Political News

ఘోరం.. ఐదంత‌స్థుల భ‌వ‌నం కుప్ప‌కూలిపోయింది

క‌రోనాతో అల్లాడిపోతున్న మ‌హారాష్ట్ర‌లో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. రాయ్ గ‌ఢ్ జిల్లాలోని కాజ‌ల్ పురా ప్రాంతంలో ఓ భారీ భ‌వ‌నం ఉన్న‌ట్లుండి కుప్ప‌కూలిపోయింది. ఐదు అంత‌స్థుల ఈ భ‌వ‌నం పూర్తిగా కుప్ప‌కూలిపోగా.. శిధిలాల కింద 75 మంది వరకూ చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. 25 మంది ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డగా.. ఇంకో 50 మంది శిథిలాల్లో చిక్కుకున్న‌ట్లు స‌మాచారం. వారిలో చాలామంది మ‌ర‌ణించి ఉంటార‌ని …

Read More »

తెలంగాణకు ఏమైంది? రెండో రోజు భారీగా కేసులు నమోదు

తెలంగాణకు ఇరుగుపొరుగున ఉన్న మహారాష్ట్ర.. ఆంధ్రప్రదేశ్.. కర్ణాటక రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా నమోదు కావటం తెలిసిందే. దేశంలో అత్యధిక కేసుల నమోదులో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్.. మూడో స్థానంలో కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాలు తెలంగాణకు సరిహద్దు రాష్ట్రాలుగా ఉండటం గమనార్హం. అయినప్పటికీ.. ఈ మూడు రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణలో కేసుల నమోదు తక్కువగా ఉండేది. దీంతో.. కాస్తంత మెరుగ్గా ఉందనుకుంటున్న …

Read More »

రాహుల్ వెర్సస్ సీనియర్లు.. సీడబ్ల్యూసీ మీటింగ్‌ హాట్ హాట్

కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పు విషయమై నెలకొన్న అంతర్గత సంక్షోభం తీవ్ర స్థాయికి చేరినట్లే కనిపిస్తోంది. రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని విడిచిపెట్టడానికి సోనియా గాంధీ సిద్ధమవుతుండగా.. ఆ పదవిని చేపట్టేందుకు రాహుల్ సుముఖంగా లేని విషయం తెలిసిందే. రాహుల్‌కు పగ్గాలప్పగించే విషయంలో పార్టీలోనూ భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. పార్టీలో ప్రక్షాళన అవసరమని పేర్కొంటూ.. రాహుల్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ పార్టీలో 23 మంది సీనియర్ నేతలు ఇటీవల …

Read More »

తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు ఓ అదిరిపోయే గుడ్ న్యూస్‌

క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతున్న త‌రుణంలో దేశ‌వ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నివ‌సిస్తున్న ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్. కీల‌క స‌మయంలో కేంద్రం తీపిక‌బురు తెలిపింది. లాక్‌ ‌డౌన్ విముక్తి అయిపోయి అన్‌లాక్ ద‌శ‌లు ఒక‌దాని వెంట ఒక‌టి వ‌స్తున్నా… ఒక రాష్ట్రం నుంచి మ‌రో రాష్ట్రానికి వెళ్తున్న ప్ర‌జ‌ల‌కు కొన‌సాగుతున్న క‌ష్టాల‌కు చెక్ ప‌డింది. అంతర్రాష్ట్ర రవాణాపై ఆంక్షలు ఉండకూడదని కేంద్రం అన్ని రాష్ట్రాల‌ను ఆదేశించింది. అంత‌రాష్ట్ర ర‌వాణ విష‌యంలో కీల‌క …

Read More »

ఈ అమ్మాయి క‌థ చ‌దివి తీరాల్సిందే

అన్ని సౌక‌ర్యాలూ ఉంటాయి. దేనికీ లోటుండ‌దు. శుభ్రంగా చ‌దువుకోమంటే చాలామందికి శ్ర‌ద్ధ ఉండదు. ఇంకొంత‌మందేమో.. సౌక‌ర్యాల లేమిని, ఆర్థిక ఇబ్బందులనే సాకుగా చూపించి స‌రిగా చ‌ద‌వ‌రు. కానీ మ‌హారాష్ట్ర‌కు చెందిన స్వ‌ప్నాలి సుతార్ మాత్రం అలా కాదు. ఆమెకు ఎటు చూసినా ఇబ్బందులే. కానీ అవేవీ ఆమె చ‌దువులో అద్భుతాలు చేయ‌నివ్వ‌కుండా ఆప‌లేదు. మారు మూల అట‌వీ ప్రాంతంలో పుట్టిన గిరిజ‌న అమ్మాయి స్వ‌ప్నాలి. త‌న‌ది పేద కుటుంబం. త‌ల్లిదండ్రులు …

Read More »

నన్నొకడు మోసం చేసి సీఎం అయ్యాడు-మోహన్ బాబు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరెత్తితే చాలు మంటెత్తిపోతారు సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మంచు మోహన్ బాబు. ఒకప్పుడు బాబుతో కలిసి రాజకీయ ప్రయాణం సాగించిన ఆయన.. ఆ తర్వాత ఆయనకు దూరమయ్యారు. ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయి. గత కొన్నేళ్లలో బాబు పేరెత్తితే చాలు మోహన్ బాబు తిట్ల వర్షం కురిపించేస్తున్నారు. గత ఏడాది ఎన్నికల ముంగిట తన విద్యా నికేతన్ …

Read More »

పండుగపూట.. తన బలగం ఏమిటో చూపించిన ఎంపీ రఘురామ

తరచూ వార్తల్లోకి వస్తున్నారు నరసాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు. సొంత పార్టీపై తరచూ గళం విప్పుతూ.. అసమ్మతివాదిగా.. ఫైర్ బ్రాండ్ గా వ్యవహరిస్తున్న ఆయన తాజాగా మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఢిల్లీలో ఉంటున్న ఆయన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఏపీ ప్రభుత్వంపై తరచూ విమర్శలు చేయటంతో సొంత పార్టీ నేతలు.. కార్యకర్తలు ఆయన తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. …

Read More »

సీఎం కేసీఆర్ సంతకాన్నే ఫోర్జరీ చేసిన మంత్రి అనుచరుడు

అత్యున్నత స్థానాల్లో ఉన్న వారికి వ్యక్తిగత అనుచరులు.. పనులు చేసే వారికి సంబంధించిన సమాచారం పెద్దగా బయటకు వచ్చేది కాదు. మారిన కాలానికి తగ్గట్లు అందుబాటులోకి వచ్చిన వాట్సాప్.. సోషల్ మీడియా పుణ్యమా అని.. సదరు ప్రముఖులతో కూడిన ఫోటోల్ని ప్రముఖంగా పోస్టు చేసుకోవటం.. వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకోవటం ఈ మధ్యన పెరుగుతోంది. పేరు ప్రఖ్యాతుల్ని పెంచుకోవటం వరకు ఉత్సాహాన్ని ప్రదర్శించటం బాగానే ఉన్నా.. దాన్ని అడ్డు పెట్టుకొని …

Read More »

కొవాక్జిన్ వ్యాక్సిన్ చేసే విధానంలో మార్పునకు కేంద్రం ఓకే

కరోనాకు చెక్ పెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రయోగాలు జరుగుతున్నాయి. పలు సంస్థలు ఇప్పటికే క్లినిక్ ట్రయల్స్ ను చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు రెండు దశలు పూర్తి అయి.. మూడో దశను చేపట్టారు. భారత్ విషయానికి వస్తే.. ప్రఖ్యాత భారత్ బయోటెక్ సంస్థ తన కొవాక్జిన్ వ్యాక్సిన్ కు సంబంధించి క్లినికల్ ట్రయల్స్ ను నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ టీకాకు సంబంధించి కేంద్రం కీలక అనుమతుల్ని జారీ …

Read More »

ఐపీఎల్-2020: `బుడగ`లో చిక్కుకున్న బుకీలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)…ప్రపంచవ్యాప్తంగా ఈ టోర్నీకి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ధనాదన్ టీ20 క్రికెట్ లోకి లేటుగా అడుగుపెట్టినప్పటికీ…బీసీసీఐ నిర్వహిస్తోన్న ఐపీఎల్ కు విపరీతమైన పాపులారిటీ వచ్చింది. బిగ్ బాష్ వంటి లీగ్ లతో పోలిస్తే ఐపీఎల్ సక్సెస్ రేట్ తో పాటు ఆదాయం కూడా ఎక్కువే. అందుకే, ఐపీఎల్ వస్తోందంటే చాలు అందులో పాల్గొనే ఆటగాళ్లతోపాటు…ఆయా ఫ్రాంచైజీలు, అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలలో ఉత్సాహం కనిపిస్తుంది. …

Read More »

ఎన్నికల వేళ.. మాజీ సీఎంకు దెబ్బేసిన వియ్యంకుడు

తిరుగులేనట్లుగా వెలిగిపోవటం.. ఏం చేసినా.. ఏమన్నా.. ఎదురులేని తీరుకొందరికి కొన్ని సందర్భాల్లో ఉంటుంది. ఆ టైంలో వారేం చేసినా అదే రైట్ అన్నట్లు ఉంటుంది. అలాంటి కాలాన్ని సద్వినియోగం చేసుకునే వారికి తర్వాతి కాలంలో తిప్పలు పడాల్సిన అవసరం ఉండదు. లేదంటే.. కష్టాలు తప్పవు. బిహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు కొంతకాలంగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. నితీశ్ తో కలిసి అధికారాన్ని పంచుకున్న వేళలో.. …

Read More »

మంత్రికి మంట పుట్టే సవాలు విసిరిన రఘురామ

ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలి పెట్టకుండా ఏపీ అధికారపక్ష నేతల్ని ఒక ఆట ఆడుకుంటున్న నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తాజాగా ఏపీ మంత్రికి సింపుల్ సవాలు విసిరి.. ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. తనను ఉద్దేశించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బాగుండదని హెచ్చరిస్తూ.. మాటలు కాదు.. దమ్ముంటే.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నరసాపురం నియోజకవర్గంలోకి వచ్చిన వినాయక చవితి పూజలు చేయాలని వార్నింగ్ ఇచ్చారు. నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే బాగుండదన్న …

Read More »