భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ గబ్బా వేదికగా మూడో టెస్టు మ్యాచ్‌లో తలపడుతోన్న విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవడం కష్టమే అనిపిస్తోంది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ లను అడ్డుకోవడంలో భారత బాలర్లు చెమటోడ్చారు. భారత బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా తప్పితే మిగతా వారు అంతగా ప్రభావం చూపలేదు. బుమ్రా ఆరు వికెట్లు తీసి ఆసీస్ బ్యాటింగ్‌ను కొంతవరకు కట్టడి చేశాడు. మహ్మద్ సిరాజ్ …
Read More »పేదరికం అంటారు.. పనిచేయకపోతే ఎలా: నారాయణమూర్తి చురకలు
ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థ.. ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి.. చురకలు అంటించారు. ఆయన గత కొన్నాళ్లుగా పనిగంటల విషయంలో ఓ సూత్రం చెబుతున్నారు. వారానికి 70 గంటలు పనిచేయాలని ఆయన సూత్రీకరిస్తున్నారు. వాస్తవానికి ప్రపంచ దేశాలు సహా భారత దేశ లెక్కల ప్రకారం.. వారానికి 48 గంటలు మాత్రమే పనిచేయాలి. రోజుకు 8 గంటల చొప్పున వారానికి ఆరు రోజులు లెక్క వేస్తారు. దీని ప్రకారం.. 48 గంటలు పనిచేస్తే.. …
Read More »త..’భళా’.. మూగబోయింది.. ఉస్తాద్ ఇకలేరు!
అది 1960 ప్రాంతం.. ఓరోజు సాయంత్రం.. “అందరూ తబలా వాయిస్తారు. నువ్వేంటి ప్రత్యేకం”- ఇదీ.. 15 ఏళ్ల వయసులో తన తండ్రి నుంచి వచ్చిన సూటి ప్రశ్న. దీనికి కారణం.. చదువును అశ్రద్ధ చేస్తున్నారని.. తబలాకే సమయం కేటాయిస్తున్నారన్నది ఓ తండ్రిగా ఆయన ఆవేదన. ఇదే.. ఆ యువకుడిలో కసి రేపింది. తబలా వాయిద్యాన్ని త..’భళా’ అని పించేస్థాయిలో ప్రపంచ ప్రసిద్ధం చేశారు. నిజానికి అప్పటికి జంతు చర్మలాలతో చేసిన …
Read More »చంద్రబాబు, పవన్ లను పెళ్లికి ఆహ్వానించిన పీవీ సింధు!
దక్షిణ కొరియా అధ్యక్షుడిని దింపేశారు.. దేశంలో సంబరాలు!
దేశంలో ప్రతిపక్షాలపై కత్తికట్టినట్టు వ్యవహరించి.. మార్షల్ లా(సైనిక పాలన)ను తీసుకువచ్చిన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్.. అభిశంసనకు గురయ్యారు. ఆయనను ఆ పదవి నుంచి దింపేస్తూ.. పార్లమెంటు చేసిన తీర్మానానికి ఏకంగా 204 మంది సభ్యులు మద్దతు తెలిపారు. మొత్తం పార్లమెంటులో 300 మంది సభ్యులు ఉండగా.. 204 మంది మద్దతు తెలపడంతో ఆయన పదవీచ్యుతలయ్యారు. అయితే.. ఆయన ఇప్పటికిప్పుడు ఆ పదవి పోయే ప్రమాదం లేక …
Read More »మనోవర్తి ఎలా డిసైడ్ చేయాలో తేల్చిన సుప్రీం
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. విడాకుల వేళ.. భార్యకు భర్త చెల్లించాల్సిన శాశ్విత మనోవర్తిని డిసైడ్ చేసేందుకు కీలక తీర్పును వెలువరించటమే కాదు.. మనోవర్తిని డిసైడ్ చేసేందుకు 8 మార్గదర్శకాల్ని జారీ చేసింది. వీటిని అనుసరించి మనోవర్తి ఎంత ఇవ్వాలన్నది డిసైడ్ చేయాలని పేర్కొంది. భర్త చెల్లించాల్సిన మనోవర్తిని అతడిని శిక్షించే విధంగా ఉండకూదని పేర్కొంది. అదే సమయంలో అతడి జీవిత భాగస్వామిగా వ్యవహరించిన మహిళ …
Read More »చెస్ చరిత్రలో మనోడి వరల్డ్ రికార్డ్!
భారత చెస్ ప్లేయర్ డి గుకేశ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించాడు. చెస్ ప్రపంచంలో అత్యున్నత స్థాయి విజయంగా గుర్తించబడే ప్రపంచ ఛాంపియన్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఫైనల్లో చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించి, 14వ గేమ్‌లో కీలక విజయాన్ని సాధించడం గుకేశ్ కు ఇది అత్యంత ప్రత్యేకమైన ఘట్టంగా మారింది. ఎందుకంటే క్రీడా చరిత్రలో అత్యంత చిన్న వయసులోనే ప్రపంచ ఛాంపియన్‌గా అతను ఒక సరికొత్త రికార్డు క్రియేట్ …
Read More »ఎవడైనా కానీ కూతురి జోలికొస్తే తగ్గేదే లే!!
రివెంజ్ డ్రామా కేవలం సినిమాలకే పరిమితమనుకుంటాం కానీ నిజ జీవితంలోనూ జరుగుతూ ఉంటాయి. దానికి ఈ సంఘటనే ప్రత్యక్ష సాక్ష్యం. కువైట్ నుంచి వచ్చిన ఆంజనేయ ప్రసాద్ అనే ఎన్ఆర్ఐ ఇండియాలో చదువుకుంటున్న తన కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని హత్య చేసి తిరిగి విదేశానికి వెళ్లిపోవడమే కాక నేరాన్ని ఒప్పుకుంటూ వీడియో రిలీజ్ చేయడం సంచలనం రేపుతోంది. చనిపోయిన నిందితుడి పేరు ఆంజనేయులు. వయసు 59 సంవత్సరాలు. …
Read More »ఛాంపియన్స్ ట్రోఫీలో మరో ట్విస్ట్.. వన్డే నుంచి టీ20కి?
వచ్చే ఏడాది పాకిస్తాన్ ఆతిథ్యంలో జరగాల్సిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) ఇప్పటికే తమ జట్టును పాకిస్తాన్‌కు పంపించబోమని స్పష్టమైన ప్రకటన చేసింది. ఈ పరిస్థితుల్లో టోర్నమెంట్ నిర్వహణపై ఐసీసీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో చర్చలు కొనసాగిస్తున్నాయి. కానీ పాకిస్థాన్ తన వైఖరిని పూర్తి స్థాయిలో వెల్లడించకపోవడంతో సమస్యలు సద్దుమణగడంలేదు. ఐసీసీ హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదనను పీసీబీకి సమర్పించినప్పటికీ, దీనిపై …
Read More »మ్యూజికల్ కాన్సర్ట్స్ తోనే 17 వేల కోట్లు కలెక్షన్స్!
వరల్డ్ వైడ్ గా ప్రస్తుతం ఊహించని రేంజ్ లో క్రేజ్ అందుకుంటున్న ప్రసిద్ధ గాయని టేలర్ స్విఫ్ట్ ఇటీవల సంచలన రికార్డును సొంతం చేసుకుంది. లైవ్ కాన్సర్ట్ లకు ఆదరణ కరువైందని వస్తున్న కామెంట్స్ కు ఇది పవర్ఫుల్ ఆన్సర్ అని చెప్పవచ్చు. తన ‘ఎరాస్ టూర్’ ద్వారా ఆమె ప్రపంచ సంగీత రంగాన్ని కుదిపేసింది. ఈ టూర్ ద్వారా టేలర్ స్విఫ్ట్ $2,077,618,725 (సుమారు ₹17,000 కోట్ల) టికెట్ …
Read More »ఎలాన్ మస్క్ గ్లోబల్ రికార్డ్.. సంపదలో మరో సంచలనం!
ప్రపంచంలో అత్యంత ధనవంతులలో ఒకరైన ఎలాన్ మస్క్ తన సంపాదనతో మరో చరిత్ర సృష్టించారు. స్పేస్ఎక్స్లో భాగస్వామ్య విక్రయం ద్వారా ఆయన సంపద 439.2 బిలియన్ డాలర్లకు చేరిందని బ్లూమ్‌బర్గ్ నివేదిక తెలిపింది. ఇది ప్రపంచంలోనే ఏ వ్యక్తీ సాధించని అత్యంత వ్యక్తిగత సంపద. మస్క్‌కు చెందిన టెస్లా మరియు స్పేస్ఎక్స్ కంపెనీలు ఆయన సంపాదనలో కీలక పాత్ర పోషించాయి. మస్క్ సంపదలో పెరుగుదల ప్రధానంగా టెస్లా స్టాక్స్ భారీగా …
Read More »ఉద్యోగులకు శుభవార్త.. ATM ద్వారా పీఎఫ్
పీఎఫ్ చందాదారుల కోసం కేంద్ర ప్రభుత్వం వినూత్న సేవలను అందుబాటులోకి తేనుంది. కార్మికశాఖ తాజా ప్రకటన ప్రకారం, భవిష్యనిధి చందాదారులు త్వరలోనే ఏటీఎంల ద్వారా తమ పీఎఫ్ సొమ్మును సులభంగా విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు పొందనున్నారు. జనవరి 2025 నాటికి ఈ సేవలను అందుబాటులోకి తెచ్చేలా ఐటీ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నట్లు కార్మికశాఖ కార్యదర్శి సుమిత దావ్రా వెల్లడించారు. ప్రస్తుతం పీఎఫ్ క్లెయిమ్‌ల కోసం దరఖాస్తు ప్రక్రియ కొంత సమయం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates