కేఈ కుటుంబానికి త‌మ్ముళ్ల ప్ర‌శ్న‌ ఇది!

క‌ర్నూలు జిల్లాలో సుదీర్ఘ‌కాలంగా రాజ‌కీయాలు చేస్తున్న కేఈ కృష్ణ‌మూర్తి, కేఈ ప్ర‌భాక‌ర్‌ల‌లో కృష్ణ‌మూర్తి టీడీపీ మ‌నిషే. గ‌త చంద్ర‌బాబు హ‌యాంలో ఆయ‌న మంత్రి గా కూడా ప‌నిచేశారు. అయితే, ప్ర‌భాక‌ర్ మాత్రం కొన్నాళ్లు టీడీపీలో ఉండి.. త‌ర్వాత‌.. కాంగ్రెస్ బాట ప‌ట్టి.. మ‌ళ్లీ ప్ర‌భుత్వం ఓడిపోయిన త‌ర్వాత‌.. టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే.. గ‌తంలో ఒక‌సారి మాత్రం ప‌త్తికొండ, డోన్‌ల‌లో ఇద్ద‌రూ పోటీ చేశారు.

ఇక కృష్ణ‌మూర్తి వ‌యోవృద్ధుడు కావ‌డంతో గ‌త ఎన్నిక‌ల్లో ఆయన కుమారుడికి చంద్ర‌బాబు అవ‌కాశం ఇచ్చారు. అయితే.. అప్ప‌టికి టీడీపీలో లేక పోవ‌డంతో ప్ర‌భాక‌ర్‌(కేఈ సొద‌రుడు)కు టికెట్ ఇవ్వ‌లేదు. ఈ ప్లేస్‌ను కోట్ల సుజాత‌మ్మ‌కు చంద్ర‌బాబు కేటాయించారు. అయితే, ఆమె వైసీపీ నాయ‌కుడు, ప్ర‌స్తుత మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌పై ఓడిపోయారు. ఇక‌, బుగ్గ‌న దూకుడు కూడా జోరుగా ఉంది.

ఇలాంటి స‌మ‌యంలో సుజాత‌మ్మ‌ను సైతం ఒప్పించిన చంద్ర‌బాబు ఇక్క‌డ నుంచి ఒకింత ఆర్థికంగాను.. సామాజిక ప‌రంగాను బ‌లంగా ఉన్న ధ‌ర్మ‌వ‌రం సుబ్బారెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. దీనికి ఎవ‌రూ అడ్డు పెట్ట‌లేదు. అయితే.. ఈ కార‌ణంగా కేఈ ప్ర‌భాక‌ర్‌కు సీటు లేకుండా పోయింది. కానీ, ఈయ‌న‌ను వేరే చోట అవ‌కాశం ఇస్తామ‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు. అయితే, బాబు మాట‌ను ప్ర‌భాక‌ర్ పట్టించుకోవ‌డం లేదు.

ఏం జ‌రిగినా ఫ‌ర్వాలేదు. తాను మాత్రం డోన్ నుంచి పోటీ చేస్తాన‌ని ప్ర‌భాక‌ర్ శ‌ప‌థాలు చేస్తున్నారు. అవస‌రం అయితే, ఇండిపెండెంట్‌గా కూడా పోటీ చేస్తాన‌ని అంటున్నారు. దీనివల్ల‌.. టీడీపీకే న‌ష్టం జ‌రుగుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. బ‌ల‌మైన వ‌ర్గంగా ఉన్న‌బుగ్గ‌న ను ఓడించాలంటే.. టీడీపీ నేత‌లు క‌లిసి క‌ట్టుగా ముందుకు సాగాలి కానీ.. ఇలా విడిపోతే..ఇబ్బంది త‌ప్ప‌ద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.