ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిసెంబరు 5 ఉత్కంఠ రేపుతోంది. ఢిల్లీ వేదికగా ఏం జరగబోతోందన్న చర్చ మొదలైంది. ఎదురు పడే సీఎం జగన్, చంద్రబాబు మధ్య మాటల తూటాలు పేలతాయా అన్న ఆలోచన కొందరి మదిలో మెదులుతోంది. జీ – 20 సలహాల సమావేశంలో టీ-20 మ్యాచ్ జరుగుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.. జీ-20 దేశాల సదస్సుకు భారత ప్రభుత్వం అధ్యక్షత వహించబోతోంది. వచ్చే ఏడాది సెప్టెంబరులో న్యూఢిల్లీ వేదికగా 18వ …
Read More »నాయకులు లేరు.. నిధులు లేవు..
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో కేవీపీ రామచంద్రరావు హవా ఇంకా కొనసాగుతోంది వైఎస్ హయాంలో తెగ చక్రం తిప్పిన ఆయన, ప్రస్తుతం పార్టీ పతన దిశలో ఉన్నా కూడా తన పంతం నెగ్గించుకుంటున్నారు. తన వర్గానికి చెందిన గిడుగు రుద్రరాజుకు పీసీసీ అధ్యక్ష పదవి ఇప్పించుకున్నారు…. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లేదా పల్లంరాజుకు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని భావించిన నేపథ్యంలో అనూహ్యంగా గిడుగు రుద్రరాజుకు ఆ పదవి …
Read More »హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి బదిలీ.. ఎందుకు హాట్ టాపిక్?
ఏపీ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్‌ను మద్రాస్హైకోర్టు కు బదిలీ చేస్తూ.. సుప్రీంకోర్టు కొలీజియం తాజాగా సిఫారసు చేసింది. 2020, జనవరి 13న హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అనేక కీలక కేసుల్లో ఆయన సంచలన తీర్పులు ఇచ్చారు. దీంతో నిత్యం ఆయన విషయం పత్రికల్లోనూ రాజకీయంగా కూడా చర్చకు వచ్చేది. అయితే, తాజాగా ఈయనను మద్రాస్ హైకోర్టుకు బదిలీచేయాలని సుప్రీం కోర్టు కొలీజియం కేంద్ర …
Read More »అతి చేసిన అనిల్ అన్నకు కష్టకాలం
నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు జిల్లా పార్టీలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ ఎదురుగాలి వీస్తోంది. జిల్లాలో ఆయన వ్యతిరేకవర్గం బలపడుతున్న తరుణంలో ఇప్పడు ప్రాంతీయ సమన్వయకర్త బాధ్యతల నుంచి కూడా అనిల్ ను తప్పించారు. జిల్లాలో రోజురోజుకు అనిల్ యాదవ్ ఒంటరవుతున్న తరుణంలో పుండు మీద కారం చల్లినట్లుగా తిరుపతి జిల్లా ప్రాంతీయ సమన్వయ సమన్వయకర్త బాధ్యతలు చేజారాయి. పనిచేయని వారిని తీసేస్తానని సీఎం …
Read More »జగన్ విశ్వాసాన్ని కోల్పోతున్న నాయకులు… రీజనేంటి…?
ఏపీ సీఎం జగన్.. ఎవరినైనా ఒక్కసారి నమ్మితే.. వారిపై చాలా భరోసా పెట్టుకుంటారనే పేరుంది. వారికి కీలక బాధ్యతలు కూడా అప్పగిస్తారు. ఇలా.. అనేక మందిని ఆయన నమ్మిన బంట్లుగా పెట్టుకున్నారు. ఇది 2019 ఎన్నికల సమయంలో వైసీపీకి బాగా కలిసి వచ్చేలా చేసింది. అయితే, చిత్రంగా ఇప్పుడు మాత్రం ఈ పరిస్థితి లేకుండా పోయిందనే వాదన వినిపిస్తోంది. కారణాలు ఏవైనా.. కూడా నాయకులు విశ్వాసాన్ని కోల్పోతున్నారు. దీంతో నియోజకవర్గ …
Read More »వైసీపీ నాయకురాలి వలపు వల
ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన ఒక నాయకురాలి వలపు వల వ్యవహారం విజయవాడను షేక్ చేస్తోంది. సామాజిక మాధ్యమాల్లో పురుషులతో పరిచయం పెంచుకోవడం… యువతులతో ఫోన్లు చేయించి, వలపు వల విసిరి డబ్బు గుంజడం… ఇదీ ఈ నాయకురాలి నిర్వాకం. ఈ వ్యవహారంలో వైసీపీ మహిళా నేత, తూర్పు నియోజకవర్గ నేతకు చెల్లెలిగా చెప్పుకొనే పరసా నాగసాయితో పాటు మరో యువకుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. పటమటలోని తోట …
Read More »500 కిలోల గంజాయి.. ఎలుకలు తినేశాయి..
వినేవాడు ఉంటే.. చెప్పేవాడు.. అన్నట్టుగా ఉత్తరప్రదేశ్ పోలీసులు వ్యవహరిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజాగా మధుర జిల్లా పోలీసులు కోర్టుకు ఒక నివేదిక సమర్పించారు. దీనిలో చాలా ఆసక్తికర విషయాన్ని.. ఏమాత్రం తొట్రుపాటుకు గురికాకుండా వెల్లడించడం గమనార్హం. అదేంటంటే.. తాము స్వాధీనం చేసుకున్న 500 కిలోల గంజాయిని.. స్టేషన్లో ఎలుకలు తినేశాయని!! చిత్రంగా ఉన్నా ఇది నిజం. ఏం జరిగిందంటే.. మథుర పోలీసులు ప్రత్యేక నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ …
Read More »మార్చేశారు.. మొత్తం మార్చేశారు.. వైసీపీలో సంచలనం!
ఏపీ అధికార పార్టీ వైసీపీలో కీలక మార్పులు జరిగాయి. మార్పంటే మార్పే కాదు.. కీలక తలకాయలను సైతం పక్కన పెట్టేశారు. అత్యత ముఖ్యమైన ప్రాంతీయ సమన్వయకర్తల బాధ్యతల నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని వంటి ఫైర్ బ్రాండ్ నేతలకు కూడా చుక్కలు చూపించారు. మరో ఎనిమిది జిల్లాల పార్టీ అధ్యక్షులనూ మార్చేశారు. “మీరు చేయగలిగితే చేయండి.. లేదా కొత్తవాళ్లకు బాధ్యతలు అప్పగిస్తా”… …
Read More »వీఐపీ దర్శనం ఇవ్వనందుకు.. ఏపీలో కొత్త పార్టీ పెడతారట!
వినేందుకు ఒకింత ఆశ్చర్యంగానే అనిపించినా.. ఇది మాత్రం నిజం. తిరుమల శ్రీవారి దర్శనం కోసం.. కొన్ని లక్షల మంది నిత్యం తిరుపతికి వస్తుంటారు. వీరిలో పొరుగురాష్ట్రాలవారు.. ఇతర దేశాల వారు కూడా ఉంటారు. అదేసమయంలో దేశంలోని వివిధ మఠాలకు చెందిన స్వామీజీలు కూడా కూడా వస్తుంటారు. ఎవరి సౌలభ్యం కొద్దీ వారు శ్రీవారి దర్శనం చేసుకుని స్వామి ఆశీస్సులు పొంది నిష్క్రమిస్తుంటారు. అయితే, తాజాగా శ్రీవారి కరుణ కోసం వచ్చిన …
Read More »ఆయనకు త్వరలో మంత్రి పదవి ?
చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎట్టకేలకు గుర్తింపు లభించే టైమ్ వచ్చింది. కీలకమైన వైసీపీ అనుబంధ విభాగాల సమన్వయకర్త బాధ్యతలు ఆయనకు అప్పగించారు. పార్టీ రాష్ట్ర సమన్వయకర్త విజయసాయి రెడ్డికి ఆయన సహాయకుడిగా వ్యవహరిస్తారు. చెవిరెడ్డి హార్డ్ కోర్ జగన్ అభిమాని, జగన్ కోసం చెవి కోసుకుంటారు. గతంలో టీడీపీ ప్రభుత్వం చెవిరెడ్డిపై అనేక కేసులు పెట్టింది. నెలకోసారి అరెస్టు కూడా అయ్యేవారు. అంత జరిగినా చెవిరెడ్డి భయపడలేదు. …
Read More »నాకు-మానాన్నకు సంబంధం లేదు: వైసీపీ ఎమ్మెల్యే
ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు విషయంలో తన తండ్రి వసంత నాగేశ్వరరావు వైసీపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఖండించారు. తన తండ్రి వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని, ఆయన వ్యక్తిగత అభిప్రాయంతో తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. “నాకు-మానాన్నకు రాజకీయంగా సంబందం లేదు. ఆయన నోటికి తాళం వేయలేను” అని అన్నారు. అయితే, తన తండ్రిగా ఆయనను ఎప్పుడు గౌరవిస్తానన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలను …
Read More »ఎమ్మెల్యే ఎన్నికలు.. టీడీపీకి నకిలీ ఓటర్ల భయం..!
త్వరలోనే రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. సీమ ప్రాంతంలో ఉపాధ్యాయ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎన్నికలకు కూడా రంగం సిద్ధమైంది. ఈ ఎన్నికలను అటు అధికార పార్టీ వైసీపీ, ఇటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తమ పాలనకు ఇది గీటు రాయి అని భావిస్తున్న వైసీపీ నాయకులు.. ఈ ఎన్నికల్లో తమ మద్దతు దారులను గెలిపించాలని చూస్తోంది. ఇక, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అయితే.. వైసీపీపై పట్టు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates