జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ మంత్రి, వైసీపీ నాయకుడు గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్య లు చేశారు. పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన అసలు పార్టీనే కాదన్నారు. ఆయన కేవలం టీడీపీలో ఒక సీనియర్ కార్యకర్త మాత్రమేనని చెప్పారు. కాపు సామాజిక వర్గం ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు. పార్టీ పెట్టిన వారు ఎవరైనా తమ కాళ్లపై తాము ఎదగాలని కోరుకుంటారని చెప్పారు.
కానీ, పవన్ మాత్రం.. మాకు 10 చాలు, 20 చాలు, 25 చాలు, 30 చాలు అంటూ బేరాలు ఆడుకుంటూ.. పొరుగు పార్టీ జెండా మోసేందుకు.. ఆ పార్టీకి కూలి పని చేసేందుకు కృషి చేస్తున్నారని మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాపులు ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు. తాము 2014లో 175 స్థానాల్లోల పోటీ చేసి 67 చోట్ల విజయం దక్కించుకున్నామని.. 2019లో 151 సీట్లు గెలిచామని, 2024లో 175కి 175 సీట్లు గెలిచేందుకు ప్రయత్నం చేస్తున్నామని మంత్రి చెప్పుకొచ్చారు.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్న మంత్రి.. ఏపీలో సినిమా సాగడం లేదని.. రాజకీయాలు జరుగుతున్నా యని.. ఈవిషయం పవన్ తెలుసుకుంటే మంచిదని సూచించారు. పెందుర్తిలోని వేపగుంటలో కాపు సామాజిక భవనం ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌పై విమర్శించారు. ఒక రాజకీయ పార్టీ పెట్టిన వ్యక్తి దానికోసం ప్రయత్నించాలన్నారు. 175కి 175 పోటీ చేస్తే.. సత్తా ఏంటో తెలుస్తుందని.. ప్రజలు కూడా స్వాగతిస్తారని వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates