Political News

ఒక ట్వీట్ చేసి లక్ష కోట్లు పోగొట్టుకున్నాడు !

ఒక ట్వీట్ విలువ రూ.1.10లక్షల కోట్లా? అంటే అవుననే చెప్పాలి. తాజాగా అపర కుబేరుడు చేసిన ఒక్క ట్వీట్ అతగాడి ఆస్తిని అమాంతం తగ్గేలా చేసింది. ఇంతకీ ఆ అపర కుబేరుడు ఎవరు? అతను చేసిన ట్వీట్ సారాంశం ఏమిటి? అంతలా ఆయన ఆస్తి ఎందుకు కరిగిపోయింది? అన్న వివరాల్లోకి వెళితే.. ప్రముఖ విద్యుత్ కార్ల కంపెనీ సంస్థ టెస్లా అధినేత.. ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ తాజాగా …

Read More »

పరిషత్ ఎన్నికలు జనసేనకు ఇష్టం లేదా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పోయిన సంవత్సరంలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికల ప్రక్రియను పూర్తిగా రద్దుచేసి మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని జనసేన కోర్టులో పిటీషన్ వేసింది. ఈ మేరకు పార్టీలో కీలక నేత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతు పోయిన ఏడాది జరిగిన పరిషత్ ఎన్నికలు ధౌర్జన్యాలు, బెదిరింపులతో ఏకపక్షం చేసుకున్నట్లు చెప్పారు. అందుకనే అప్పటి ఎన్నికల ప్రక్రియను నూరుశాతం రద్దు చేయాల్సిందే …

Read More »

20వేల ఫ్రీ వాటర్ స్కీం అమలులో కొత్త రూల్.. అపార్ట్ మెంట్ వాసులకు షాకేనా?

జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా నల్లా నీటిని ప్రతి నెలా 20వేల లీటర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇవ్వటం.. ఎన్నికల్లో అనుకున్నంత సానుకూల ఫలితాలు రానప్పటికి.. తాము ఇచ్చిన హామీని అమలు చేస్తున్నట్లుగా అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. మాటల్లో చెప్పిన దానికి.. చేతల్లో చూపించే దానికి మధ్య వ్యత్యాసం ఉన్నట్లే… జలమండలి తాజాగా తీసుకొచ్చిన కొత్త నిబంధన ఇప్పుడు షాకింగ్ గా మారినట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు ఉన్న మార్గదర్శకాల ప్రకారం.. …

Read More »

యోగా గురు రాందేవ్ టైం బ్యాడ్‌.. అరెస్టుకు రంగం సిద్ధం!

ప్ర‌పంచ ప్ర‌సిద్ధ‌.. యోగా గురు.. రాందేవ్ బాబా టైం బాగోలేదా.. ఆయ‌న‌ను ఏ క్ష‌ణంలో అయినా అరెస్టు చేసేందుకు పోలీసులు రెడీ అయ్యారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడించిన క‌రోనాను అంతం చేసేందుకు లేదా నివారించేందుకు ప్రపంచంలో త‌ల‌పండిన శాస్త్ర‌వేత్త‌లు సైతం త‌ర్జ‌న భ‌ర్జ‌న పడుతున్నారు. ప్ర‌స్తుతం మ‌న ద‌గ్గ‌ర వ్యాక్సిన్ క‌నుగొన్నా.. దానిపైనా ఇటీవ‌ల ఓ దేశం అనేక సందేహాలు వ్య‌క్తం చేసింది. ఇక‌, మ‌న …

Read More »

ఏబీఎన్ డిబేట్‌లో బీజేపీ నేత‌ను చెప్పుతో కొట్టిన కీల‌క నేత‌

వ‌ర్త‌మాన రాజ‌కీయ వ్య‌వ‌హారాల‌పై ఏబీఎన్-ఆంధ్ర‌జ్యోతి న్యూస్ ఛానెల్ నిర్వ‌హించిన చ‌ర్చా కార్య‌క్ర‌మంలో దారుణం చోటు చేసుకుం ది. బీజేపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి, ఎమ్మెల్సీ విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డిని లైవ్‌లోనే చెప్పుతో కొట్టిన ఘ‌ట‌న రాజ‌కీయంగా సంచ‌ల‌నం సృష్టిస్తోం ది. తాజాగా లైవ్‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌పై బీజేపీ నేత‌లు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా ఏపీ ప్ర‌భుత్వ కేబినెట్ మీటింగ్ జ‌రిగింది. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ స‌ర్కారు కొన్ని …

Read More »

కాపులు కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.. ప‌వ‌న్ దే లేటు!!

నిన్న మొన్న‌టి వ‌ర‌కు.. త‌న‌కు కులాల‌ను అంట‌గ‌ట్ట‌వ‌ద్ద‌ని.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వీరావేశంలో చెప్పుకొచ్చారు. తాను అభినవ రాజ‌కీయ నేత‌న‌ని.. త‌న‌కు ఏ కుల‌మూ.. మ‌త‌మూ లేద‌ని కూడా ఆయ‌న వెల్ల‌డించారు. త‌న‌ను కులం అనే రాట‌కు క‌ట్టేస్తారా?  ఇంత సంకుచితంగా చూస్తారా? అంటూ.. ప్ర‌తిప‌క్షాల‌పై విరుచుకుప‌డ్డారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఆయ‌న ఏ కులం వ‌ద్దు.. త‌న‌కు ఏ రంగు పూయ‌వ‌ద్దు.. అన్నారో.. అదే కులం ఆయ‌న‌ను …

Read More »

బైడెన్ సర్కారులో మరో ఇండియన్ అమెరికన్ కు కీలక బాధ్యతలు

కలలో కూడా ఊహించని రీతిలో భారతీయ అమెరికన్లకు అవకాశాలు లభిస్తున్నాయి. భారత మూలాలు ఉన్న మహిళ అగ్రరాజ్యమైన అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడూ లేని రీతిలో భారత మూలాలు ఉన్న పలువురికి బైడెన్ సర్కారులో పదవులు దక్కుతున్నాయి. తాజాగా ఆ కోవలోకే మరో మహిళ చేశారు. భారత అమెరికన్ అయిన బిడీషా భట్టాచార్యను వ్యవసాయశాఖలోని కీలక స్థానంలో నియమిస్తూ బైడెన్ సర్కారు తాజాగా నిర్ణయం …

Read More »

జూన్ తర్వాత వైసీపీకి తిరుగులేదా ?

YS Jagan Mohan Reddy

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే శాసనమండలిలో రాబోయే జూన్ నాటికి పార్టీల బలాల్లో తీవ్రమైన మార్పులు రాబోతోంది. ఇపుడు మండలిలో మెజారిటి ఉన్న టీడీపీకి జూన్ తర్వాత మైనారిటిలోకి పడిపోతోంది. ఇపుడు 10 మంది సభ్యులతో రెండోపార్టీగా నిలిచిన వైసీపీ జూన్ తర్వాత మెజారిటి సాధించబోతోంది. దాంతో ఇటు అసెంబ్లీ అటు శాసనమండలిలో ఎదురు ఉండదన్న విషయం అర్ధమవుతోంది. ప్రస్తుతం అధికార …

Read More »

పవన్ను రెచ్చగొడుతున్న గంట ?

విశాఖ ఉక్కు విషయంలో రాజీనామా చేసిన టీడీపీ ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను బరిలోకి లాగుతున్నారా ? తాజాగా గంటా చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. కేంద్రం తీసుకున్న ఉక్కు ప్రవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా పవన్ బరిలోకి దిగాలని డిమాండ్ చేశారు. బీజేపీని వదిలిపెట్టేసి పవన్ విడిగా ఆందోళనల్లోకి దిగాలని గట్టిగా సూచించారు. పవన్ను మాత్రమే గంటా బరిలోకి లాగటం లేదు. …

Read More »

ఆ రాష్ట్ర బీజేపీ అగ్రనేత ఫ్యామిలీలో నలుగురు సూసైడ్

రాజస్థాన్ బీజేపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు మదన్ లాల్ సైనీ కుటుంబంలోని నలుగురు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న వైనం తాజాగా వెలుగు చూసింది. దీంతో.. రాష్ట్ర రాజకీయ వర్గాల్లోఈ అంశంపై సంచలనంగా మారింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవటంపై పెద్ద ఎత్తున విషాదం వ్యక్తమవుతోంది. ఎందుకిలా? అన్న ప్రశ్నకు సమాధానం వెతికినప్పుడు.. మదన్ లాల్ సైనీ కుటుంబానికి …

Read More »

పీవీ కుమార్తెకు టికెట్.. కేసీఆర్ కు పోయేదేమీ లేదు

రాజకీయ చదరంగంలో ఎప్పుడు ఎలాంటి ఎత్తు వేయాలన్న విషయంలో గులాబీ బాస్.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు రోటీన్ కు భిన్నంగా ఉంటుంది. కీలకమైన ఎన్నికల వేళ..సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీసి సంధిస్తున్న గులాబీ బాస్ చతురతకు ఫిదా కావాల్సిందే. తెలంగాణ అధికార పార్టీకి మొదట్నించి షాకుల మీద షాకులు ఇచ్చే అతి కొద్ది ఎన్నికల్లో హైదరాబాద్ పట్టభద్రుల ఎన్నికగా చెప్పాలి. మరెక్కడైనా గులాబీ హవా కనిపిస్తుందేమో కానీ.. …

Read More »

పరువు నిలిపిన సొంత గ్రామం

మొత్తానికి పుట్టి పెరిగిన సొంత గ్రామం నారావారిపల్లే చంద్రబాబునాయుడు పరువు కాస్త నిలిపింది. నాలుగో విడతలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలోని అనేక పంచాయితీలకు ఎన్నికలు జరిగాయి. మిగిలిన పంచాయితీల్లో వైసీపీ మద్దతుదారులు ఘన విజయం సాధించారు. అయితే చంద్రబాబు పుట్టి పెరిగిన సొంతగ్రామం నారావారి పల్లె పంచాయితిలో మాత్రం టీడీపీ మద్దతుదారే గెలిచారు. ఇక్కడ తెలుగుదేశంపార్టీ మద్దతుదారు పోటీ చేసిన లక్ష్మి సమీప అభ్యర్ధిపై 563 ఓట్ల మెజారిటితో గెలిచారు. …

Read More »