#Absentcm.. శుక్రవారం సాయంత్రం నుంచి ట్విట్టర్లో పెద్ద ఎత్తున ట్రెండ్ అయిన హ్యాష్ ట్యాగ్. దేశవ్యాప్తంగా ఈ హ్యాష్ ట్యాగ్ మీద ట్వీట్లు పడ్డాయి. ఇంతకీ ఎవరా సీఎం.. ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ కావడం వెనుక కథ ఏంటి అంటే.. యస్ తుపాను పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో.. దీనిపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఆ రెండు రాష్ట్రాల్లో పర్యటించారు. ముందుగా …
Read More »సామాజిక వర్గమే అడ్డంకి: వీరి పరిస్థితి ఇంతేనా ?
రాజకీయాల్లో కులాలకు, రిజర్వేషన్లకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు! సామాజిక వర్గాల ఆధారంగా ఓటు బ్యాంకును నిర్మించుకున్న నాయకులు, రిజర్వేషన్ల ప్రాతిపదికన.. రాజకీయాల్లో రాణించిన నేతలు అనేక మంది ఉన్నారు. అయితే.. ఒకప్పుడు.. ఈ సామాజిక వర్గాలు.. రిజర్వేషన్లు.. చక్రాలు తిప్పితే.. ఇప్పు డు మాత్రం పరిస్థితి కొందరి విషయంలో యూటర్న్ తీసుకుంది. అధికార పార్టీ నేతలకు ఈ పరిణామం ప్రాణ సంకటంగా పరిణమించిందని అంటున్నారు. ఉదాహరణకు జగన్ …
Read More »ఆనందయ్య మందులో కీలక అప్డేట్… తుది నిర్ణయం ఎప్పుడంటే…
కరోనా మందు పంపిణీతో కొంత, దాని చుట్టూ ముసిరిన వివాదంతో మరెంతో ప్రాచుర్యాన్ని సంపాదించిన నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య ఔషధంపై ఇంకా ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఆనందయ్య మందుపై వ్యక్తమైన అభిప్రాయాల నేపథ్యంలో విచారణ సంస్థలు తమ పరీశీలన కొనసాగిస్తున్నాయి. ఇదే సమయంలో, ఔషధం పంపిణీపై ఓ ప్రచారం మొదలైంది. దీని పై స్వయంగా ఆనందయ్య క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఆనందయ్య మందు పంపిణీకి రంగం …
Read More »ఈటల బీజేపీలో ఎప్పుడు చేరుతున్నారంటే…
గత కొద్దికాలంగా వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్న మాజీ మంత్రి , టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత ఈటల రాజేందర్ విషయంలో మరో కీలక అప్డేట్ తెరమీదకు వచ్చింది. ఆయన బీజేపీలో చేరనున్నారనే వార్తలకు బలం చేకూర్చేలా ఎప్పుడు పదవికి రాజీనామా చేయనున్నారు? ఎప్పుడు కాషాయ కండువా కప్పుకోనున్నారనే విషయంలో స్పష్టత వచ్చేసిందని అంటున్నారు. జూన్ 2న తన పదవికి రాజీనామా చేయనున్న ఈటల రాజేందర్ జూన్ 6న బీజేపీలో చేరనున్నట్లు …
Read More »కేరళ సీఎంకు జగన్ స్ఫూర్తి?
కరోనా టైంలో గొప్ప పనితీరును ప్రదర్శించిన ప్రభుత్వాల్లో కేరళలో పినరపి విజయన్ సర్కారును ముందు వరుసలో నిలపాల్సిందే. మిగతా రాష్ట్రాల మాదిరి కరోనా కేసులు, మరణాల్ని తక్కువ చేసి చూపించడం.. తక్కువ పని చేసి ఎక్కువ ప్రచారాలు చేసుకోవడం.. అత్యవసర వైద్య సదుపాయాల విషయంలో చేతులెత్తేయడం.. లాంటివి కేరళలో లేవు. కరోనాకు సంబంధించి దేశం మొత్తంలో అత్యంత పారదర్శకంగా, ఎంతో చురుగ్గా వ్యవహరించిన ప్రభుత్వంగా విజయన్ సర్కారుకు ప్రశంసలు దక్కాయి. …
Read More »అమెజాన్లో సంచలనం సృష్టిస్తున్న ప్రధాని మోడీ పుస్తకం
మీడియా, సోషల్ మీడియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంతగా పాపులర్ అనే విషయం చెప్పనక్కర్లేదు. అయితే, కరోనా సమయంలో మోడీ ఇమేజ్ మసకబారిందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఓ పుస్తకం సంచలనం సృష్టిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి ఉన్న ఆ పుస్తకం అమెజాన్లో అమ్మకాని పెట్టడం, వెనువెంటనే తొలగించడం కూడా జరిగిపోయింది. దీంతో ఏంటి ఆ పుస్తకం ప్రత్యేకత అంటూ పలువరు సెర్చ్ చేస్తున్నారు. మాస్టర్స్ట్రోక్ : …
Read More »ఆనందయ్య పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఆనందయ్య మందు ఇప్పుడో సంచలనంగా మారటమే కాదు.. పెద్ద చర్చకు తెర తీసింది. ఏపీకి చెందిన నేతలు ఆనందయ్య మందుపై సానుకూలంగా స్పందిస్తున్నారు. అధికార.. విపక్షాలకు చెందిన నేతలంతా ఆయన మందుపై సానుకూల ప్రకటనలు చేసే విషయంలో పోటీ పడుతున్నారు. ఏపీ ప్రభుత్వం సైతం ఆనందయ్య మందుపై శాస్త్రీయంగా లెక్క తేల్చే విషయంలో సీరియస్ గా నిర్ణయాలు తీసుకుంటోంది. సానుకూల ఫలితాలు …
Read More »రేవంత్ ఆశలపై నీళ్ళు చల్లినట్లేనా ?
రేవంత్ రెడ్డి ఆశలపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నీళ్ళు చల్లినట్లే అనిపిస్తోంది. ఎలాగైనా తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటికి (టీపీసీసీ)కి అధ్యక్షుడు కావాలన్నది రేవంత్ టార్గెట్. దానికి తగ్గట్లుగానే పార్టీలో చేరకముందు నుండే పావులు కదుపుతున్నారు. అయితే అధిష్టానం నుండి వచ్చిన హామీతో పార్టీలో చేరారు. ముందు ప్రచార కమిటికి ఛైర్మన్ అయ్యారు. వెంటనే టీపీసీసీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. నిజానికి వర్కింగ్ ప్రెసిడెంట్ స్ధానంలోనే ప్రెసిడెంట్ అవ్వాల్సింది. అయితే …
Read More »రాజీనామాకు డేట్ ఫిక్స్ చేసుకున్న ప్రపంచ కుబేరుడు
అత్యున్నత పదవిలో ఉన్నోళ్లు దాన్ని వదిలేందుకు ఆసక్తి చూపించరు. కానీ.. కార్పొరేట్ ప్రపంచంలో అందుకు భిన్నంగా నిర్ణయాలు ఉంటాయి. తాజాగా అలాంటి నిర్ణయాన్నే తీసుకున్నారు ప్రపంచ కుబేరుడు. ఈ- కామర్స్ దిగ్గజం.. అమెజాన్ సంస్థకు సీఈవోగా వ్యవహరిస్తున్న జెఫ్ బెజోస్ తన పదవికి రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యారు. దీనికి సంబంధించి తాజాగా ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన తన వారసుడ్ని వెల్లడించారు. తాజా సీఈవోగా …
Read More »ఆ రెండు బాధ్యతలు బాలయ్య చిన్నల్లుడుకేనా..!
రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న టీడీపీకి చాలా నియోజకవర్గాల్లో సరైన నాయకత్వం లేని సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో ఒక్కసారిగా అధికారం కోల్పోయిన టీడీపీలో చాలామంది నాయకులు సైడ్ అయిపోయారు. పలువురు నాయకులు పార్టీ నుంచి జంప్ కొట్టేశారు. దీంతో రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో టీడీపీకి సరైన నాయకులు లేరు. ఇలా ఇన్చార్జ్లు లేని నియోజకవర్గాలు 30 + ఉన్నాయి. ఈ క్రమంలోనే కీలకమైన విశాఖపట్నం జిల్లాలో విశాఖ సౌత్, …
Read More »ఎవరు ఎవరికి గాలమేస్తున్నారు ?
ఇపుడిదే విషయం అర్ధం కావటంలేదు. టీఆర్ఎస్ ఎంఎల్ఏ, మంత్రివర్గం నుండి భర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ విషయమే ఆసక్తిగా మారుతోంది. టీఆర్ఎస్ లో ఉంటునే భవిష్యత్తు అడుగులు ఎటు వేయాలనే విషయమై చాలా సీరియస్ గా కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ముందు రాజ్యసభ ఎంపి డీ శ్రీనివాస్ లాంటి వారిని కలిశారు. తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు అటు కమలంపార్టీ స్ధానిక నేతలతో భేటీలు జరిపారు. ఒకదశలో …
Read More »సోము స్వయంకృతం… అహంకారమే చేటు చేస్తోందా..?
ఏపీ బీజేపీ సారథి.. ఆర్ ఎస్ ఎస్ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు పరిస్థితి ఇప్పుడు అడకత్తెరలో పోక మాదిరిగా మాదిరిగా మారిందా ? ఇప్పుడు ఆయన ఏం మాట్లాడినా.. తనకు వ్యతిరేకతే ఎదురవుతోందా ? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. సోము వీర్రాజు ఏపీ బీజేపీ పగ్గాలు చేపట్టిన తర్వాత.. కీలకమైన రెండు ఎన్నికలు వచ్చాయి. స్థానిక, కార్పొరేషన్, ఎన్నికలు సహా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక కూడా …
Read More »