కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో కొన్ని నిర్ణయాలు ఆసక్తిగాను, ఆశ్చర్యకరంగా కూడా ఉన్నాయి. తాజాగా ఇప్పటి వరకు లేని విధంగా చిరువ్యాపారులకు పాన్ కార్డును తప్పనిసరి చేసింది. తద్వారా.. వారి లావాదేవీలపై కూడా ఐటీ కన్ను పడనుంది. అదే సమయంలో వ్యాపార సంస్థలకు ఇకపై పాన్ కార్డు ద్వారానే గుర్తింపు లభించనుంది. వ్యక్తిగత గుర్తింపు కోసం పాన్, ఆధార్, డీజీ లింక్ తప్పనిసరి.
విద్యుత్ రంగానికి విదిలింపు.. 35 వేల కోట్లు కేటాయింపుతో నిర్మలమ్మ సరిపుచ్చారు. దేశవ్యాప్తంగా కొత్తగా 50 ఎయిర్‌పోర్టులు, హెలిప్యాడ్‌ల నిర్మాణం 2023-24లో చేపట్టనున్నారు. కొవిడ్ సమయంలో నష్టపోయిన MSMEలకు రిఫండ్ పథకం ప్రవేశ పెట్టనున్నారు. ఇక, గిరిజన మిషన్ కోసం రూ.10వేల కోట్లు కేటాయించారు. ఏడాదికి అర్బన్ ఇన్ ఫ్రా ఫండ్ కోసం రూ.10వేల కోట్లు ఇవ్వనున్నారు.
రూ.75వేల కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు నిర్మలమ్మ పెద్దపీట.. గత బడ్జెట్‌లో 60 వేల కోట్లే కేటాయించడం గమనార్హం. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు గుర్తింపు కార్డుగా పాన్ నెంబర్ తప్పనిసరి. మేన్ ఇన్ ఇండియా, మేక్ ఏ వర్క్ మిషన్ ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయింపు చేశారు.
ఎస్టీ వర్గాలకు రూ.15 వేల కోట్లు కేటాయింపు చేశారు. రైల్వేలకు రూ.2.40 లక్షల కోట్లు కేటాయింపు చేశారు. రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల పథకం మరో ఏడాది పొడిగింపు. దీనికోసం 13.7 లక్షల కోట్లు కేటాయింపు చేశారు. బడ్జెట్‌లో మూలధన వ్యయానికి రూ.10లక్షల కోట్లు కేటాయింపు. పీఎం మత్స్యసంపద యోజనకు అదనంగా రూ.6వేల కోట్లు కేటాయించారు.