తెలంగాణ సీఎం కేసీఆర్..రాష్ట్ర రాజధాని హైదరాబాద్ గొప్పదనాన్ని వేనోళ్ల చాటారు. తాజాగా ఆయన మైండ్‌స్పేస్ వద్ద ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ మెట్రోకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం అనంతరం.. పోలీస్ అకాడమీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
హైదరాబాద్‌ను అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. ఎయిర్ పోర్టు వరకు మెట్రో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం సంతోషకరమని, కాలుష్య రహితంగా మార్చడానికి మెట్రో చాలా అవరసమని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
దేశ రాజధాని ఢిల్లీ కంటే హైదరాబాద్ పెద్దదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అయితే, మరింతగా అద్భుతమైన నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని తెలిపారు. చరిత్రలో సుప్రసిద్ధ నగరం ఇదేనని చెప్పారు. అంతేకాదు.. 1912లోనే భాగ్యనగరానికి విద్యుత్ వెలుగులు వచ్చాయని తెలిపారు.
హైదరాబాద్‌ను పవర్ ఐ ల్యాండ్‌గా మార్చేందుకుతీవ్రంగా శ్రమిస్తున్నట్టు సీఎం తెలిపారు. న్యూయార్క్, లండన్, పారిస్‌లో కరెంట్ పోవచ్చు కానీ హైదరాబాద్‌లో మాత్రం కరెంట్ పోదని సంచలన వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామిక రంగంలో హైదరాబాద్ దూసుకుపోతోందని నొక్కి చెప్పారు. అదేసమయంలో… కాలుష్య రహితంగా మార్చడానికి మెట్రో చాలా అవసరమని అన్నారు.
దేశ రాజధాని ఢిల్లీ కంటే హైదరాబాద్ పెద్దది. అద్భుతమైన నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. కాలుష్య రహితంగా మార్చడానికి మెట్రో చాలా అవసరం. ఎయిర్‌పోర్టు వరకు మెట్రో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం సంతోషకరం అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates