వైసీపీ మంత్రి, ఉన్నత విద్యావంతుడు.. డాక్టర్ సీదిరి అప్పలరాజు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజక వర్గం నుంచి గత ఎన్నికల్లో తొలిసారి విజయం దక్కించుకున్నారు. వాస్తవానికి తొలిసారి విజయం దక్కిం చుకున్న నాయకులకు ప్రజల్లో ఆదరణ పెరగాలి. గతంలో ఇలానే జరిగేది. తొలిసారి విజయం దక్కించు కున్న వారికి ప్రజల్లో మంచి గుర్తింపు లభించేది. అయితే.. దీనికి భిన్నంగా సీదిరి వ్యవహారం ఉండడం ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. ప్రస్తుతం ఆయన మంత్రిగా ఉన్నారు. అంతేకాదు.. తరచుగా ప్రతిపక్షాలపై విమర్శలు కూడా చేస్తున్నారు.
అయితే, వాస్తవానికి ఉన్నత విద్య చదువుతున్న సీదిరి ఉన్నతంగా రాజకీయాలు చేస్తారని..ఇక్కడి ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. అయితే.. దీనికి భిన్నంగా ఆయన రాజకీయాలు చేస్తున్నారు. ఒక సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలతో ఆ వర్గం వైసీపీకి దూరమైంది. అదేసమయంలో మహిళ అని కూడా చూడకుండా.. టీడీపీ నాయకురాలు గౌతు శిరీష్ పై ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పటికీ ప్రజల మధ్యచర్చకు వస్తూనే ఉన్నాయి. దీంతో వ్యక్తిగతంగా సీదిరి చాలానే నష్టపోతున్నారని అంటున్నారు.
తాజాగా పలాస నియోజకవర్గంలో చేయించిన సర్వేలో సీదిరి విషయంలో ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారనే విషయం స్పష్టంగా తెలిసిపోయింది. కనీసం.. ఆయనను పట్టించుకునేందుకు కూడా ప్రజలు సిద్ధంగా లేరు. గత ఎన్నికల్లో ఆయనకు 45 శాతం ఓటు బ్యాంకు వస్తే.. ఇప్పుడు అది 28 శాతానికి పడిపోయింది. అదేసమయంలో టీడీపీ ఒంటరిగా పోటీ చేసినా.. 38 శాతం నుంచి 44 శాతం వరకు వచ్చే అవకాశం ఉందని తేలిపోయింది.
ఈ పరిణామంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైసీపీ ఓడిపోయే తొలి సీటు ఇదేనా? అనే చర్చ సొంత పార్టీలోనే జరుగుతుండడం ఆసక్తిగా మారింది. పైగా.. వైసీపీ నేతల్లోనూ సీదిరి అంటే దూరం పెడుతున్న పరిస్థితి వచ్చింది. ఇటీవల కొన్నాళ్ల కిందట.. సీదిరి వ్యతిరేకంగా.. వన భోజనాలు పెట్టిన ఒక వర్గం.. ఆయనకు టికెట్ ఇవ్వొద్దని.. తీర్మానం చేస్తూ..పార్టీ అధిష్టానానికి లేఖ పంపింది. అయితే..దీనిని అధిష్టానం లైట్ తీసుకుంది. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం ఆ వ్యతిరేకత అలానే కంటిన్యూఅవుతోంది. దీంతో వైసీపీ కి ఇబ్బంది తప్పదని అంటున్నారు పరిశీలకులు.