తొందరలోనే పార్టీ ఏర్పాటు చేయబోతున్న షర్మిల నిర్మాణంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పార్టీలోకి ఎవరెవరిని ఆహ్వానించాలనే విషయంలో జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు. మిశ్రమ పద్దతిలో యువతను, సీనియర్లను తీసుకుంటున్నారు. క్షేత్రస్ధాయిలో పనిచేయటానికి ఎక్కువమంది యువతకు పట్టం కట్టాలని ఇప్పటికే డిసైడ్ అయ్యారట. అలాగే వారిని మార్గదర్శనం చేసేందుకు, వ్యూహాలు రచించేందుకు సీనియర్ల సేవలను ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. దీనికి తగ్గట్లే తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తో బాగా సాన్నిహిత్యం ఉన్న …
Read More »అవును.. జగన్ మడమ తిప్పారు.. సాక్ష్యాలివే
మాట అంటే మాటే. మా కుటుంబానికి మాట ఇవ్వటమే కానీ తప్పే అలవాటు అస్సలు లేదంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరచూ తమ గురించి గొప్పలు చెప్పుకోవటం కనిపిస్తుంటుంది. మరి.. మాటల్లో ఉండే పస చేతల్లో ఉందా? అంటే లేదనే చెప్పాలి. తాజాగా ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపికలో చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే.. ఈ వాదన నిజం అనిపించక మానదు. ఎమ్మెల్యే కోటాలో మండలి …
Read More »సోషల్ మీడియాపై ఎందుకీ నియంత్రణ
కేంద్రప్రభుత్వం సోషల్ మీడియాపై హఠాత్తుగా నియంత్రణ చట్టాన్ని తెచ్చింది. దానికి వ్యక్తిగత స్వేచ్చ, పౌరుల హక్కులు, స్వీయ నియంత్రణ లాంటి పడికట్టు పదాలు చాలానే చెప్పింది. అయితే ఇన్ని సంవత్సరాలుగా గుర్తుకురాని విషయాలు ఇంత హఠాత్తుగా ఎందుకు గుర్తుకు వచ్చాయి ? అన్నదే ప్రశ్న. ఎందుకంటే కేంద్రప్రభుత్వంపై కొంతకాలంగా సోషల్ మీడియాలో విపరీతంగా వ్యతిరేకత వచ్చేస్తోంది. నేరుగా ప్రధానమంత్రి నరేంద్రమోడినే టార్గెట్ చేస్తున్నారు నెటిజన్లు. మోడి తీసుకుంటున్న అనేక నిర్ణయాలు …
Read More »నారా లోకేశ్ రోరింగ్… టీడీపీ శ్రేణులకు నూతనోత్తేజం
నారా లోకేశ్… టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఆ పార్టీ ఎమ్మెల్సీగా, మాజీ మంత్రిగా తనదైన శైలి దూకుడును ప్రదర్శించినా… ఆయనలో ప్రత్యర్థి వర్గంపై విరుచుకుపడే తత్వం ఏమాత్రం పెరగలేదని నిన్నటిదాకా చాలా మంది అనుకునే వారు. అయితే వజ్రాన్ని సానబెట్టిన తీరున క్రమంగా లోకేశ్ లో కూడా పదును పెరుగుతోంది. ఆయా అంశాలపై ఇప్పటికే తనదైన శైలిలో విషయ పరిజ్ఝానం పెంచుకున్న లోకేశ్… ఇప్పుడు ప్రత్యర్థి వర్గంపై తనదైన …
Read More »ఆందోళనకారులు జాగ్రత్తగా ఉండాలి
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న వారంతా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆందోళనలకు మావోయిస్టు పార్టీ మద్దతు ప్రకటించింది కాబట్టే. ఉక్కు ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటి కార్యదర్శి కైలాసం పేరుతో ఒక ప్రకటన విడుదలైంది. తన ప్రకటనలో స్టీలు ప్లాంటు ఏర్పాటుకు జరిగిన ఉద్యమాలు, చేసిన ప్రాణత్యాగాలు లేఖలో ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎక్కడ ఉద్యమాలు మొదలైనా, ఆందోళనలు …
Read More »కేసీఆర్, జగన్.. ఒకటే టెన్షన్..!!
అటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి, ఇటు ఏపీ సీఎం జగన్‌కు ఒక్కటే టెన్షన్ ప్రారంభమైందా? ఇద్దరూ ఒకే విషయంపై ఆలోచన సాగిస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. అయితే.. ఇదేదో నీళ్ల సమస్యో.. మరేమిటో కాదు.. ఇద్దరికీ నేరుగా సంబంధించింది కాకపోయినా.. ఎవరి రాష్ట్రాల్లో వారికి టెన్షన్ గానే ఈ సమస్య మారింది. విషయంలోకి వెళ్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఏపీలో తిరపతి పార్లమెంటు …
Read More »ఆర్కే చెప్పిన మాటలే నిజమయ్యాయిగా..?
రాబోయే రోజుల్లో చోటు చేసుకునే రాజకీయ పరిణామాన్ని అంచనా వేసి చెప్పటం ఒక ఎత్తు. చెప్పిందే జరగటం మరో ఎత్తు. ఇటీవల కాలంలో మీడియాలో ఇలాంటి వార్తలు వచ్చి చాలా కాలమే అయ్యింది. కొద్ది రోజుల క్రితం ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే (రాధాక్రిష్ణ) తనకు తాను సొంతంగా రాసిన ఒక పొలిటికల్ ఆర్టికల్ లో.. రాజన్న కుమార్తె షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లుగా పేర్కొన్నారు. ఆ వార్త …
Read More »యువతను టార్గెట్ చేస్తున్న షర్మిల
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కూతురు షర్మిల చాలా జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు. తొందరలోనే కొత్తపార్టీ పెట్టబోతున్న షర్మిల ముందుగా యువతను టార్గెట్ చేసుకున్నారు. రాష్ట్రంలోని వివిధ యూనివర్సీటిలకు చెందిన సుమారు 400 మంది విద్యార్ధి నేతలతో లోటస్ పాండ్ లో సమావేశమయ్యారు. ఒకవైపు ప్రభుత్వంపై యువత అభిప్రాయాలు సేకరిస్తునే మరోవైపు దివంగత ముఖ్యమంత్రి విద్యార్ధుల కోసం ప్రవేశపెట్టిన అనేక పథకాలను గుర్తుచేశారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకం అన్నా పేద …
Read More »కేసీయార్ ను టార్గెట్ చేసిన షర్మిల
తెలంగాణాలో తొందరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్న షర్మిల డైరెక్టుగా కేసీయార్ నే టార్గెట్ చేశారు. లోటస్ పాండ్ లో మీడియాతో మాట్లాడిన షర్మిల తన స్ధానికతపై జరుగుతున్న ప్రచారానికి గట్టి రిప్లై ఇచ్చారు. తాను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగానని, తెలంగాణా కోడలనని గట్టిగానే బదులిచ్చారు. తన పిల్లలు కూడా ఇక్కడే పుట్టి పెరిగిన విషయాన్ని గుర్తుచేశారు. ఇంతటితో ఆగితే బాగానే ఉండేది. స్ధానికతపై మాట్లాడుతూ కేసీయార్, బీజేపీ నేత …
Read More »పటేల్ పేరును ప్రభుత్వం ఎందుకు తీసేసిందబ్బా ?
గుజరాత్ లో ప్రారంభమైన అతిపెద్ద క్రికెట్ స్టేడియం పేరు మార్పుపై పెద్ద రచ్చే మొదలైంది. ఇప్పటివరకు స్టేడియంకు సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుండేది. కాబట్టి క్రీడా ప్రేమికుల్లో పటేల్ స్టేడియంగానే పాపులరైంది. అయితే ఈమధ్యనే స్టేడియంను ఆధునీకరించారు. దాని సామర్ధ్యాన్ని పెంచటమే కాకుండా అనేక అధునాతన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. దాంతో కొత్తగా ముస్తాబైన స్టేడియంను రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్ ప్రారంభించారు. స్టేడియం ప్రారంభం తర్వాత అసలు …
Read More »సేమ్ టు సేమ్: అప్పుడు కేసీఆర్.. ఇప్పుడు షర్మిల!
అన్ని సందర్భాల్లో కాకున్నా కొన్ని సందర్భాల్లో చోటు చేసుకునే రాజకీయ పరిణామాల్ని లోతుగా పరిశీలిస్తే.. ఆసక్తికర అంశాలు చాలానే కనిపిస్తాయి. తెలంగాణలో రాజకీయ సంచలనంగా మారారు రాజన్న కుమార్తె షర్మిల. కొత్త పార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్న ఆమె.. ఇప్పటివరకు ఏ చిన్న తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాజకీయాల్లో ఇంత ఒద్దికగా ముందుకు వెళ్లటం అంత తేలికైన విషయం కాదు. పార్టీ ఏర్పాటు నిర్ణయం మొదలు.. దాన్ని …
Read More »అన్నాడీఎంకేలో పెరిగిపోతున్న ‘చిన్నమ్మ’ టెన్షన్
తమిళనాడు షెడ్యూల్ ఎన్నికలు దగ్గర పడేకొద్దీ అధికార ఏఐఏడీఎంకేలో టెన్షన్ పెరిగిపోతోంది. పార్టీ మొత్తాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవాలని శశికళ చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో చిన్నమ్మ నుండి పార్టీని రక్షించుకునేందుకు ముఖ్యమంత్రి పళనిస్వామి అండ్ కో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళద్దరి మధ్య పెరిగిపోతున్న ఆధిపత్య గొడవల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు కీలక నేతలు దిక్కులు చూస్తున్నారు. ఈనెల 24వ తేదీన అంటే బుధవారం దివంగత ముఖ్యమంత్రి …
Read More »