రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కొత్త సీజన్ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. యువ ఆటగాడు రజత్ పటీదార్‌ను జట్టు కొత్త కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఫాఫ్ డుప్లెసిస్‌ను వేలంలో వదిలిన తర్వాత విరాట్ కోహ్లీ తిరిగి కెప్టెన్సీ తీసుకుంటారనుకుంటే, ఆ అంచనాలను చెరిపేస్తూ పటీదార్‌కు ఆర్‌సీబీ పగ్గాలు అప్పగించింది.
కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ రేసులో ఉన్నప్పటికీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పటీదార్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు.
రజత్ పటీదార్ గురించి చెప్పాలంటే, అతను మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించాడు. 2022 ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి లువ్నిత్ సిసోడియా గాయం కారణంగా రిప్లేస్‌మెంట్‌గా చేరాడు. అప్పుడు కేవలం రూ. 20 లక్షలతో తీసుకున్న అతను, అద్భుతమైన ప్రదర్శనతో అభిమానుల మనసు గెలుచుకున్నాడు.
రజత్ 2021 ఐపీఎల్‌లోనూ ఆర్‌సీబీ తరపున ఆడాడు. ఆ సీజన్‌లో 4 మ్యాచ్‌లలో 71 పరుగులు చేశాడు. అతని సుదీర్ఘ డొమెస్టిక్ అనుభవం ఆర్‌సీబీ మిడిల్ ఆర్డర్‌కు బలాన్ని చేకూరుస్తుంది.
మొత్తం 27 IPL టీ20 మ్యాచ్‌లలో 799 పరుగులు చేశాడు. ఇందులో 7 అర్ధశతకాలు, ఒక సెంచరీ ఉన్నాయి. అతని అత్యధిక వ్యక్తిగత స్కోర్ 112 పరుగులు. ఆర్‌సీబీ ఇప్పటి వరకు ఐపీఎల్ ట్రోఫీ గెలవకపోయినా, ఈసారి కొత్త కెప్టెన్‌తో ట్రోఫీపై కన్నేసింది. రజత్ నాయకత్వంలో జట్టు ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో వేచి చూడాలి.
పటీదార్ యువ కాప్టెన్ అయినప్పటికీ, అతని ఆటతీరు, మిడిల్ ఆర్డర్‌లో స్థిరత్వం జట్టుకు మేలని అభిమానులు భావిస్తున్నారు. రానున్న 2025 ఐపీఎల్ సీజన్‌లో ఆర్‌సీబీ, పటీదార్ నాయకత్వంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
మొత్తానికి ఈ కొత్త నిర్ణయం అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీసింది. అసలు ఊహించనట్టుగా రజత్ పటీదార్ కెప్టెన్ అవడం నిజంగా సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇప్పుడు ఆర్‌సీబీ చరిత్రను మార్చగలడా? అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది.