీలు పెంచక తప్పలేదని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి డీజిల్ సెస్ …
Read More »అటు రేవంత్.. ఇటు సంజయ్.. ఎవరిది పైచేయి..!
చేరికల విషయంలో జాతీయ పార్టీలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పోటాపోటీగా వలసలను ప్రోత్సహిస్తున్నారు. రేవంత్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఏడాది తర్వాత వలసల గేట్లు ఎత్తారు. దీంతో ఒకేసారి ప్రవాహంలా ముంచెత్తుతోంది. బండి సంజయ్ ఈటలతో మొదలుపెట్టి సంచలనం సృష్టించారు. కానీ తర్వాత చేరికలు నెమ్మదించాయి. ఇపుడు ఆయా పార్టీల కీలక నేతలకు గాలం వేసి మోదీ …
Read More »మంత్రులు-మౌనాలు.. అసలేంటి కథ…!
వైసీపీ మంత్రులు ఉలకరు.. పలకరు. పోనీ.. ఎక్కడైనా పెదవి విప్పారా.. వివాదాలకు కేంద్రాలు అవుతున్నారు. దీనిని సరిదిద్దుకోవడం.. పార్టీకి, పార్టీ అధినేత జగన్‌కు తలకు మించిన భారంగా మారుతోంది. దీంతో మంత్రులు మౌనంగా ఉంటున్నారా? లేక.. ఉద్దేశ పూర్వకంగానే మౌనం పాటిస్తున్నారా? అంటే.. ఉద్దేశ పూర్వకంగానే మౌనంగా ఉంటున్నారని అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి తిరగబడితే.. తమ దారి తాము చూసుకునేందుకు చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు.. …
Read More »ఏపీలో నయా పొలిటికల్ గేమ్… ఏకం కాలేని నేతలు…!
రాష్ట్రంలో రెండు ప్రధాన పక్షాల మధ్యే వచ్చే ఎన్నికల్లో పోటీ ఉండనుంది. ఈ విషయం బహిరంగ రహస్యం. అవే.. టీడీపీ, వైసీపీ, మధ్యలో పొత్తు రాజకీయాలు పొడిచినా.. కొన్ని జిల్లాల్లోనే అవి పరిమితం అవుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో.. ఈ రెండు పార్టీల విషయంలోనే క్రేజీ రాజకీయాలు జరుగుతున్నాయి. అంటే.. వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఎక్కడ టికెట్ ఇవ్వాలనే విషయంలో నాయకులు నోరు విప్పడం లేదు. పైగా.. నియోజకవర్గాల్లో …
Read More »బాదుడే.. బాదుడు అంటే ఇది కదా
దేశ ప్రజలపై మరిన్ని భారాలు పడనున్నాయి. ఇప్పటికే పెట్రోలు, డీజిల్ ధరల పెంపుతో అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగి ప్రజలు అల్లాడి పోతున్నారు. రుణాలపై వడ్డీలు బాదేశారు. ఇలాంటి సమయంలో అంతో ఇంతో ఉపశమనం ఇస్తుందని భావించిన జీఎస్టీ మండలి సమావేశం.. ప్రజలపై మరిన్ని బాదుళ్లు బాదేసింది. అప్పడాల నుంచి గోధుమ పిండి వరకు, చేపల నుంచి మజ్జిగ వరకు బ్యాంకులో డబ్బులు బదిలీ చేసినా.. వేసినా.. పెన్సిళ్ల …
Read More »మిమ్మల్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఏబీని అడిగితే..
మూడేళ్ల కిందట వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వ హయాంలో ఇంటలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావును ఎలా టార్గెట్ చేస్తోందో అందరికీ తెలిసిందే. అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలతో ఆయన మీద సస్పెన్షన్ వేటు వేసి సుదీర్ఘ కాలం పక్కనపెట్టడం.. చివరికి కోర్టు ఉత్తర్వులతో ఇటీవలే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా నియమించడం తెలిసిందే. కానీ రెండు వారాలు తిరక్కముందే …
Read More »సీఎం పదవికి ఠాక్రే రాజీనామా
గత వారం రోజులుగా తీవ్ర ఉత్కంఠకు.. గురిచేసిన మహారాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపన. పులిబిడ్డగా ప్రాచర్యం పొందిన బాల ఠాక్రే కుమాడు.. సీఎం ఉద్ధవ్ ఠాక్రే కంటతడి.. ఎట్టి పరిస్థితిలోనూ గురువారమే బలపరీక్ష జరిపి తీరాలన్న అత్యున్నత ధర్మాసనం ఆదేశం.. ‘మాదారి మాదే..’ అని భీష్మించిన రెబల్ ఎమ్మెల్యేలు.. అధికారం కోసం పాచికలాడిన బీజేపీ వ్యూహాలు.. వెరసి.. మహా రాష్ట్ర సర్కారు కేవలం రెండు సంవత్సరాల 7 నెలల కాలంలో …
Read More »ఈ సారైనా వెంకయ్యకు మోడీ జై కొడతారా..?
రాష్ట్రపతి అభ్యర్థి అనుకున్నారు.. కానీ, రాలేదు. దేశమంతా.. ఆయన పేరు వినిపించినా.. కనీసం.. ఆయన పేరును కూడా బీజేపీ నేతలు ప్రస్తావించకుండానే ద్రౌపదీ ముర్మును ఎంపిక చేశారు. ఆయనే ప్రస్తుత ఉపరాష్ట్రపతి.. ఆర్ ఎస్ ఎస్ వాది.. తెలుగు వాడు.. వెంకయ్యనాయకుడు. ప్రస్తుతం ఆయన ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. మరి ఇప్పుడైనా.. ఆయనకు కొనసాగింపు ఉంటుందా? ఇదీ.. ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. అంతేకాదు.. ప్రధాని మోడీ ఆయన విషయంలో ఎలా …
Read More »సీఎం జగన్‌కు పేరొస్తోంది.. మాకు రావట్లేదు.. : వైసీపీలో కొత్త రగడ
ఏపీ అధికార పార్టీ వైసీపీలో కొత్త రగడ తెరమీదికి వచ్చింది. ఇప్పటి వరకు వైసీపీ అధినేత, సీఎం జగన్-ఆయన పార్టీ ఎమ్మెల్యేలు.. నేతలు.. అంటే అంతా ఒకే కుటుంబం అని అందరూ అనుకుంటున్నారు. సీఎం జగన్ కూడా అలానే భావిస్తున్నారు. ఇది మన ప్రభుత్వం అనే మాటే ఆయన నోటి నుంచి వినిపిస్తూ ఉంటుంది. అయితే.. ఇప్పుడు కొత్త వాదన తెరమీదికి వచ్చింది. “ముఖ్య మంత్రికే పేరు వస్తోంది.. మాకు …
Read More »ఏపీ ఉద్యోగులకు షాక్.. రేపటిలోగా ఫ్లాట్లు ఖాళీ చేయండి..
మూలిగే నక్కమీద తాడిపండు పడిన చందంగా మారిపోయింది ఏపీ ఉద్యోగుల పరిస్థితి. పీఆర్సీ సరిగా లేదని.. గత 2019 ఎన్నికల్లో ఇచ్చిన సీపీఎస్ పింఛన్ రద్దు హామీని నెరవేర్చడం లేదని.. తాము భవిష్యత్తు అవసరాల కోసం.. దాచుకున్న జీపీఎఫ్ నిధులను రూ.800 కోట్లను కూడా సర్కారు సొంతానికి వాడేసుకుందని లబోదిబోమంటున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పై సర్కారు మరో పిడుగు వేసింది. వారి పై కొరడా ఝళిపించింది. తక్షణం వెళ్లిపోవాలి.. …
Read More »ఆదాయం వస్తోంది.. అప్పులూ చేస్తున్నారు.. కానీ.. ఖజానా ఖాళీ
ఏపీ సర్కారు ఆర్థిక మాయాజాలం ఎవరికీ అర్ధం కావడం లేదు. ఒకవైపు ఆదాయం వస్తోంది. మరోవైపు.. కేంద్రం చల్లని చూపుతో అప్పులు కూడా చేస్తున్నారు. అయినప్పటికీ.. ఖజానాలో చిల్లిగవ్వ ఉండడం లేదు. ఎప్పటికప్పుడు వెతుకులాటే. మరి దీనికి కారణం ఏంటి? డబ్బులు ఎటు పోతున్నాయి? ఇదో విక్రమార్క విన్యాసంగా మారిపోయిందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఏపీలోని వైసీపీ ప్రభుత్వానికి నెలకు సగటున రూ.12వేల కోట్ల వరకు ఆదాయం వస్తోంది. అలాగే… …
Read More »ఉద్యోగుల సొమ్ము జగన్ పాలు.. 800 కోట్లు హుష్!!
ఎక్కడైనా.. ఏదైనా ప్రభుత్వం ఉద్యోగులతో పనిచేయించుకుని.. వారికి జీతాలు.. భత్యాల రూపంలో సొమ్ములు ఇస్తుంది. కానీ, ఏపీలో మాత్రం రివర్స్ జరుగుతోందని.. ఇక్కడి ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నా రు. ప్రభుత్వం తమను మరోమారు నమ్మించి, మోసం చేసిందనే వాదన ఉద్యోగ సంఘాల నుంచి వినిపి స్తోంది. డీఏ బకాయిలను జీపీఎఫ్ ఖాతాలకు జమ చేసినట్లే చేసి, వెనక్కి తీసుకుందని చెబుతున్నారు. వ్యక్తిగత జీపీఎఫ్ ఖాతాల నుంచి తమ అనుమతి లేకుండా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates