మామూలుగా అయితే నెలల తరబడి ఫాం హౌస్ నుండి బయటకే రారనే ఆరోపణలున్నాయి. ఒకవేళ ఫాం హౌస్ నుండి ప్రగతి భవన్ కు వచ్చినా సెక్రటేరియట్ కు రారని, మంత్రులు, ఉన్నతాధికారులకు కూడా అందుబాటులో ఉండరనే ప్రచారం అందరికీ తెలిసిందే. అలాంటి కేసీయార్ ఇపుడు వరుసబెట్టి జిల్లాల్లో టూర్లు చేస్తున్నారు. పైగా వరుసబెట్టి బహిరంసభల్లో కూడా పాల్గొంటున్నారు. విషయం ఏమిటా అని ఆరాతీస్తే బహిష్కృత మంత్రి ఈటల రాజేందర్ దెబ్బే …
Read More »జగన్ విజన్ సూపర్.. చిరు పొగిడేశారు..
“జగన్ విజన్ సూపర్”- ఈ మాట అన్నది ఎవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవే. తాజాగా ఆయన తన ట్విట్టర్లో జనగ్ పాలనపై పొగడ్తల వర్షం కురిపించారు. రాసింది రెండు మూడు లైన్లే అయినా.. భారీ ఎత్తున జగన్ను ఆకాశానికి ఎత్తేశారు. నిజానికి ఆది నుంచి కూడా జగన్పై చిరంజీవి ఆసక్తి చూపిస్తున్నారు. గతంలోనూ ఇరు రాష్ట్రాల మధ్య సఖ్యత కోసం.. జగన్ ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటోందని చిరు పేర్కొని …
Read More »జగన్… ‘దైవదూత’… RRR తాజా లేఖ
వైసీపీ రెబల్ ఎంపీ.. రఘురామకృష్ణరాజు..తాజాగా సీఎం జగన్కు మరో లేఖను సంధించారు. అయితే.. దీనిలో ఆయన సీఎం జగన్ను చాలా చిత్రంగా వర్ణించారు. జగన్కు మంచిపేరు రావాలని కోరుకుంటున్నానని..దైవదూతగా ఆయన నిలిచిపోవాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. అయితే.. ఇవన్నీ సాకారం కావాలంటే.. జగన్ పాలనలో మూతబడిన అన్నా క్యాంటీన్లను.. పేరు మార్చి అయినా..ప్రారంభించాలని.. రఘురామ సీఎం జగన్కు సూచించారు. గత ప్రభుత్వ హయాంలో అమలైన అన్న క్యాంటీన్ల బదులు ‘జగనన్న క్యాంటీన్లు’ …
Read More »కేసీఆర్ కు బలమైన కౌంటర్ ఇచ్చేసిన మంత్రి అనిల్
రెండు రోజుల క్రితం జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టుల్ని నిర్మిస్తోందని.. కేంద్రం చూసిచూడనట్లు వ్యవహరిస్తోందని.. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తామంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా మీడియాలో పెద్ద ఎత్తున వచ్చాయి. ఏపీ సర్కారు మీద కేసీఆర్ బండలు వేయటం కొత్తేం కాదు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఏపీ రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ తాజాగా …
Read More »కరోనాతో ఇన్ని లక్షలమంది చనిపోయారా ?
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశంలో 15 లక్షలకుపైగా చనిపోయారా ? అవుననే అంటున్నారు ఐఐఎం అహ్మదాబాద్ ఎకనమిక్స్ ప్రొఫెసర్ చిన్మయ్ తుంబె. ఏ రాష్ట్రం కూడా కరోనా రోగులను, మరణాల అసలు సంఖ్యను బయటపెట్టడం లేదని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రోగులు, మరణాలపై తమ బృందం దేశవ్యాప్తంగా సర్వే చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వాలు చెబుతున్న అధికారిక లెక్కల కన్నా కనీసం 15 లక్షలమంది ఎక్కువగా చనిపోయుంటారని చిన్మయ్ …
Read More »మండలి రద్దుకు కట్టుబడుందా ?
అధికార వైసీపీ శాసనమండలి రద్దుకు కట్టుబడుందా ? అనే అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఇదే అనుమానాలు పెరుగుతున్నాయి. మీడియాతో సజ్జల మాట్లాడుతు శాసనమండలి రద్దు చేస్తు గతంలో చేసిన తీర్మానంపై కేంద్రాన్ని ఒత్తిడి చేయబోమన్నారు. ఇదే సమయంలో మండలి రద్దు తీర్మానంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సిద్ధంగా ఉన్నామని స్పష్టంగా చెప్పారు. శాసనసభలో బలంగా ఉన్న వైసీపీ శాసనమండలికి వచ్చేసరికి …
Read More »కాంగ్రెస్కు ఫ్యూచర్ ఉన్నట్టా? లేనట్టా? మేధావుల మాటేంటంటే!
వంద సంవత్సరాల వయసు దాటిన కాంగ్రెస్కు గతంలో ఎన్నడూ లేని ఒక సందిగ్ఢ పరిస్థితి ఎదురైంది. పార్టీ పుంజుకుంటుందా? లేక ఇంతేనా? లేక మరిన్ని ఇబ్బందులు వస్తాయా? ఇదీ.. ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితిని గమనిస్తున్న వారిని తొలిచేస్తున్న ప్రశ్నలు. ప్రస్తుతం కాంగ్రెస్ లో నాయకత్వలోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇప్పుడున్న కాంగ్రెస్ను పరిశీలిస్తే.. ఇది.. ఇందిరా కాంగ్రెస్సేనా? అనే విస్మయమూ వ్యక్తమవుతోంది. పార్టీ అధ్యక్షురాలు.. సోనియా గాంధీ నేతలను నడిపించలేక …
Read More »కేంద్రం దివాళా తీసిందా? మోడీపై సుప్రీం ఫైర్..
ప్రధాని నరేంద్రమోడీపై సుప్రీం కోర్టు మరోసారి విరుచుకుపడింది. కరోనాతో మృతి చెందిన వారికి పరిహారం ఇవ్వలేమని ఇప్పటికే చూచాయగా ప్రకటించేసిన కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగింది. గత కొన్ని వారాలుగా దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితులు, వ్యాక్సిన్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరులపై సుప్రీం కోర్టు సుమోటోగా కేసు విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన విచారణలో కరోనా మృతుల కుటుంబాలకు పరిహరం ఇచ్చే …
Read More »గన్ రాలేదు, జగన్ రాలేదు – లోకేష్
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి సీఎం జగన్ నివాసానికి కూతవేటు దూరంలో పుష్కర్ ఘాట్ సమీపంలో ఓ యువతిపై జరిగిన అత్యాచార ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తనకు కాబోయే భర్తతో కలిసి.. పుష్కర్ ఘాట్కు వచ్చిన యువతిని ఆమెకు కాబోయే భర ముందే అత్యంత పాశవికంగా అత్యాచారం చేసిన నిందితుల ఘటన.. పెద్ద ఎత్తున వివాదంగా మారింది. సీఎం జగన్ నివాసానికి కూత వేటు …
Read More »మోడి పప్పులుడకలేదా ?
ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్నది చూసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడి పప్పులుడకలేదని అర్ధమైపోతోంది. పేరుకు ప్రధానమంత్రే కానీ ఉత్తరప్రదేశ్ విషయంలో మాత్రం మోడి ఏమనుకున్నా జరగదు. ఉత్తరప్రదేశ్ వరకు ప్రధాని అయినా ముఖ్యమంత్రి అయినా సర్వం సహా అధిపతి యోగి ఆదిత్యనాద్ మాత్రమే. ఎందుకంటే యోగి వెనకాల కొండంత అండ ఆర్ఎస్ఎస్ నిలబడుంది. యోగికి అండగా ఉన్న ఆర్ఎస్ఎస్సే మోడికి కూడా మూలం. అందుకనే యూపీలో ఏమిచేయాలన్నా, యోగి విషయంలో ఎలాంటి …
Read More »ఉత్తరాంధ్రలో కనిపించని సేన.. పొలిటికల్ ఫీట్లు తప్పవా..?
రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఎక్కడ జనసేన ప్రభావం ఎక్కువగా ఉంటుంది ? అంటే.. ఠక్కున చెప్పే మాట… ఉత్తరాంధ్ర. జనసేన రాజకీయాలు ఎక్కువగా.. ఉత్తరాంధ్రలోనే కొనసాగాయి. పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని నెలల పాటు.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించి.. ప్రజల మధ్య ప్రసంగాలు గుప్పించారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై చంద్రబాబు హయాంలోనే ఆయన ఎలుగెత్తారు. తర్వాత.. 2019 ఎన్నికలకు ముందు …
Read More »ఆ ఏపీ మంత్రి స్టయిలే డిఫరెంట్.. !
ఏపీ సీఎం జగన్ కేబినెట్లో ఎవరు బెస్ట్ ? ఈ ప్రశ్నకు నీళ్లు నమలాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే.. ముఖ్యమంత్రి జగన్కి ధీటైన, తగిన మంత్రి ఎవరు అంటే మాత్రం తడుముకోకుండా సమాధానం లభిస్తోంది. ప్రతిపక్షాలు కానీ, ఇతర నేతలు కానీ.. ప్రత్యర్థులుకానీ.. ఎలాంటి విమర్శలు చేసినా.. కోర్టులు హెచ్చరికలు జారీ చేసినా.. ఎలాంటి బాధ, భయం లేకుండా ముందుకు సాగుతున్న మంత్రుల్లో ఒకే ఒక్కరు ఇటీవల కాలంలో కనిపిస్తున్నారని …
Read More »