Vijayawada కు చెందిన కీలక నాయకుడు, యువ నేతగా గుర్తింపు పొందిన కాపు సామాజిక వర్గానికి చెందిన Vagaveeti Radha రాజకీయాలు ఎటు దారితీస్తున్నాయనే చర్చ జోరుగా సాగుతోంది. ఆయనకు ఒక విధానం లేకుండా పోయిందనే విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన టీడీపీలో ఉన్నారు. యాక్టివ్‌గా ఉన్నప్పటికీ..లేకున్నప్పటికీ.. ఆపార్టీ నాయకుడిగానే ఉన్నారని అందరూ అనుకుంటున్నారు.
వంగవీటి కూడా ఎక్కడా తాను TDP నుంచి బయటకు వచ్చానని మాత్రం చెప్పడం లేదు. ఇక, పార్టీ తరఫున యాక్టివ్‌గా ఉండి పనిచేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సూచించడం లేదు. దీంతో ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదనే టాక్ ఉంది. అయితే.. తరచుగా వైసీపీ నాయకుతో భేటీ కావడం ..రాధ రాజకీయాలపై ప్రభావం చూపుతుందనే చర్చ నడుస్తోంది.
గత ఏడాదిగా.. Vagaveeti Radha.. మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్, వైసీపీ నాయకుడు కొడాలి నాని తో చెట్టాపట్టా లేసుకుని తిరుగుతున్నారు. దీనిపై చంద్రబాబు కూడా ఆయనను ప్రశ్నించలేదు. ఇక, వైసీపీకి చేరువ య్యారా? అంటే.. అది కూడా కనిపించడం లేదు. దీనివల్ల నష్టం ఏంటంటే.. టీడీపీకి ఎలాంటి నష్టం లేదు. ఎం దుకంటే..వంగవీటికి టికెట్ ఇచ్చేందుకు టీడీపీలో ఎక్కడా ఖాళీలు కూడా కనిపించడం లేదు.
విజయవాడ తూర్పు, సెంట్రల్‌లో ఇప్పటికే నాయకులు ఉన్నారు. పశ్చిమలోఎలానూ మైనారిటీకి ఇస్తారు. సో.. ఎటొచ్చీ.. Vagaveeti Radha కు టికెట్ లేదు కనుక టీడీపీకి ఇబ్బందిలేదు. అయితే, వ్యక్తిగతంగానే రాధా నష్టపోతా రనేది పరిశీలకుల మాట ఎలాగంటే.. ఆయన ఏ పార్టీ నాయకుడే తేల్చుకునేందుకు సమయం పడుతోం ది. టీడీపీలో ఉంటూ..వైసీపీలో తిరుగుతున్నారు. పోనీ.. తప్పో ఒప్పో.. బయటకు వచ్చాను.. తిరిగి కండు వా కప్పమని వైసీపీలోకి వెళ్తున్నాడా? అంటే అది కూడా లేదు. అంటే.. రెంటికీ చెడుతున్నరాజకీయమే కనిపిస్తోంది.