విశాఖ జ‌న‌సేన‌కు.. న‌ర‌సాపురం ర‌ఘురామ‌కు ఫిక్స్ చేసిన బాబు…!

ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలుమారుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌-టీడీపీ పొత్తు దాదాపు ఖాయ‌మైపోయింది. దీనికి సంబంధించి ఇప్ప‌టికే రూట్ మ్యాప్ ను కూడా రెడీ చేసిన‌ట్టు రెండు పార్టీల్లోనూ చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఇక‌, తాజాగా జ‌న‌సేన‌లో మ‌రో చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విశాఖ పార్ల‌మెంటు సీటును జ‌న‌సేన‌కు ఇవ్వాల‌నే ష‌ర‌తు తెర‌మీదికి వ‌చ్చింద‌ని అంటున్నారు.

దీనికి సూత్ర‌ప్రాయంగా చంద్ర‌బాబు కూడా అంగీక‌రించార‌ని చెబుతున్నారు. ఇటీవ‌ల కాలంలో టీడీపీ విశాఖ‌ను ద‌క్కించుకోలేక పోయింది. 2009లో పురందేశ్వ‌రి(కాంగ్రెస్‌), 2014లో కంభం పాటి హ‌రిబాబు (బీజేపీ), 2019లో ఎంవీవీ స‌త్యనారాయ‌ణ (వైసీపీ) విజ‌యం ద‌క్కించుకున్నారు. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ పోటీ చేసినా.. అది వైసీపీకి అప్ప‌గించిన‌ట్టు అవుతుంద‌నే భావ‌న ఉంది.

ఈ క్ర‌మంలో దీనిని జ‌న‌సేన‌కు వ‌దిలేయ‌డం ద్వారా.. న‌ర‌సాపురం టికెట్‌ను త‌మ ద‌గ్గ‌ర పెట్టుకునేందుకు చంద్ర‌బాబు ప్లాన్ చేశార‌ని అంటున్నారు. ఇక‌, విశాఖ నుంచి జ‌న‌సేన నేత నాగ‌బాబు పోటీ చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఇక్క‌డ మెగా ఫ్యాన్స్ ఈయ‌న‌కు అండ‌గా ఉండే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఇటీవ‌ల చిరంజీవి కూడా విశాఖ‌లో ఇల్లు క‌ట్టుకుంటాన‌ని చెప్ప‌డం ద్వారా.. కొంత జోష్ పెరిగింది.

సో.. విశాఖ‌ను జ‌న‌సేన‌కు ఇవ్వ‌డం ఖాయ‌మ‌ని ఆ పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. మ‌రోవైపు.. న‌ర‌సాపురం నుంచి.. వైసీపీ రెబ‌ల్ ఎంపీ.. ర‌ఘురామ‌కృష్ణ‌రాజుకు.. టీడీపీ టికెట్ ఇవ్వ‌నుంద‌ని ఇటువైపు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే ఆయ‌న టీడీపీ అనుకూలంగా.. చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో న‌ర‌సాపురం నుంచి ఆయ‌న‌ను బ‌రిలో దింపితే.. వైసీపీకి చెక్ పెట్టిన‌ట్టు అవుతుంద‌ని వ్యూహాలు వేస్తున్నార‌ని అంటున్నారు.