సినీ రంగంలోనే కాదు.. క్రీడా రంగంలో కూడా ఇటీవల విడాకుల వార్తలు ఎక్కువైపోయాయి. ఇండియన్ క్రికెట్లో మీడియా దృష్టిని బాగా ఆకర్షించిన జంటల్లో ఒకటనదగ్గ యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీల ఐదేళ్ల బంధానికి తెరపడిపోయినట్టేనని చెప్పాలి. వీళ్లిద్దరూ విడిపోతున్నట్లు ఏడాది కిందటే వార్తలు మొదలయ్యాయి. ఇప్పుడు అది అధికారికం అయింది. దాదాపు 18 నెలలుగా విడిగా ఉంటున్న ఈ జంట.. గత ఏడాది విడాకుల కోసం దరఖాస్తు చేయగా.. కోర్టు తాజాగా వారికి విడాకులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా చాహల్ నుంచి ధనశ్రీ భారీ మొత్తంలో భరణం తీసుకుంటున్నట్లు ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ మొత్తం ఏకంగా రూ.60 కోట్లు అని వార్తలు వస్తున్నాయి.
దీని గురించి తెలుసుకుని.. ధనశ్రీని గోల్డ్ డిగ్గర్ అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఐతే ఈ ప్రచారంపై ధనశ్రీ కుటుంబం స్పందించింది. భరణం గురించి మీడియాలో వస్తున్న వార్తలు అర్థరహితమని ధనశ్రీ కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. అంత పెద్ద మొత్తం అడగడం కానీ, డిమాండ్ చేయడం కానీ.. అటు వైపు నుంచి తమకు ఇవ్వజూపడం కానీ జరగలేదని.. ఇంతటితో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాలని వారు కోరారు. మీడియా బాధ్యతతో వ్యవహరించాలని, కుటుంబ వ్యవహారాల గురించి ఇలా వార్తలు ప్రచురించడం సరి కాదని హితవు పలికారు.
యూట్యూబర్ అయిన ధనశ్రీని చాహల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఐతే రెండేళ్లకు మించి వీరి బంధం సజావుగా సాగలేదు. పెళ్లయిన మూడో ఏడాది నుంచే అభిప్రాయ భేదాలంటూ వార్తలు వచ్చాయి. వీళ్లిద్దరికీ సెట్ కాదంటూ నెటిజన్లు రకరకాల వ్యాఖ్యానాలు చేసేవారు. మరో భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌తో కలిసి ధనశ్రీ డ్యాన్స్ చేస్తే దాని మీద రకరకాల ఊహాగానాలు క్రియేట్ చేశారు. ధనశ్రీ డబ్బు కోసమే చాహల్‌ను పెళ్లాడిందని ఆమెను చాలామంది నెటిజన్లు టార్గెట్ చేశారు. వీళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో కానీ.. ఇప్పుడు అధికారికంగా విడిపోయారన్న వార్తలు జోరుగా సాగుతున్నాయి.
అయితే విడాకుల గురించి వీళ్లిద్దరూ ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం. వారి తల్లిదండ్రులు కూడా వారు అధికారికంగా ప్రకటేయించేవరకు ఎటువంటి ఊహాగానాలు నమ్మొద్దని చెబుతున్నారు. అటు ధనశ్రీ తరుపున లాయర్ కూడా అనవసరంగా మీడియా అసత్య ప్రచారం చేయడం సరికాదని… విడకులపై వాళ్లిద్దరూ అధికారికంగా ప్రకటించే వరకు ఈ ప్రచారాలు మానుకోవాలని చెప్పడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates