డబ్బులు అవసరం అయ్యాయని అడ్డగోలుగా అప్పులు చేయటం ఎంత తప్పో.. అవసరమని లోన్ యాప్ ల ద్వారా రుణం తీసుకోవటం అంతకు మించిన పెద్ద తప్పు అవుతుంది. ఆర్థికంగా నష్టపోవటమే కాదు.. అంతకు మించిన తలనొప్పుల్ని తెచ్చి పెట్టుకున్నట్లే. మనం అప్ లోడ్ చేసే నాలుగు డాక్యుమెంట్లు పెట్టుకొని డబ్బులు ఇస్తున్నాడు కదా.. ఏమైనా జరిగితే తర్వాత చూసుకుందామని అనుకోవచ్చు. కానీ.. దానికి మించిన తిప్పలు చాలానే వెంటాడి వేధించే …
Read More »పెళైన ఏడాదికే విడిపోతున్నారు
నా ప్రేమ నవపారిజాతం.. అని ఎంతో తీయగా కమ్మని పాట మొదలు పెట్టిన జంటలు.. పాట పూర్తయ్యే లోపే.. వాడిపోతున్నాయి! ప్రేమకోసం ప్రాణమైనా ఇస్తా అనే మాటలు.. కొన్నాళ్లకే పరిమితం అయిపోతు న్నాయి!! మరికొన్నాళ్లకే ప్రేమలేదని.. ప్రేమించరాదనే విషాద గీతాలే ఈ జంటల జీవితాను ప్రభావితం చేస్తున్నాయి!! మరి దీనికి కారణం.. ఏంటి? ఎందుకు? అంటే.. దాగుడు మూతలేనని తేల్చి చెబుతున్నా రు పరిశోధకులు. నాకు నువ్వు-నీకు నేను.. అని …
Read More »పాకిస్థాన్ పురుషులు ఉమనైజర్లు.. బ్రిటన్ హోం మంత్రి
పాకిస్థాన్ పౌరులపై బ్రిటన్ హోం శాఖ మంత్రి సుయెల్లా బ్రావర్మన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్‌లో స్థిరపడిన పాకిస్థాన్ పురుషులు మామూలోళ్లు కారరంటూ.. ఆమె సంచలన ఆరోపణలు చేశారు. బ్రిటన్ మహిళలపై పాకిస్థానం సంతతి పురుషులు.. వేధింపులకు పాల్పడుతున్నారని.. అత్యాచారాలకు సైతం ఒడిగడుతున్నారని ఆమె తెలిపారు. అంతేకాదు.. బ్రిటన్ లో మాదక ద్రవ్యాల వినియోగంలోనూ పాకిస్థాన్ సంతతి పురుషులే ఎక్కువగా ఉంటున్నట్టు బ్రావర్మన్ పేర్కొన్నారు. పాక్ సంతతి పురుషులు దేశంలో …
Read More »ఆర్సీబీ అసలు ఆట.. మీమ్స్ మోత
స్టార్ ఆటగాళ్లకు కొదవ ఉండదు. కాగితం మీద చూస్తే జట్టు చాలా బలంగా కనిపిస్తుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేమీ కాదు. ఆ జట్టు ఆడుతుంటే స్టేడియాలు ఊగిపోతాయి. టీవీల ముందు కోట్ల మంది మద్దతుగా నిలుస్తారు. కానీ అంచనాలను అందుకోవడంలో ప్రతిసారీ చతికిలపడుతూ.. ఐపీఎల్ టైటిల్‌కు దూరం అవుతుంటుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఒకప్పుడు టైటిల్ కోసం గట్టిగా పోటీ అయినా పడేది. కొన్నేళ్ల నుంచి ప్లేఆఫ్స్ చేరడం కూడా …
Read More »92 ఏళ్ల వరుడు.. 66 ఏళ్ల వధువు.. ఆగిన పెళ్లి..
పెళ్లి చేసుకోవడానికి ఏం కావాల్నో.. అంటే.. వయసు-మనసు రెండూ కావాలి అత్తగారు.. అంటాడు కన్యాశు ల్కం నాటకంలో గిరీశం. అయితే.. ఇది ఎవరికో చెప్పలేదు కాబట్టి.. మనకేనని.. మన భారతీయులకేనని సరిపెట్టుకోవాలి. కానీ, పాశ్చాత్యులకు ఈ నియమం లేదు. అందుకే కాటికి కాళ్లు చాపుకొన్న వయసులో 92 ఏళ్ల వృద్ధుడిగా ఉన్నప్పటికీ.. రూపర్ట్ మర్దోక్ పెళ్లికి రెడీ అయ్యారు. తన ప్రియురాలు.. (ఆమేమీ తక్కువకా దు.. ఆమెకు కూడా 66 …
Read More »లవర్‌ను కెనడా నుంచి పిలిచి చంపేశాడు..
ప్రేమల పేరుతో జరుగుతున్న దారుణాలు ఎక్కడా ఆగడం లేదు. దేశంలో ఢిల్లీలో చోటు చేసుకున్న 36 ముక్కల ఉదంతం మరిచిపోక ముందే.. మరో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలిని కెనడా నుంచి పిలిచి మరీ హత్య చేశాడో వ్యక్తి. అనంతరం ప్రియురాలి మృతదేహాన్ని తన ఫామ్‌హౌస్‌లో పాతిపెట్టాడు. దాదాపు ఏడాది తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు మోనిక(23) రోహ్తక్ ప్రాంతంలోని బాలంద్ గ్రామానికి చెందిన యువతి. ఐఇఎల్టీఎస్ …
Read More »క్రికెట్ దిగ్గజం.. నాయక్ కన్నుమూత
భారత క్రికెట్ జట్టులో పడిలేచిన కిరణం.. టీమ్ఇండియా మాజీ ఓపెనర్ సుధీర్ నాయక్. ఏమీ లేని స్థాయి నుంచి క్రికెట్ బ్యాట్ కూడా కొనలేని పరిస్థితి నుంచి టీమ్ ఇండి ఓపెనర్‌గా ఎదిగిన నాయక్.. భారత క్రికెట్ కీర్తి కిరీటంలో ఒక కలికితురాయి. అయితే.. ఆయనకు రావాల్సిన గుర్తింపు.. దక్కాల్సిన మర్యాదులు దక్కలేదు. దీనికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. అయితే.. 78 ఏళ్ల వయసులో నాయక్ తుదిశ్వాస విడిచారు. …
Read More »మూవీ రివ్యూ కుంభకోణం.. 76 లక్షలు నష్టపోయిన మహిళ..
దేశంలో కుంభకోణాలకు అదీ.. ఇదీ.. అనే తేడా లేకుండా పోయింది. ఒకప్పుడు 2జీ, బొగ్గు గనులు, మైనింగ్ వంటి వ్యవహారాల్లోనే స్కాములు బయటపడేవి. ఇప్పుడు మద్యం స్కామ్ అంటూ.. దేశాన్ని కుదిపేస్తోంది. అయితే.. తాజాగా ఢిల్లీలో మూవీ రివ్యూ(సినిమా సమీక్ష) కుంభ కోణం వెలుగు చూసింది. దీనిలో ఓ మహిళ ఏకంగా 76 లక్షల రూపాయలను నష్టపోయింది. మరి ఇది ఎలా జరిగింది? విషయం ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. …
Read More »44 కోట్ల లాటరీ.. ప్రాంక్ కాల్ అనుకుని ఫోన్ కట్ చేశాడు..
సిరితా వచ్చిన వచ్చును… అని మన తెలుగు పద్యం చెప్పినట్టుగానే.. ఒక వ్యక్తికి.. ఏకంగా 44 కోట్ల రూపాయల లాటరీ దక్కింది. అయితే.. ఇది వస్తుందని కానీ, తాను రాత్రికి రాత్రి కోటీశ్వరుడిని అవుతానని కానీ, సదరు వ్యక్తి భావించలేదు. దీంతో ఆ.. ఏముంది.. ఇదంతా ప్రాంక్ అనుకున్నాడు. కానీ, వచ్చింది సాక్షాత్తూ సిరి మహాలక్ష్మి!! అదృష్టం బాగుంది కాబట్టి.. సదరు వ్యక్తిని వరించింది. లేకుంటే.. కొంచెంలో తప్పిపోయేది. మరి …
Read More »ఈసారి ఐపీఎల్ సన్‌రైజర్స్‌దేనా?
ఐపీఎల్ సందడి మొదలైపోయింది. ఎప్పటిలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులు ఈసారి తమ అభిమాన టీం కప్పు కొట్టాలని ఆకాంక్షిస్తున్నారు. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు ఓటమి పాలైనప్పటికీ అభిమానులు కొత్త సెంటిమెంట్లను బయటకు తీయడంతో పాటు గత ఐపీఎల్లలోని ప్యాటర్న్ ఒకటి చూపిస్తూ ఈసారి విజయం మాదే అంటున్నారు. 2014 ఐపీఎల్లో సన్‌రైజర్స్ జట్టు ఆరోస్థానంలో నిలిచింది. ఆ తరువాత ఏడాది కూడా ఆరో స్థానంతోనే సరిపెట్టుకుంది. కానీ.. …
Read More »డ్రీమ్11 ఫౌండర్ సక్సెస్ స్టోరీ.. పోరాట సింహం!
డ్రీమ్ ఎలెవెన్.. ఈ రోజుల్లో ఈ పేరు తెలియని యూత్ ఉండరు. ఆ మాటకు వస్తే పెద్ద వాళ్లకు కూడా దీంతో బాగానే పరిచయం. క్రికెట్ సహా అనేక ఆటల్లో ఫాంటసీ లీగ్ ఆడేందుకు ఈ యాప్ ఒక వేదిక. ఇప్పుడు ఈ తరహాలో పదుల సంఖ్యలో యాప్స్ వచ్చాయి కానీ.. ముందు ఈ ఫాంటసీ లీగ్ పాపులర్ అయింది, ఎక్కువ ఆదరణ సంపాదించుకున్నది డ్రీమ్ ఎలెవెన్ ద్వారానే. ఇప్పుడు …
Read More »చరిత్ర సృష్టించిన ట్రంప్
అమెరికా చరిత్రలోనే ఒక మాజీ అధ్యక్షుడు జైలుకు వెళ్లడం ఇదే మొదటిసారి. శృంగార తారకు డబ్బులిచ్చి నోరు మూయించిన కేసులో డోనాల్డ్ జే ట్రంప్ పై మాన్ హట్టన్ కోర్టు విచారణ మొదలు పెట్టింది. అమెరికా చరిత్రలోనే అధ్యక్షులుగా పని చేసిన వారెవరు అరెస్టులు కాలేదు జైలుకీ వెళ్ళలేదు. ఈ రెండు ట్రంప్ విషయంలో జరిగిపోయింది. ట్రంప్ పై మోపిన అభియోగాలు దాదాపు నిజాలే అని నిరూపితమవ్వటం పెద్ద కష్టం …
Read More »