వేతన జీవుల‌పై నిర్మ‌ల‌మ్మ క‌రుణ..

ఆదాయ ప‌న్ను ప‌రిమితి పెంచుతూ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్‌.. తీసుకున్న నిర్ణ‌యం వేత‌న జీవుల‌కు ఒకింత ఊర‌ట క‌ల్పించింద‌నే చెప్పాలి. కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో పలు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. టీవీ ప్యానెళ్లపై కస్టమ్స్‌ డ్యూటీ 2.5శాతం తగ్గించింది. టీవీలు, మొబైళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు ధరలు భారీగా తగ్గనున్నాయి.

అదే స‌మ‌యంలో వేతనజీవులకు కేంద్రం ఊరట లభించింది. ఆదాయ పన్ను పరిమితి పెంపు రూ.7 లక్షల వరకు పెంచారు. అయితే.. వివిధ శ్లాబుల్లో మార్పులు చేశారు.
కొత్త‌గా ప‌న్ను చెల్లించేవారికి రూ.0- 3 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను 0
3 ల‌క్ష‌ల నుంచి 6 ల‌క్ష‌ల వేత‌నం పొందేవారికి 5 శాతం
6 ల‌క్ష‌ల నుంచి 9 ల‌క్ష‌ల వేత‌నం పొందేవారికి 10 శాతం
9 ల‌క్ష‌ల నుంచి 12 ల‌క్ష‌ల వేత‌నం పొందేవారికి 15 శాతం
12 ల‌క్ష‌ల నుంచి 15 ల‌క్ష‌ల వేత‌నం పొందేవారికి 30 శాతం
ప‌న్నులు విధించ‌నున్నారు. ఇవి ఇప్పుడున్న శ్లాబుల‌తో పోలిస్తే.. కొంత వెసులుబాటు క‌ల్పించిన‌ట్ట‌యింది.

కోర్టుల పెంపు
ఈ-కోర్టుల ప్రాజెక్ట్‌కు రూ.7 వేల కోట్లు కేటాయింపు. ఇది ఒక‌ర‌కంగా భారీ బ‌డ్జెట్ అనే చెప్పాలి. దేశంలో పెరిగిపోతున్న పెండింగు కేసుల‌ను ప‌రిష్క‌రించేందుకు అవ‌కాశం ఉంది. కానీ, సిబ్బంది(న్యాయ‌వాదులు, న్యాయ‌మూర్తుల విష‌యం పై స్ప‌ష్ట‌త రావాల్సిఉంది)