వైసీపీ మంత్రుల‌పై నాగ‌బాబు స‌టైర్లు

జ‌న‌సేన నాయ‌కుడు, ప‌వ‌న్ సోద‌రుడు నాగ‌బాబు.. వైసీపీ నాయ‌కులు, ఏపీ ప్ర‌భుత్వంపై త‌ర‌చుగా స‌టైర్లు వేస్తున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న మీడియా ముందుకంటే కూడా.. సోష‌ల్ మీడియా వేదిక ట్విట్ట‌ర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. మాట‌కు మాట‌! అన్న రేంజ్‌లో వైసీపీ నాయ‌కుల‌కు నాగ‌బాబు.. కౌంట‌ర్లు ఇస్తున్నారు. తాజాగా వైసీపీ నాయ‌కులు ప‌వ‌న్‌ను చంద్ర‌బాబు రాసిచ్చిన స్క్రిప్టు చ‌దువుతున్నాడు! అని కామెంట్లు చేశారు. దీనిపై ప‌వ‌న్ ఇంకా స్పందించ‌లేదు. కానీ, నాగ‌బాబు మాత్రం ఫైర్ అయ్యారు.

పవన్ ఏది మాట్లాడినా ఒకటికి పది సార్లు ఆలోచించి వివేకంతో మాట్లాడతారని జనసేన నేత నాగబాబు స్పష్టంచేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఆహ్వానించి పవన్‌తో మాట్లాడారని నాగబాబు పేర్కొన్నారు. వైసీపీ నుంచి ఏ ఒక్క‌రికైనా ఆహ్వానం అందిందా? అని ప్ర‌శ్నించారు. అంతేకాదు.. మోడీ ముందు చేతులు క‌ట్టుకున్నది మీ నాయ‌కులేన‌ని.. మోడీ ముందు గ‌ర్వంగా త‌లెత్తుకున్న‌ది మా నాయ‌కుడేన‌ని వ్యాఖ్యానించారు.

పూర్తి పరిజ్ఞానం లేని కొందరు మంత్రులకు పార్టీ మారినప్పుడల్లా స్క్రిప్ట్ అందించినట్లే అందరికీ అందుతాయన్న భ్రమలో వైసీపీ నేతలున్నారని.. ప‌రోక్షంగా గ‌తంలో ప్ర‌జారాజ్యంలో ఉండి.. ఇప్పుడు వైసీపీలో ఉన్న నాయ‌కులు, మంత్రుల‌ను ఉద్దేశించి నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఆహ్వానించి పవన్‌తో మాట్లాడారని, పవన్ ఏది మాట్లాడినా ఒకటికి పది సార్లు ఆలోచించి వివేకంతో మాట్లాడతారని నాగబాబు స్పష్టంచేశారు.

పరిపాలన గాలికొదిలేసిన మంత్రులు, పవన్ కల్యాణ్ ఏం మాట్లాడారన్నది మాత్రం ..వాళ్లకు ఎందుకని ఆయన నాగ‌బాబు నిలదీశారు. ప్రధాన మంత్రితో ఏం మాట్లాడారో చెప్పాలని వైసీపీ మంత్రులు అడగడం వెనుక భయమో, అభద్రతా భావమో ఉన్నట్టు అర్థం అవుతోందని నాగబాబు ఎద్దేవా చేశారు. జనసేన ప్రభుత్వం వస్తే… అన్ని లెక్కలూ బయటికి తీస్తామని నాగబాబు హెచ్చరించారు. అందుకే .. వైసీపీ నేత‌ల వెన్నులో వ‌ణుకు మొద‌లైంద‌ని వ్యాఖ్యానించారు.