ఏ ఎన్నికల్లో అయినా.. పార్టీ నేతలు ఓడిపోతే.. లేదా పార్టీ ఓడిపోతే.. ఎవరు బాధ్యులు..? పార్టీలో ఉన్నవారు బాధ్యులు.. లేదా.. సలహాదారులు.. పరిశీలకులు బాధ్యులు. అంతేతప్ప.. ఉద్యోగులు బాధ్యులా? అంటే.. ఎవరైనా ఏం చెబుతారు? బాధ్యులు కారనే అంటారు. కానీ, జగన్ సర్కారు మాత్రం ఉద్యోగులనే బాధ్యులను చేస్తోంది. ప్రకాశం జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ మద్దతు దారులు గెలవలేక పోయారు. ఇక్కడ టీడీపీ పలు గ్రామాలను …
Read More »టెక్కలిలో పసందైన రాజకీయం ?
టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలి రాజకీయం చాలా స్పీడుగా మారిపోతోంది. టెక్కలి వైసీపీ ఇన్చార్జి దువ్వాడ శ్రీనివాస్ ను జగన్మోహన్ రెడ్డి ఎంఎల్సీని చేశారు. మొన్నటి ఎన్నికల్లో దువ్వాడపై అచ్చెన్న కొద్ది మెజారిటితో విజయం సాధించారు. దువ్వాడ ఓడిపోయినా వైసీపీ ప్రభుత్వం ఏర్పడటంతో దువ్వాడ జోరుమీదే ఉన్నారు. అయితే ఇవతల అచ్చెన్న కూడా దూకుడు మీదుండే మానిషే కావటంతో ఇద్దరి మధ్య రాజకీయం నువ్వా-నేనా అన్నట్లుగా ఉంటోంది. ఎంతగా …
Read More »సీఎం జగన్ కు ఎంపీ రఘురామ ఫోన్.. ఏం జరిగింది?
ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు. సొంత పార్టీ అధినేతతో సున్నం పెట్టుకున్న ఆయన తరచూ ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేయటం.. పార్టీని ఇరుకున పెట్టటం మామూలే. గడిచిన కొద్దికాలంగా నియోజకవర్గానికి దూరంగా ఢిల్లీలోనే ఉంటున్న ఆయన.. తాజాగా తన నియోజకవర్గ పర్యటనకు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. తన పర్యటన సందర్భంలో ఏదోలా అరెస్టు చేయాలన్న ఆలోచనలో సొంతపార్టీ నేతలు ఆలోచిస్తున్నారంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేస్తున్నారు. తాను …
Read More »కొత్తరక్తం ‘దేశం’లో సాధ్యమేనా ?
పార్టీకి కొత్తరక్తం ఎక్కిస్తాను..మూడు రోజుల కుప్పం పర్యటనలో చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలివి. నిజానికి పార్టీకి కొత్తరక్తం ఎక్కించాల్సిన అవసరం దాదాపు పదేళ్ళ క్రితమే వచ్చేసింది. కానీ ఇప్పటికీ ముసలి రక్తంతోనే బండిని లాగిస్తున్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారి కొత్తరక్తం మాటను ఇప్పటికి కొన్ని వందలసార్లు చెప్పుంటారు. కానీ ఒక్కసారికూడా కొత్త రక్తం ఎక్కించే సాహసం చేయలేకపోయారు. అప్పుడెప్పుడో 1982లో ఎన్టీయార్ పార్టీ పెట్టినపుడు యువకులుగా పార్టీలో చేరిన వారితోనే ఇఫుడు …
Read More »మత్య్సపురిలో అసలేం జరిగింది?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహానికి గురి కావటం.. భీమవరం వైసీపీ ఎమ్మెల్యేపై షాకింగ్ వ్యాఖ్యలు చేయటమే కాదు.. నేరుగా వార్నింగ్ ఇచ్చేయటం తెలిసిందే. దీనికి ఏ మాత్రం తగ్గని ఎమ్మెల్యే సైతం అంతే ఘాటుగా రియాక్టు అవుతున్నారు. జనసేన నాయకులు..కార్యకర్తలు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను చూసుకొని రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళిత మహిళను సజీవ దహనం చేయాలని.. దళితుల ఇళ్లను తగలబెట్టాలని చూసినట్లుగా …
Read More »టీటీడీకి రూ.10 కోట్లు ఇస్తున్న వీరెవరో అర్థమైందా?
ఈ ఫోటోను జాగ్రత్తగా గమనించండి. ఇందులోని ఇద్దరు సుపరిచితులు. మరో ఇద్దరివి కొత్త ముఖాలు. అయితే..ఈ ఇద్దరు పారిశ్రామిక వర్గాల్లో సుపరిచితులు. సామాన్యులకు వీరెవరో పెద్దగా తెలీదు కానీ వీరు ప్రభుత్వాల్నే ప్రభావితం చేయగలిగిన సత్తా ఉంది. తాజాగా తిరుమలేశుడికి రూ.10 కోట్ల విరాళం ఇచ్చిన ఈ పెద్ద మనసు ఉన్న వారు.. రాబోయే రోజుల్లో ఏపీని ఉద్యమబాటలో నడిచేలా చేయటం ఖాయమన్న మాట పలువురి నోటి నుంచి వినిపిస్తోంది. …
Read More »అతడి మోజులో భర్తను చంపించింది కానీ ఫోన్ తో బుక్ అయ్యింది
పోయే ప్రాణం ఊరికే పోదు. అందుకు కారణమైనోడి సంగతి తేలుస్తుంది. అందుకే..అర్థాంతంగా చచ్చిపోయినోళ్లు అందుకు కారణమైనోళ్లు చట్టం కంట్లో ఏదోలాపడటం మామూలే. అయినా.. ఒక మనిషితో కలిసి ఉండటం ఇష్టం లేకుంటే.. విడిగా వచ్చేసి బతికేస్తే సరిపోతుంది. లేదంటే.. చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నా అక్కడితో ఆ విషయం ముగుస్తుంది. అంతేకానీ.. ఏ మాత్రం తప్పు చేయని వారిని చంపేయటానికి మించిన దుర్మార్గం మరొకటి ఉండదు. ఇటీవల కాలంలో పరాయి మోజులో …
Read More »పోలవరం ఎత్తు తగ్గుతోందా ?
ప్రాజెక్టు పరిధిలో ముంపు తగ్గించటం+వ్యయం తగ్గించటానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ఎత్తు తగ్గించటం ఒకటే మార్గమా ? ఇపుడీ అంశంపైనే కేంద్ర జలశక్తి, పోలవరం ప్రాజెక్టు అథారిటి ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ విషయమై ఇప్పటికే జలశక్తి సాంకేతిక విభాగం ఉన్నతాధికారులు ఇఫ్పటికే అధ్యయనం చేసినట్లు సమాచారం. ప్రాజెక్టు ఎత్తు ఎంత తగ్గిస్తే ఎంత ముప్పు నివారణకు అవకాశం ఉందనే విషయమై జలశక్తి ఉన్నతాధికారులు చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నారు. …
Read More »మళ్ళీ అదే తప్పు చేసిన చంద్రబాబు
కుప్పం నియోజకవర్గంలో మొన్నటి పంచాయితి ఎన్నికల్లో వైసీపీ దాదాపు క్లీన్ చేసేసింది. కుప్పంలోని 89 పంచాయితిల్లో వైసీపీ 74 పంచాయితీలను గెలుచుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇపుడొచ్చిన రిజల్ట్ గడచిన 35 ఏళ్ళ కుప్పం రాజకీయాల్లో ఎప్పుడూ జరగలేదు. అందుకనే పంచాయితీల ఫలితాలతో చంద్రబాబునాయుడు తలబొప్పి కట్టి వెంటనే కుప్పం పరుగెత్తుకు వెళ్ళారు. అయితే కుప్పం వెళ్ళనైతే వెళ్ళారు కానీ గతంలో చేసిన తప్పులను మళ్ళీ చేశారు. కాబట్టి చంద్రబాబులో …
Read More »మోడీ ఎఫెక్ట్.. బెంగాల్లో 8 విడతలుగా ఎన్నికలు!!
కొన్ని కొన్ని నిర్ణయాల వెనుక… చాలా చాలా కీలకమైన విషయాలు దాగి ఉంటాయి. మరీ ముఖ్యంగా రాజ్యాంగ వ్యవస్థలను కూడా మేనేజ్ చేయగలుగుతున్నారనే వాదనలు ఉన్న నేటి రోజుల్లో ఎక్కడ ఎలాంటి పరిణామాలు.. భిన్నంగా చోటు చేసుకున్నా.. ఒకింత అనుమానంతోనే చూడాల్సిన పరిస్థితులు నేడు నెలకొన్నాయి. తాజాగా జరిగిన పరిణామం వెనుక కూడా ఇలాంటి అనుమానమే వ్యక్తమవుతోంది. వాస్తవానికి ఇలాంటి అనుమానాలు రానేకూడదు.. కానీ.. పరిస్తితులు.. పరిణామాలు మాత్రం అనుమానాలు …
Read More »కుప్పంలో జై జూనియర్ ఎన్టీయార్
చంద్రబాబునాయుడు కుప్పం పర్యటనలో విచిత్రమైన పరిస్దితిలు కనిపించాయి. పంచాయితి ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుల ఓటమి దెబ్బకు చంద్రబాబు మూడు రోజుల కుప్పంలో పర్యటించిన విషయం తెలిసిందే. శుక్రవారం చివరిరోజు పర్యటనలో ఉండగా రామకుప్పం, రాజుపేట మండలాల్లో జరిగిన రోడ్డుషోల్లో ఒక్కసారిగా జై జూనియర్ ఎన్టీయార్ అంటు అభిమానులు, మద్దతుదారులు ఒక్కసారిగా నినాదాలు చేశారు. తెలుగుదేశంపార్టీకి సంబంధించి కుప్పంలో ఎప్పుడు కూడా అసలు ఎన్టీయార్ కుటుంబం ఊసే ఉండేది కాదు. చంద్రబాబు …
Read More »చంద్రబాబు ప్రాణాలకు ముప్పు: హింటిచ్చిన సజ్జల
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాణాలకు ముప్పుందా? ఆయనపై ఎవరైనా..ఎక్కడైనా భౌతిక దాడులకు దిగే అవకాశం ఉందా? అంటే.. తాజాగా ప్రభుత్వ సలహాదారు.. వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను బట్టి.. ఔననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సజ్జల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చంద్రబాబుపై ఎవరైనా దాడులకు పాల్పడితే..తమకు సంబంధం లేదని.. ఆయన చెప్పేశారు. అంటే.. దీనిని బట్టి.. బాబుపై దాడులు జరిగే అవకాశం …
Read More »