Political News

హోదా మెలిక పెట్టాల్సిందిగా జగన్?

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు.. కేంద్రం మెడలు వంచి అయినా దాన్ని కచ్చితంగా సాధిస్తాం అని ఎన్నికల ముంగిట గర్జించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. దీంతో పాటుగా అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చారాయన. కానీ అధికారం చేపట్టిన కొన్ని రోజులకే హోదా విషయంలో కాడి వదిలేసినట్లు కనిపించారు జగన్. కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కారు పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిందని, మెజారిటీ కోసం తమ మీద …

Read More »

వీర్రాజు ఎఫెక్ట్.. బీజేపీలో క‌న్నా శ‌కం ముగిసిందా?

Kanna Lakshmi Narayana

రాజ‌కీయాలంటే.. రాజ‌కీయాలే! నాయ‌కుల‌ను బ‌ట్టి రాజ‌కీయాలు ఎప్పుడూ శైలిని మార్చుకుంటాయి. ఒక్కొక్క నేత‌ది ఒక్కొక్క స్ట‌యిల్‌. ఇప్పుడు ఏపీ బీజేపీ సార‌థిగా ఉన్న సోము వీర్రాజుది కూడా డిఫ‌రెంట్ స్ట‌యిల్‌. ఆది నుంచి బీజేపీలోనే ఉన్న ఆయ‌నకు ఆర్ ఎస్ ఎస్ మూలాలు కూడా ఉన్నాయి. దీంతో పార్టీని డెవ‌ల‌ప్ చేయాల‌నేది ఆయ‌నకున్న విధానాల్లో ప్ర‌ధాన‌మైంది ఒక‌టైతే.. నాయ‌కుడిగాత‌న‌కు తిరుగులేని ఆధిప‌త్యం సంపాయించుకోవాల‌నేది మ‌రో కీల‌క విధానం. త‌న‌దైన ముద్ర …

Read More »

కేంద్రం మాట‌.. ఫేక్ న్యూస్ వ‌ల్లే ఆ ప్రాణాలు పోయాయ‌ట‌

లాక్ డౌన్ మొద‌లైన ఆరంభంలో వ‌ల‌స కూలీలు ఎన్నెన్ని క‌ష్టాలు ప‌డ్డారో అంద‌రూ చూశారు. ఉన్న చోట ఉపాధి లేక‌.. త‌ట్టా బుట్టా చేత ప‌ట్టుకుని పిల్ల‌ల్ని క‌టిక ఎండ‌లో పిల్ల‌ల్ని న‌డిపించుకుంటూ.. స‌రైన తిండి కూడా లేకుండా వంద‌ల కిలోమీట‌ర్లు న‌డిచి వెళ్లిన ద‌య‌నీయ ప‌రిస్థితులు చూసి అంద‌రికీ క‌న్నీళ్లొచ్చాయి. ఈ క్ర‌మంలో ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ విష‌యంలో ప్ర‌భుత్వాలు బాధ్య‌తారాహిత్యంగా వ్య‌వ‌హ‌రించాయ‌న్న‌ది స్ప‌ష్టం. సోనూ …

Read More »

దమ్మాలపాటి పై ఏసిబి ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసు.. సంచలనం

ACB AP

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా పనిచేసిన దమ్మాలపాటి శ్రీనివాస్ పై ఏసిబి కేసు నమోదు చేసింది. అమరావతి రాజధాని ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పెద్ద ఎత్తున జరిగిందనే ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సిట్ విచారణ చేయించాలని ప్రభుత్వం అనుకోగానే టిడిపి నేతలు కోర్టులో కేసు వేశారు. ప్రస్తుతం ఈ విషయం కోర్టు విచారణలో ఉంది. ఇదే సమయంలో సిబిఐతో విచారణ చేయించాలని రాష్ట్రప్రభుత్వం …

Read More »

ప్రధానిగా మోడీకి అర్హత లేదని జగన్ అంటారేమో: రఘురామ

వైసీపీకి స్వపక్షంలో విపక్షంలో మారిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై అనర్హత వేయాలంటూ వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి…రాజ్యాంగంలో షెడ్యూల్ 10 చదవాలని అన్నారు. సీఎం జగన్ గారు నిత్యం పరితపించే ఇంగ్లిష్ లోనే షెడ్యూల్ 10 ఉందని, మాతృభాష తెలుగును కాపాడాలన్నందుకే తనను డిస్ క్వాలిఫై చేయాలని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. 5వ తరగతి వరకు మాతృభాషలోనే …

Read More »

ఏపీలో కొత్త పన్నుల ఆదాయం.. 15 వేలు కోట్లు !!

YS JAgan

కరోనా సంక్షోభ సమయంలోనూ ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని వైసీపీ నేతలు ప్రశంసిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వాన్ని నడిపేందుకు, సంక్షేమ పథకాల అమలుకు జగన్ పరిమితికి మించి అప్పులు చేస్తున్నారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఖజానా నింపుకునేందుకు ప్రజలపై సైలెంట్ గా పన్నుబాదుడు విధిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే భారీగా మద్యం ధరల పెంపు, పెట్రో, డీజిల్ ధరలు, భూముల ధరలు, రిజిస్ట్రేషన్ చార్జీలు ఇలా …

Read More »

హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్

హైదరాబాద్ నుంచి భారత వాణిజ్య రాజ్యధానికి రోజూ వేల మంది వివిధ రకాలుగా ప్రయాణిస్తారు. అత్యంత వేగంగా అక్కడికి చేరుకోవాలంటే విమాన ప్రయాణాన్నే ఆశ్రయించాలి. కానీ విమానంలో వెళ్లినంత వేగంగా హైదరాబాద్ నుంచి ముంబయికి రైల్లో ప్రయాణిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి? ఇదెలా సాధ్యం అనిపిస్తోందా? కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలు అనుకున్నట్లుగా అమలైతే కొన్నేళ్లలో ఇది సాధ్యపడొచ్చు. ఈ రెండు నగరాల మధ్య బుల్లెట్ ట్రైన్ తీసుకురావాలని మోడీ …

Read More »

మంత్రి వెలంప‌ల్లికి సొంత సామాజిక వ‌ర్గంలో సెగ‌.. రీజ‌నేంటంటే!

ఏ నిముషానికి ఏమి జ‌రుగునో.. అని పాడుకుంటున్నార‌ట‌.. వైసీపీ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు. నిజ‌మే.. రాజ‌కీయాల్లో నేత‌ల‌కు ప‌ద‌వులు ద‌క్కే వ‌ర‌కు ఒక తంటా. అవి ద‌క్కిన త‌ర్వాత వాటిని కాపాడుకోవ‌డం మ‌రింత తంటా! ఎటు నుంచి ఎలాంటి ప‌రిస్థితి వ‌చ్చి త‌మ ప‌ద‌వుల‌కు ఎస‌రు పెడుతుందోన‌ని నాయ‌కులు త‌ల్లడిల్లి పోతుంటారు. గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో ప‌నిచేసిన మంత్రులు కూడా ఇలానే అనేవారు. మాకు ప‌ద‌వులు ఎప్పుడు ఉంటాయో.. పోతాయో …

Read More »

ఇంతకీ రాజుగారు పార్టీలో ఉన్నట్లా ? లేనట్లా ? ప్రజల్లో అయోమయం

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. మొన్నటి ఎన్నికల్లో నరసాపురం ఎంపి గా గెలిచిన తర్వాత నుండి ఎంపి కనుమూరు రఘురామ కృష్ణంరాజుకు, అధినేత జగన్మోహన్ రెడ్డికి మధ్య బాగా గ్యాప్ పెరిగిపోయింది. దాంతో ఎంపి-పార్టీ నేతల మధ్య ప్రతిరోజు టామ్ అండ్ జెర్రీ షో జరుగుతోంది. ఎంపి ఏమో ప్రతి విషయంలోను పార్టీని, జగన్ను విమర్శిస్తున్నారు. వెంటనే పార్టీ నేతలు ఎంపిపై ఎదురుదాడితో విరుచుకుపడిపోతున్నారు. మొత్తానికి …

Read More »

ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఏసిబి విచారణ ప్రారంభం

రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధాని పరిధిలో జరిగిందని ప్రభుత్వం భావిస్తున్న ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఏసిబితో విచారణ చేయించాలని డిసైడ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వటం, ఏసిబి కూడా విచారణ మొదలుపెట్టడం మొదలైపోయింది. అమరావతి ప్రాంతంలో వేలాది ఎకరాల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి ఈ అంశంపై వైసిపి చంద్రబాబు+మద్దతుదారులపై పెద్ద ఎత్తున ఆరోపణలు …

Read More »

రామ‌చంద్ర‌పురం టీడీపీలో జెండా మోసేదెవ‌రు?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి ప‌రిణామాలు ఎదుర‌వుతాయో చెప్ప‌డం చాలా క‌ష్టం. నిన్న మ‌న‌వాడే.. రేపు ప‌గ‌వాడు కావొచ్చు. ఏ నిముషానికి ఏమి జ‌రుగునో.. అనే మాట ఖ‌చ్చితంగా రాజ‌కీయాల్లో ఎంత‌టి వారికైనా వ‌ర్తించ‌కుండా ఉండ‌దు. ఇప్పుడు ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి కూడా ఇలాంటి అనుభ‌వ‌మే ఎదుర‌వుతోంది. నాయ‌కుల‌ను అతిగా న‌మ్మిన చంద్ర‌బాబు ఆ న‌మ్మ‌కం అనే సున్నిత‌మైన వ్య‌వ‌హారాన్ని చెడ‌గొట్టుకున్నారో.. లేక చెడిపోయిందో తెలియ‌దు కానీ.. న‌మ్మిన తమ్ముళ్లు …

Read More »

డీజీపీ సవాంగ్ రాజీనామా చేయాలి….హైకోర్టు షాకింగ్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ పై ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వ్యక్తి అదృశ్యం కేసులో సవాంగ్ పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పోలీస్ వ్యవస్థను కంట్రోల్ చేయలేకపోతే డీజీపీ సవాంగ్ రాజీనామా చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏపీలో పోలీస్ వ్యవస్థ గాడితప్పుతోందని, ఏపీలో ‘రూల్ ఆఫ్ లా’ అమలు కావడం లేదని …

Read More »