ఏపీ సీఎం జగన్ విఫలమయ్యారా? సఫలమయ్యారా? అనేది కీలకంగా మారిన అంశం. ఎన్నికలకు మరో 14 నెలలు మాత్రమే గడువు ఉంది. మీరంతా బాగా పనిచేయాలని.. సీఎం జగన్ తన పార్టీ నేతలకు, ఎమ్మెల్యేలకు ఎంపీలకు, మంత్రులకు సూచించారు. సో.. దీనిని బట్టి ముందస్తు ఎన్నికలు లేవనేది సుస్పష్టం గా తెలిసిపోయింది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు అలెర్ట్ అయ్యారు. ఎందుకంటే.. ముందస్తు ఉందని బాబు అనుకున్నారు.
దీంతో ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలు చాలని అనుకున్నారు. ఇవే తమను గెలిపిస్తాయని కూడా చంద్రబాబు భావించారు. మరోవైపు యువగళం ఎలానూ ఉందని భావిస్త్తున్నారు. కానీ, అనూహ్యంగా జగన్ ముందస్తు లేదని చెప్పకనే చెప్పారు. ఎన్నికలకు మరో 14 మాసాలు మాత్రమే గడువు ఉందని తేల్చి చె ప్పారు. అంటే.. ఎప్పటిలాగానే ఎన్నికలు జరుగుతాయి. ఈ 14 మాసాల్లో అనేక కార్యక్రమాలు చేసేందుకు జగన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
దీంతో చంద్రబాబు కూడా వాటికి కౌంటర్‌గా కార్యక్రమాలకు రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంది. దీనిని ఆయన ఇప్పటికే గుర్తించారు. దీంతో వెంటనే మరోసారి ఇదేం ఖర్మ.. కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు మరో రూపంలో వైసీపీకి కౌంటర్ ఇచ్చేలా.. కార్యక్రమాలు చేపట్టాలనేది చంద్రబాబు వ్యూహంగా ఉంది. ప్రతి నియోజకవర్గంలోనూ.. త్వరలోనే టికెట్లు కన్ఫర్మ్ చేసేస్తారని తెలుస్తోంది.
ఇలా.. టికెట్లు దక్కించుకున్నవారిని వెంటనే రంగంలోకి దింపేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. నాయకులను పాదయాత్ర చేసేలా ప్రోత్సహించాలని చూస్తున్నారు. అదేసమయంలో ‘మళ్లీ మీరే రావాలి’ నినాదాన్ని.. ప్రజల్లోకి తీసుకువెళ్లేలా.. వైసీపీ అంటిస్తున్న ‘మా నమ్మకం నువ్వే జగన్’ మాదిరిగా.. వీటిని స్టిక్కర్లు గా అంటించాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇవి.. రూపకల్పన దశలో ఉన్నాయని.. త్వరలోనే కార్యాచరణకు దిగనున్నారని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates