న‌న్ను చంపేస్తామంటున్నారు.. రాజాసింగ్ సంచ‌ల‌న ట్వీట్‌

తెలంగాణ బీజేపీ ఫైర్‌బ్రాండ్, ఘోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచ‌ల‌న ట్వీట్ చేశారు. త‌న‌ను చంపేస్తామ‌ని కొంద‌రు బెదిరిస్తున్నార‌ని.. ఆయ‌నకు ప‌దే ప‌దే ఫోన్లు కూడా చేస్తున్నార‌ని ఆయ‌న తెలిపారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, తెలంగాణ డీజీపీ, హైదరాబాద్‌ సీపీలను రాజాసింగ్‌ తన ట్వీట్‌కు ట్యాగ్‌ చేశారు.

విష‌యం ఏంటంటే..

ఇటీవ‌ల కాలంలో త‌న‌కు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ కారు ప‌నిచేయ‌డం లేద‌ని.. ప‌దే ప‌దే మొరాయిస్తోంద‌ని రాజాసింగ్ తెలిపారు. దీనిని మార్చాల‌ని కొత్త బుల్లెట్ ప్రూఫ్ కారు ఇవ్వాల‌ని ఆయ‌న నేరుగా సీఎం కేసీఆర్‌ను కోరారు. అయితే రాజాసింగ్ విజ్ఞ‌ప్తిని ప్ర‌ష‌భుత్వం ప‌ట్టించుకోలేదు. దీంతో ఆయ‌న అదే కారులో ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వెళ్లి.. అక్క‌డ హ‌ల్ చ‌ల్ చేశారు. కారును అక్క‌డే వ‌దిలేసి వ‌చ్చారు. దీంతో పోలీసులు స‌ద‌రు కారును స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

ఇదిలావుంటే.. త‌దుప‌రి రోజు అసెంబ్లీకి రాజాసింగ్ నేరుగా బుల్లెట్ పై రావ‌డం.. త‌న‌కు కారు ఇవ్వ‌డంలో సీఎం కేసీఆర్ తాత్సారం చేస్తున్నార‌ని ఆరోపించ‌డం తెలిసిందే. తాజాగా ఆయ‌న త‌న‌కు ప్రాణ హాని ఉందంటూ.. వ్యాఖ్య‌లు చేశారు.

తనను చంపుతామంటూ బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని రాజాసింగ్‌ వెల్లడించారు. “నన్ను చంపుతామంటూ బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి. సోమ‌వారం మ‌ధ్యాహ్నం 3.34 గంటలకు బెదిరింపు కాల్‌ వచ్చింది. పాకిస్థానీ వాట్సాప్‌ కాల్‌ ద్వారా చంపుతామంటున్నారు. తమ స్లీపర్‌ సెల్స్‌ యాక్టివ్‌గా ఉన్నాయన్నారు. ప్రతిరోజు ఇలాంటి బెదిరింపు కాల్స్‌ వస్తూనే ఉన్నాయి” అని ట్వీట్‌ చేశారు. మ‌రి దీనిపై అటు కేంద్రం, ఇటు రాష్ట్ర పోలీసులు ఎలారియాక్ట్ అవుతారో చూడాలి.