బార్క్ రేటింగ్స్ విషయంలో ఎన్నో వివాదాలు, కేసుల తర్వాత తిరిగి బార్క్ రేటింగ్స్ విడుదల చేస్తున్న నేపథ్యంలో న్యూస్ ఛానెళ్ల రేటింగ్స్ పరిస్థితి ఆసక్తిగా మారుతుంది. పద్నాలుగు వారాలుగాఎన్టీవీ టాప్ లో నిలబడింది. అంతేకాదు రేటింగ్స్ ప్రకారం చూసుకున్నా కూడా ఎన్టీవీ కి దరిదాపుల్లో కూడా మరో ఛానెల్ లేదు. దీనికి కారణం ఆ ఛానెల్ ప్రసారం చేసే కార్యక్రమాలనే చెప్పాలి. ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ లు, పొలిటికల్ ఎనాలిసిస్‌లు, …
Read More »ఉక్రెయిన్ యుద్ధం… కొత్త మలుపు తీసుకోనుందా?
రష్యాతో యుద్ధం కారణంగా పూర్తిగా నేలమట్టమైపోతున్న ఉక్రెయిన్లో దేశాధ్యక్షులు పర్యటించారు. తాజాగా నాటోలో సభ్యత్వం ఉన్న నాలుగు దేశాల అధినేతలు ఉక్రెయిన్లో పర్యటించారు. ఈ మధ్యనే బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ హఠాత్తుగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో ప్రత్యక్షమై యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. బోరిస్ చూపిన మార్గంలోనే పోలండ్, లిథువేనియా, లాత్వియా, ఎస్తోనియా దేశాల అధ్యక్షులు పర్యటించారు. రష్యా దెబ్బకు ఉక్రెయిన్ శిధిలమై పోతే …
Read More »డిజిటల్ రంగంలోకి టాటా న్యూ
ప్రఖ్యాత టాటీ గ్రూప్ డిజిటల్ రంగంలోకి అడుగులు వేసింది. కొత్తగా `టాటా న్యూ` పేరుతో ఒకసూపర్ యాప్‌ను తీసుకువచ్చింది. ఇప్పటి వరకు ఉన్న ఫోన్ పే, గూగుల్‌లకు మించి.. ఇది సేవలను అందించేందుకు సిద్ధమైంది. వాస్తవానికి టాటా గ్రూప్ దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం. టాటా కంపెనీలు ఉప్పు నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు చాలా రకాల ఉత్పత్తుల విక్రయంతోపాటు సాఫ్ట్‌వేర్ నుంచి విమానయానం వరకు పలు రకాల సేవలంది స్తున్నాయి. …
Read More »తాగేసి.. చాహల్ ప్రాణాలతో చెలగాటం
కోట్లాది మందిని తమ ఆటతో ఆకట్టుకునే క్రికెటర్లు.. ఎంతో బాధ్యతగా ఉంటామని అనుకుంటాం. కానీ.. కొందరి పిచ్చి వేషాల గురించి తెలిస్తే.. మరీ ఇంత దారుణంగా.. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తారా? అన్న సందేహం కలుగక మానదు. తాజాగా అలాంటి విషయమే ఒకటి బయటకు వచ్చింది. గతంలో బెంగళూరు తరఫు ఆడి.. ఈ మధ్య జరిగిన వేలంలో రాజస్థాన్ జట్టు సొంతం చేసుకున్న లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ గతంలో తనకు ఎదురైన …
Read More »బంజారాహిల్స్ డ్రగ్స్ కేసు.. రిమాండ్ రిపోర్టు ఇదే!
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం రేపిన బంజారాహిల్స్ పుడింగ్ పబ్ డ్రగ్స్ కేసులో రిమాండ్ రిపోర్టు బయటకు వచ్చింది. పబ్‌లో మద్యం, డ్రగ్స్ విక్రయాలపై సమాచారం వచ్చిందని రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు వెల్లడించారు. ఈ నెల 3న పబ్‌పై టాస్క్‌ఫోర్స్ దాడి చేసినట్లు తెలిపారు. రాడిసన్ బ్లూప్లాజాలోని పుడింగ్ పబ్‌లో పోలీసుల తనిఖీలు చేసినట్లు చెప్పారు. ల్యాప్‌టాప్, ప్రింటర్, ప్యాకింగ్ మెటీరియల్ గుర్తించినట్లు పేర్కొన్నారు. సులభంగా డబ్బు సంపాదనకు …
Read More »అంబానీ.. అదానీల మధ్య దూరం రూ.5లక్షల కోట్లే!
ఫోర్బ్స్ జాబితా విడుదలైంది. ప్రపంచంలో టాప్ టెన్ సంపన్నుల జాబితాలో పదో స్థానంలో నిలిచిన రిలయన్స్ సంస్థల అధినేత ముకేశ్ అంబానీ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో కేవలం ఏడు శాతం వ్రద్ధి రేటును సాధించినా ఆయన ఆసియా కుబేరుడిగా కొనసాగుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పదో స్థానంలో నిలిచిన ఆయన సంపద 90.7 బిలియన్ డాలర్లుగా లెక్క కట్టారు. మన రూపాయిల్లో 6.8 లక్షల కోట్లుగా చెప్పాలి. …
Read More »రాడిసన్ రేవ్ పార్టీ.. ఆ ప్రముఖుల డ్రగ్ షాక్!
రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ లోని ‘పుడింగ్ అండ్ మింక్ పబ్’ లో జరిగిన రేవ్ పార్టీ ఇప్పుడు సరికొత్త ప్రకంపనలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల వేళలో 157 మందిని టాస్కు ఫోర్సు పోలీసులు అదుపులోకి తీసుకోవటం.. వారిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకురావటం తెలిసిందే. వీరిలో 99 మంది యువకులు.. 39 మంది యువతులు. 19 మంది పబ్ సిబ్బంది …
Read More »ఏపీలో విద్యుత్ చార్జీల బాదుడు
ఏపీలో విద్యుత్ చార్జీలు పెరిగాయి. సంపన్న వర్గాలకు ఇస్తున్న విద్యుత్ యూనిట్ కు 55 పైసలు పెరగ్గా.. పేద, మధ్యతరగతి వర్గాలపై మాత్రం భారీ ఎత్తున బాదేశారు. అయితే.. పెంచిన విద్యుత్ ఛార్జీలు ఆగస్టు నుంచి అమలులోకి రానున్నాయి. సున్నా నుండి 30 యూనిట్ల వరకు గత ధర రూ.1.45 పైసలు ఉండగా.. మండలి ఆమోదించిన ధర రూ.1.90పైసలుగా ఉంది. దీంతో పెంపు 45 పైసలైంది. 31 నుంచి …
Read More »మరో భారతీయుడికి పట్టం కట్టిన అమెరికా దిగ్గజ కంపెనీ
మైక్రోసాఫ్ట్.. గూగుల్.. మాత్రమే కాదు ఏకంగా 13 దిగ్గజ కంపెనీలకు ప్రవాస భారతీయులే సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడా జాబితాలో మరో పేరు చేరనుంది. కేరళకు చెందిన రాజ్ సుబ్రహ్మణ్యంను ప్రఖ్యాత డెలివరీ సంస్థ ఫెడెక్స్ సీఈవోగా నియమిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం సీఈవోగా వ్యవహరిస్తున్న సంస్థ వ్యవస్థాపకుడు ఫ్రెడరిక్ డబ్ల్యూ స్మిత్ స్థానంలో ఆయన ఎంపిక జరగటం విశేషం. జూన్ ఒకటి నుంచి మనోడి సారథ్యంలో …
Read More »రష్యా ఉక్రెయిన్ చర్చలు సఫలం.. యుద్ధం ముగిసినట్టే!
రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగింపు దిశగా అడుగులు పడుతున్నాయి. ఉక్రెయిన్ రాజధాని సహా కీలక నగరాల్లో సైన్యాన్ని తగ్గిస్తామని రష్యా ప్రకటించింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య టర్కీలోని ఇస్తాంబుల్లో జరిగిన చర్చలు ఫలప్రదంగా సాగాయి. యుద్ధం ముగింపు దిశగా అడుగులు వేసేలా రెండు దేశాల మధ్య కీలక ఏకాభిప్రాయం కుదిరింది. రాజధాని కీవ్ సహా మరో ప్రధాన నగరమైన చెర్నిహివ్లో సైన్యాన్ని తగ్గిస్తామని రష్యా ప్రకటించింది. అంతకుముందు జరిగిన కొన్ని …
Read More »ఇక నుంచి ఉక్కు లాంటి రోడ్లు.. సరికొత్త ప్రయోగం!
రోడ్లు పాడైపోవటం దేశంలో పెద్ద సమస్యగా మారింది. సిమెంటు రోడ్డైనా, తారు రోడ్డయినా వేసిన కొద్దిరోజులకే కొండెక్కిపోతోంది. దాంతో గతుకుల రహదారుల్లోనే జనాలు ప్రయాణించాల్సొస్తోంది. దీనివల్ల ప్రజలు తీవ్ర అసౌకర్యాలకు గురవ్వక తప్పటం లేదు. అందుకనే కేంద్ర ప్రభుత్వం రోడ్డు నిర్మాణంలో వినూత్న ప్రయోగం చేసింది. అదేమిటంటే ఉక్కు వ్యర్థాలతో రోడ్డు వేయాలని డిసైడ్ అయ్యింది. అలా డిసైడ్ కాగానే రంగంలోకి దిగేసింది. గుజరాత్ లోని సూరత్ నగరంలో హజీరా …
Read More »అయోమయంలో వైద్య విద్యార్థులు
ఉక్రెయిన్ నుండి ఇండియాకు తిరిగొచ్చిన వైద్య విద్యార్థుల అయోమయంలో కూరుకుపోతున్నారు. ఉక్రెయిన్ లో మన దేశానికి చెందిన 18 వేల మంది విద్యార్థులు మెడిసిన్ చదువుతున్నారు. యుద్ధం కారణంగా అకస్మాత్తుగా ఈ 18 వేలమంది విద్యార్ధులంతా దేశానికి తిరిగొచ్చేశారు. ఇందులో కనీసం వెయ్యి మంది విద్యార్ధులు ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులున్నారు. తాజా పరిస్ధితులను గమనిస్తుంటే యుద్ధం ఇప్పటిలో ఆగేట్లులేదు. ఒకవేళ యుద్ధం ఆగినా మళ్ళీ ఉక్రెయిన్ సాధారణ …
Read More »