జ‌గ‌న్ చేతిలో ఆ రెండు జిల్లాల రిపోర్ట్‌.. చాలా హాట్ గురూ!!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు నిలుస్తారు? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా వైనాట్ 175 నినాదంతో ముందుకు సాగాల‌ని నిర్న‌యించుకున్న వైసీపీ అధినేత పార్టీ ఎమ్మెల్యేల తీరును చాలా నిశితంగా గ‌మ‌నిస్తున్నారు. ఎక్క‌డిక‌క్క‌డ ఆయ‌న దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. స‌ర్వేలు.. రిపోర్టులతో నిత్యం ఎమ్మెల్యేల‌ను ప‌రుగులు పెట్టిస్తున్నారు. అయితే.. ఇంత చేస్తున్నా.. పాజిటివ్ ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

ఇదే విష‌యం వైసీపీలో చ‌ర్చ‌కు వ‌స్తోంది. తాజాగా రెండు జిల్లాల్లో ఎమ్మెల్యేపై వ్య‌తిరేక రిపోర్టు వ‌చ్చిన‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో క్లీన్ స్వీప్ చేసిన క‌ర్నూలు, మెజారిటీ సీట్లు ద‌క్కించుకున్న‌ అనంతపురం జిల్లాల్లో ఈ సారి వైసీపీ బొక్క బోర్లా ప‌డ‌డం ఖాయ‌మ‌ని స‌ద‌రు నివేదిక‌లో ఉన్న‌ట్టు వైసీపీ నేత‌లే గుస‌గుస‌లాడుతున్నారు. ఈ రెండు జిల్లాల్లో ఈ సారి వైసీపీ అంత ఈజీకాద‌ని కూడా తేలిపోయింద‌ని అంటున్నారు.

అనంత‌పురం జిల్లాలో అయితే.. వైసీపీ వ్య‌తిరేక‌త చాప‌కింద నీరుగా ఉంద‌ని పార్టీ నేత‌లు బ‌హిరంగంగానే చెబుతున్నారు. మంత్రులు.. తీవ్ర అవినీతి ఊబిలో చిక్కుకున్నార‌ని అంటున్నారు. ఇది కూడా నిజ‌మేన‌ని అనిపిస్తోంది. మంత్రి.. ఉష శ్రీచ‌ర‌ణ్‌పై భూముల ఆక్ర‌మ‌ణ బాగోతం కొన్నాళ్లు ఊపేసింది. దీనిపై ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోలేదు. ఇక‌, క‌ర్నూలులో మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం..వ్య‌వ‌హారం కూడా ప్ర‌జ‌ల్లో తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ‌కు వ‌స్తోంది.

దీనికితోడు ఉమ్మ‌డి అనంత‌లో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్ న్యూడ్ వీడియో వ్య‌వ‌హారం ఇప్ప‌టికీ చ‌ల్లార‌లేదు. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో ఆయ‌న‌ను వైసీపీ నాయ‌కులే.. న్యూడ్ ఎంపీ అని పిలుచుకునే ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. ఇక‌, ఇదే జిల్లాలో అంత‌ర్గ‌త క‌ల‌హాలు.. పోలీసుల‌ను అడ్డుపెట్టుకుని సొంత పార్టీనేత‌ల‌పైనే కేసులు పెడుతున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దీంతో ఈ రెండు జిల్లాల్లో గ‌త ఎన్నిక‌ల్లో వ‌చ్చిన రిజ‌ల్ట్ ఈ ఏడాది వ‌చ్చే అవ‌కాశం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.