ఔను! తాజాగా ఏపీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్య తీవ్ర దుమారానికి దారితీస్తోంది. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ను ఉద్దేశించి మంత్రి అంబటి తీవ్రమైన వ్యాఖ్య చేశారు. ఇది ఆయన స్థాయికి అంటే.. మంత్రిగా తగని వ్యాఖ్య. ఏ గల్లీ నాయకుడో లేక పోతే మంత్రి పదవిలో లేని నాయకుడో చేస్తే.. వేరేగా ఉండేది. కానీ, ఆయనే నోరు పారేసుకున్నారు. బానిససేన అధ్యక్షుడు .. మళ్లీ వచ్చాడండి రాష్ట్రానికి అని …
Read More »చేతులు ఎత్తి దణ్నం పెట్టి చెబుతున్నా.. : కేసీఆర్
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో కేసీఆర్ పాల్గొన్నారు. ప్రసంగించింది చాలా కొద్దిసేపే అయినా..సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఎన్నికలు రాగానే మనకొక గత్తర పట్టుకుంటుంది. కొందరు ఎన్నికలు వస్తే గాలిపైనే నడుస్తరు. ఒక గాలి కాదు.. ఒక గత్తర కాదు. విచిత్ర వేషగాళ్లు.. అనేక మంది.. అనేక పార్టీలు వస్తాయి. వాళ్లకు గాయ్‌గాయ్ గత్తర వస్తది. మనకెందుకు రావాలి? దయచేసి ఆలోచించండి. నేను చెప్పానని కాదు. తమ్మినేని వీరభద్రం చెప్పారని కాదు.. …
Read More »ఏపీలో బీజేపీకి అభ్యర్థులు ఎక్కడ !
రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏంటి? ఎలా ముందుకు సాగాలి? ఎంతసేపూ.. కేంద్రంపైనే ఆధారపడాలా? లేక మనకంటూ.. ఏమైనా ఆలోచన ఉందా? ఇదీ.. బీజేపీ రాష్ట్రనాయకుల్లో జరుగుతున్న చర్చ. తాజాగా ఇదే విషయంపై కొందరు నాయకులు కూడా.. పార్టీ చీఫ్ సోము వీర్రాజును కలిశారు. రాష్ట్రం లోని రెండు ప్రదాన పార్టీలు దూకుడుగా ముందుకుసాగుతున్నాయి. మరి మన సంగతి ఏంటి? అనివారు ప్రశ్నించారు. ఎందుకంటే.. అటు వైసీపీ అయినా.. ఇటు టీడీపీ …
Read More »పైన మోడీ.. ఇక్కడో బోడి.. మధ్యలో ఈడీ
మాటకారితనంలో, ప్రత్యర్థుల మీద పంచులు వేయడం, పదునైన విమర్శలు గుప్పించడంలో తండ్రి కేసీఆర్‌కు తగ్గ తనయుడిగా ఎప్పుడో రుజువు చేసుకున్నాడు కేటీఆర్. కీలకమైన మునుగోడు ఉప ఎన్నిక ముంగిట ఆయన ఆయన తన మాటల పదును మరోసారి చూపించారు. టీవీ9 స్టూడియోలో కూర్చుని ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్.. ప్రత్యర్థులపైకి తనదైన శైలిలో వాగ్బాణాలు సంధించారు. ఈ సందర్భంగా కేటీఆర్ చేసిన ఒక కామెంట్ వైరల్ అయింది. ‘మోడీ …
Read More »కేసీఆర్ సంచలన నిర్ణయం.. సీబీఐ రావొద్దంటూ జీవో!
తెలంగాణ సర్కార్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తునకు అనుమతిని ఉపసంహరించింది. రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేసుకునేలా గతంలో అనుమతి ఉండేది. గతంలో సీబీఐకి ఇచ్చిన అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇందుకు సంబంధించి ఆగస్టు 30వ తేదీరోజే జీవో 51ను ప్రభుత్వం జారీ చేసింది. అయితే, దీనిని ఇప్పటి వరకు బయటపెట్టలేదు. నిజానికి ఇది ఆగస్టులోనే తీసుకుంటే.. రెండు మాసాల పాటు ఏంచేశారనేది ప్రశ్న. …
Read More »జోడోయాత్ర : రాహుల్ సండే స్పెషల్ వైరల్
గతానికి విరుద్దంగా వర్తమాన రాజకీయాల్ని గమనిస్తే.. ఒక కొత్త కోణం కనిపిస్తుంది. వ్యవస్థల్ని నిర్వీర్యం చేసే కొత్త తరహా కుట్రలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. సున్నిత మనస్కుడ్ని చేతకానివాడిలా.. శాంత స్వభావిని పిరికివాడిలా.. సర్దుకుపోయే గుణాన్ని ధైర్యం లేకపోవటాన్ని..పదవీ కాంక్షను ప్రదర్శించని వ్యక్తిని పప్ను మాదిరిగా చిత్రీకరిస్తున్న వైనం భారతావనిలో చూస్తున్నాం. దీనికి నిలువెత్తు నిదర్శనంగా రాహుల్ గాంధీని చెప్పాలి. ఆయనకు సంబంధించిన గుణాల్ని బయటకు రాకుండా.. ఆయన …
Read More »ఎన్టీఆర్ కు సీఎం ఆహ్వానం.. తెరవెనుక బీజేపీ?
తన నటనతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్.. కర్ణాటక అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం ఆహ్వానం పంపించింది. ఈ విషయంలో కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై ప్రమేయం ఉందని అంటున్నారు. పైగా.. బీజేపీ కూడా ఉందనే గుసగుస కూడా వినిపిస్తోంది. ఎందుకంటే.. వచ్చే ఏడాది కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జూనియర్ ను ఆకస్మికంగా అసెంబ్లీకి రావాలని ఆహ్వానించడం వెనుక బీజేపీ ఖచ్చితంగా …
Read More »తుమ్మల బ్యాక్.. టీడీపీలో జోష్!
సీనియర్ నాయకుడు, వివాద రహిత నేత, తుమ్మల నాగేశ్వరరావు అందరికీ సుపరిచితులే. తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చక్రం తిప్పిన ఆయన టీడీపీలో ఉండగా మంత్రిగా కూడా పనిచేశారు. జిల్లాను శాసించే స్థాయికి ఎదిగారు. అయితే, తెలంగాణ ఆవిర్భావం తర్వాత టీడీపీ కొంత వెనుక బడడంతో ఆయన తన రాజకీయాలను మార్చుకుని తెలంగాణ రాష్ట్రసమితిలోకి వెళ్లిపోయారు. అయితే.. ఇక్కడ మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మళ్లీ ఆయన టీడీపీ సైకిల్ …
Read More »విశాఖలో పవన్ సంచలన ‘మార్చ్!’
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖను విడిచి పెట్టడం లేదు. ఈ నెల 5న విశాఖ కేంద్రంగా ఆయన జనవాణి కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, అదేరోజు వైసీపీ నాయకులు గర్జన పేరుతో హల్చల్ చేశారు. విశాఖను పాలనా రాజధాని చేయాలనే డిమాండ్‌తో వైసీపీ నేతలు ఇక్కడ ర్యాలీ నిర్వహించారు.ఆ తర్వాత విశాఖ విమానాశ్రయంంలో ఏర్పడిన వివాదం చినుకు చినుకు గాలి వాన అయిన చందంగా పవన్‌కు, వైసీపీ నేతలకు …
Read More »మునుగోడులో రైతు అవతారం ఎత్తిన పాల్!
ఈ ఫొటోలో ఉన్నది ఎవరో గుర్తు పట్టారా? తమిళసినీ ఇండస్ట్రీకి చెందిన కమెడియన్లా ఉన్నాడు కదూ! కానీ, కాదు. మనోడో.. మన పాలే! మునుగోడు ఉప ఎన్నికలో తనదైన శైలిలోదూసుకుపోతున్న ప్రజాశాంతి పార్టీ అధినేత, శాంతి దూతగా చెప్పుకొనే కేఏ పాలే తాజాగా ఈ వేషం కట్టారు. పక్కా రైతు వేషంలో ఓటర్లను పలకరించి.. కాసేపు వారితో ముచ్చటించారు. చండూరులో రైతు వేషంలో ఓటర్లను పలకరించారు పాల్. తలకు కండువా …
Read More »ఫామ్‌హౌజ్ కేసులో హైకోర్టు తీర్పు ఇదే!
ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన ఫామ్‌హౌజ్ కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితులను రిమాండ్ కు తరలించాలని ఆదేశించింది. అంతేకాదు, ఈ కేసులో అవినీతి నిరోధక శాఖ కోర్టు రిమాండ్‌కు పంపడాన్ని తిరస్కరిస్తూ ఇచ్చిన తీర్పును హైకోర్టు సస్పెండ్ చేసింది. వాస్తవానికి ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని సైబరాబాద్ పోలీసులు హైకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనంలో సుదీర్ఘ వాదనలు జరిగాయి. తొలుత దీనిపై నిందితులు …
Read More »మూడు రాజధానులపై వైసీపీలోనే మంటలు!
మూడు రాజధానుల విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటున్న వైసీపీ ప్రభుత్వం కానీ, ఆ పార్టీ నాయకులు కానీ ప్రజలను ఏమేరకు ఒప్పిస్తున్నారో తెలియదు కానీ, వారిలో వారే వింత వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ఇటీవల విశాఖ రాజధానికి మద్దతుగా గర్జన నిర్వహించారు. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా.. ‘వైసీపీ ఆత్మగౌరవ మహా ప్రదర్శన’ పేరుతో భారీ ర్యాలీకి రెడీ అయింది. అయితే, దీనిపై రాయల సీమలోని వైసీపీ నేతల్లో భిన్న వైఖరి వ్యక్తమైంది. దీనికి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates