షర్మిలకు పొంగులేటి ఫైనాన్స్

ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతులు, ఆగ్రహాలు పెరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆనుకుని, సెటిలర్ల ప్రభావం ఎక్కువగా ఉండే ఈ జిల్లాపై బీఆర్ఎస్ కు పెద్దగా పట్టు లేదు. గెలిచిన నేతలను తమ వైపుకు తిప్పుకునే టాలెంట్ తో బీఆర్ఎస్ ఇంతకాలం పాలిటిక్స్ చేసింది. ఇప్పుడు జిల్లా పార్టీలో అసంతృప్తి పెరిగిపోయి వారు పక్క చూపులు చూస్తున్నారు. అందులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అగ్రగణ్యులనే చెప్పాలి. బీఆర్ఎస్ అధిష్టానం తీరుపై ఆయన పరోక్షంగా భారీ స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు..

వైఎస్ కుటుంబానికి పొంగులేటి భక్తుడనే చెప్పాలి. ఇటీవల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్ విజయమ్మను పొంగలేటి పలుకరించి వచ్చారు. అప్పుడు రాజకీయాలు మాట్లాడారు.త్వరలో షర్మిల నేతృత్వంలోని వైఎస్సార్టీపీతో కలిసి పోయేందుకు పొంగులేటి సంసిద్ధత వ్యక్తం చేశారు. త్వరలోనే ఆయన తన అనుచురలుతో షర్మిల పార్టీలో చేరతారని చెబుతున్నారు. పొంగులేటి ముందే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు.

అంతకముందు మరో విషయం కూడా చెప్పుకోవాలి. జగన్ పై అలిగి హైదరాబాద్ వచ్చేసిన షర్మిలకు పార్టీ నడిపే డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయన్న ప్రశ్న చాలా మంది వేసుకుంటున్నారు. ఇప్పుడు దానికి సమాధానం దొరికింది. పార్టీ పెట్టినప్పటి నుంచి పొంగులేటి ఆమెకు ఫైనాన్స్ చేస్తున్నట్లు చెబుతున్నారు. గుట్టుతప్పుడు కాకుండా నిధులు అందిస్తున్నారు. దానితో ఆమె చీకుచింత లేకుండా వైఎస్సార్టీపీని నడుపుతున్నారు. పార్టీ దైనందిన కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు…

పొంగులేటి కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్టులు చేస్తున్నాయి. వాటికి సంబంధించిన బకాయిలను ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. ఏపీకి అప్పులు పెరిగిపోయినా, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిల్లో ఉన్నా సరే కొందరు కాంట్రాక్టర్లకు మాత్రం డబ్బులు ఆపడం లేదు. అందులో పొంగులేటి ఒకరుగా ఏపీ అధికార వర్గాల్లో వినిపిస్తున్న మాట. దానితో ఖుషీ అవుతున్న పొంగులేటి .. వైఎస్సార్టీపీకి ఫైనాన్స్ చేస్తున్నారు..

ఖమ్మం జిల్లాలో వైఎస్సార్టీపీకి ఆరు నుంచి ఏడు స్థానాల్లో విజయావకాశాలున్నాయని పొంగులేటి వర్గం లెక్కలేసుకుంటోంది. అందులో పాలేరు నియోజకవర్గం నుంచి షర్మిల పోటీ చేయబోతున్నారు. పొంగులేటి కూడా ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. గెలిచి అసెంబ్లీకి వెళ్లాలనుకుంటున్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం అయితే ఆయన ఎదురుగా కూర్చోవాలనుకుంటున్నారు. రోజువారీ బీఆర్ఎస్ ను సవాలు చేయాలనుకుంటున్నారు. చూడాలి మరి…