తొమ్మిది మంది అమ్మాయిలు సఫారీ సూట్లు ధరించి తమ X-95 సబ్-మెషిన్ గన్లు, AK-47లు, 9 mm పిస్టల్‌లను చేతబట్టుకుని కాన్వాయ్ లో వచ్చి తనిఖీలు చేస్తారు. వారు క్షుణ్ణంగా ప్రతీ అంగుళం పరిశీలించిన తరువాతే సీఎం బయటకు వస్తాడు. ఇదంతా యాక్షన్ సినిమాలోని సన్నివేశం కాదు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కి చెందిన ప్రధాన భద్రతా బృందానికి చెందిన సిబ్బంది.
సబ్-ఇన్స్పెక్టర్ ఎం థనుష్ కన్నకి, హెడ్ కానిస్టేబుల్ ఎం ధిల్షాత్ బేగం, కానిస్టేబుల్స్ ఆర్ విద్య, జె సుమతి వీరిలో ప్రధానం కాగా… ఎం కాళీశ్వరి, కె పవిత్ర, జి రామి, వి మోనిషా, కె కౌసల్య కూడా ఈ దళంలో భాగం. ఈ ఏడాది (మార్చి 8) మహిళా దినోత్సవం నాడు ఈ మహిళలు సిఎం కోర్ సెక్యూరిటీ డిటెయిల్లో చేరారు. వారి మొదటి డ్యూటీ అన్నా అరివాలయం (DMK ప్రధాన కార్యాలయం) వద్ద నిర్వర్తించారు.
80 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారుల నుండి షార్ట్‌లిస్ట్ చేయబడిన మహిళలు ఎంపిక చేయబడటానికి ముందు కఠినమైన శారీరక మరియు మానసిక పరీక్షల్లో పాల్గొన్నారు. పరిశీలన నైపుణ్యం, మానసిక చురుకుదనం వంటి ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకుని వీరి ఎంపిక జరిగింది.ఉదాహరణకు, ఒక నిమిషంలో వీరు ఎదురుగా వస్తున్న కారు, దానిలోని వ్యక్తుల సంఖ్య మరియు పరిసరాలలోని ప్రతిదానిని గుర్తించాల్సి ఉంది.